Just TelanganaJust Lifestyle

Therapy : లవ్లీ థెరపీ..ఆ ఎయిర్‌పోర్ట్‌లో మాత్రమే..

Therapy : టెన్షన్, స్ట్రెస్, ఆందోళనను జస్ట్ చిటికెలో దూరం చేసేందుకు, RGIA ఒక అద్భుతమైన, హార్ట్‌ను టచ్ చేసే 'పాజ్ & పీస్' (Paws & Peace) ప్రోగ్రామ్‌ను లాంచ్‌ చేసింది.

Therapy: మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కే ముందు కొద్దిగా కంగారుగా, బెంగగా లేదా జస్ట్ ఏదో తెలియని ఆందోళనతో ఉన్నారా? అయితే ఇక ఆ టెన్షన్ గుడ్‌బై చెప్పేయండి. ఎందుకంటే మీకోసం క్యూట్‌, సాఫ్ట్‌, సూపర్‌ ఫ్రెండ్లీ థెరపీ డాగ్స్ మీకు అప్పటికప్పుడు రిలీఫ్‌ ఇచ్చేందుకు రెడీగా ఉంటాయి. వాటి వెచ్చని టచ్‌, అన్‌కండిషనల్‌ లవ్ నిండిన చూపు, ఆడుకోవడానికి వాటికున్న ఎనర్జీ… ఇవన్నీ మీ స్ట్రెస్‌ను ఇట్టే దూరం చేసి, ప్రయాణాన్ని మరింత ప్లెజెంట్‌గా మారుస్తాయి. నిజంగా, వాటి దగ్గరికి వెళ్లి కాసేపు ఆడితే చాలు, మీ మైండ్ ఒక ఫ్రెష్‌ ఫీలింగ్‌తో కూల్‌ అవుతుంది. ఎయిర్ పోర్టులోనే ఎంచక్కా ఈ అనుభవాన్ని ఫేస్ చేయొచ్చు.

Therapy

అవును ..శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (RGIA) ఇప్పుడు ప్రశాంతతకు, కొత్త అనుభూతులకు ఒక డెస్టినేషన్‌గా మారుతోంది. ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు చాలామందిలో కనిపించే కామన్‌ టెన్షన్, స్ట్రెస్, ఆందోళనను జస్ట్ చిటికెలో దూరం చేసేందుకు, RGIA ఒక అద్భుతమైన, హార్ట్‌ను టచ్ చేసే ‘పాజ్ & పీస్’ (Paws & Peace) ప్రోగ్రామ్‌ను లాంచ్‌ చేసింది. ఈ ప్రాజెక్ట్‌ కింద, స్పెషల్‌ ట్రైనింగ్ పొందిన థెరపీ డాగ్స్‌ను ఎయిర్‌పోర్ట్‌లోని కీలక ఏరియాస్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ఎక్స్పీరియన్స్ కోసం అయినా ఒక్కసారైనా ఎయిర్‌పోర్టుకు వెళ్లాలి అనిపించేంత అట్రాక్టివ్‌గా ఇది మారింది.

ఈ ఇనిషియేటివ్ ప్రయాణికుల ఎక్స్‌పీరియన్స్‌ను మరిచిపోకుండా చేయడానికి, వారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి RGIA తీసుకుంటున్న వినూత్నమైన, ఫ్యూచరిస్టిక్‌ స్టెప్స్‌లో ఇది ఒకటి. ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా చాలా అధ్యయనాలు థెరపీ డాగ్స్‌తో స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రూవ్ చేశాయి. ఇప్పుడు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులోనూ ఈ యూనిక్ సర్వీస్ అందుబాటులోకి రావడంతో, ఇది కేవలం రవాణా కేంద్రం మాత్రమే కాకుండా, ప్రశాంతతను అందించే ఒక పీస్ హావెన్‌గా మారుతోంది.

కుటుంబంతో వెళ్తున్నా, బిజినెస్ ట్రిప్ అయినా, లేదా సోలో ట్రావెలర్ అయినా… ఈ ఫోర్-లెగ్‌డ్‌ ఫ్రెండ్స్ మీ జర్నీలో ఓ పాజిటివ్‌ వైబ్‌ను క్రియేట్ చేస్తాయి. ప్రయాణానికి ముందు ఈ డాగ్స్‌తో కాసేపు ఆడుకోవడం, వాటిని పలకరించడం వల్ల మీ మూడ్ రిఫ్రెష్ అవుతుంది. ఇది కేవలం ఒక సర్వీస్ కాదు, ప్రయాణికులకు RGIA ఇస్తున్న ఒక ‘వార్మ్ వెల్‌కమ్’ అని ఎయిర్ పోర్టు అధికారులు చెబుతున్నారు. ఈ లవ్‌లీ థెరపీ డాగ్స్‌తో మరింత ప్రశాంతంగా, ఆనందంగా, మెమరబుల్‌గా సాగే ప్రయాణం కోసం అర్జంటుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మీదుగా జర్నీ ప్లాన్ చేసుకోండి మరి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button