Just TelanganaLatest News

Bus accident: చేవెళ్ల బస్సు ప్రమాదం..ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Bus accident: క్షతగాత్రుల్లో కొందరికి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ ఆస్పత్రులకి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు.

Bus accident

నవంబర్ 03, 2025 సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న దుర్ఘటన యావత్ తెలంగాణను విషాదంలోకి నెట్టింది. అతివేగం , నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ(Bus accident) ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య పెరిగింది.

తాజా అప్‌డేట్ ప్రకారం..ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతుండగానే, మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.మొత్తం మృతులు24 మందికి చేరగా..40 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 20 మంది పరిస్థితి విషమంగా ఉంది.క్షతగాత్రుల్లో కొందరికి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ ఆస్పత్రులకి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.మృతుల కుటుంబాలకు: రూ. 7 లక్షల చొప్పున పరిహారం.క్షతగాత్రులకు (గాయపడిన వారికి).. రూ. 2 లక్షల చొప్పున పరిహారం.రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

ప్రస్తుతం రాజకీయం చేసే సమయం కాదని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయంచేవెళ్ల బస్సు ప్రమాదం(Bus accident)పై ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం ప్రకటించారు.మృతుల కుటుంబాలకు: రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం.క్షతగాత్రులకు: రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ రెండు ప్రభుత్వాల ప్రకటనలతో, మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కలిపి మొత్తం రూ. 9 లక్షల పరిహారం అందనుంది.

కర్నూల్ బస్సు ప్రమాదం(Bus accident) మరువక ముందే జరిగిన ఈ చేవెళ్ల దుర్ఘటనలో, తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొనడం వలన మృతుల సంఖ్య 24కు పెరిగింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button