Higher studies: హయ్యర్ స్టడీస్ కోసం గ్యారంటీ లేకుండా లోన్ కావాలా..?
Higher studies: దాదాపు 45-50 శాతం మంది అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

Higher studies
ఉన్నత విద్యను అభ్యసించాలనే కల చాలామందికి ఉంటుంది, కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల అది వీలు కావడం లేదు. ముఖ్యంగా గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఫీజులు, వసతి, రవాణా వంటి ఖర్చులు భరించడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టి, ప్రతిభ ఉన్న విద్యార్థులు ఉన్నత విద్య(higher studies)ను అభ్యసించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పథకం (PM VidyaLaxmi Scheme). ఇది వారికి ఒక కొత్త ఆశను, అవకాశాన్ని అందిస్తోంది.
“వికసిత్ భారత్” నిర్మాణంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, ఈ పథకం ద్వారా ఆర్థిక పరిస్థితులు అడ్డు రాకుండా చూడాలని భావిస్తోంది. అయితే, సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ పథకం గురించి చాలామందికి తెలియడం లేదు. దాదాపు 45-50 శాతం మంది అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. విద్యార్థులు ఇంకా “రుణం అంటే భయం”, “గ్యారంటీ ఇవ్వాలి”, “ప్రాసెసింగ్ ఫీజులు కట్టాలి” వంటి అపోహలతో ఈ పథకానికి దూరంగా ఉంటున్నారు. కానీ ఇవేమీ అక్కరలేదు.
ఈ పథకానికి ఎటువంటి హామీ అవసరం లేదు. బ్యాంక్ గ్యారంటీ లేకుండానే తక్కువ వడ్డీకే రుణ సదుపాయం లభిస్తుంది. కేవలం ట్యూషన్ ఫీజులకే కాకుండా, వసతి, రవాణా, పుస్తకాలు వంటి ఇతర ఖర్చులకూ ఈ రుణం వర్తిస్తుంది. దేశంలో, విదేశాల్లోనూ విద్యార్థులు (Higher studies) భారత్‌లో చదివినా లేదా విదేశాలకు వెళ్ళినా ఈ పథకం ద్వారా లోన్ పొందొచ్చు. ప్రాసెసింగ్ ఫీజులు ఏమీ లేకుండా, కేవలం ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారానే ఈ ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే రుణం మంజూరు అయ్యే అవకాశం ఉంది.

ఈ పథకం గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. దీని కోసం ప్రతి స్కూల్, కాలేజీలో (Higher studies)అడ్మిషన్ సమయంలో ఈ పథకం వివరాలతో కూడిన పత్రాలను ఇవ్వాలి. గ్రామ సభలలో, విద్యా సదస్సులలో డిజిటల్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియను నేరుగా చూపించాలి. కేవలం పోస్టర్లు, ప్రకటనలకు పరిమితం కాకుండా సోషల్ మీడియా రీల్స్, మొబైల్ అప్లికేషన్ల ద్వారా కూడా ప్రచారం చేయాలి. ఉపాధ్యాయులకు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి ఈ పథకంపై పూర్తి శిక్షణ ఇస్తే, వారు విద్యార్థులను నేరుగా ప్రోత్సహించగలుగుతారు.
నిజానికి, డబ్బులు లేకపోతే కలలు ఆగిపోలేవు అనే సందేశాన్ని ఈ పథకం ద్వారా తెలియజేయాలి. ప్రాక్టికల్ లెవల్లో ప్రచారం చేస్తేనే ఈ పథకం లక్ష్యాన్ని చేరుకుంటుంది. అప్పుడే, ప్రతి విద్యార్థి తమ కలను సాకారం చేసుకుని, విద్యావంతమైన, వికసిత భారతదేశం కల నిజమవుతుంది.
Good idea sir many students struggle to study higher studies