Tragedy: గుండెను మెలిపెట్టే సంఘటన..రాఖీ పండుగకు ముందు విషాదం
Tragedy: కన్నుమూసిన తమ్ముడికి కడసారి రాఖీ కట్టి కన్నీళ్లు పెట్టుకున్న అక్క..!

Tragedy
ఖమ్మం(Khammam) జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామంలో చోటుచేసుకున్న ఒక విషాదకర సంఘటన అక్కడివారిని కంటతడి పెట్టించింది. అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగకు ఒక్కరోజు ముందు, కన్నుమూసిన తన తమ్ముడికి ఒక అక్క కడసారిగా రాఖీ కట్టిన దృశ్యం అక్కడున్నవారి మనసులను కలిచివేసింది.
ఆ గ్రామానికి చెందిన పందిరి అప్పిరెడ్డి కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ అకాల మరణం(Tragedy) చెందాడు. అతడి అక్క జ్యోతికి అప్పిరెడ్డి అంటే ప్రాణం. ఇద్దరి మధ్య అనుబంధం అంతగా బలమైనది. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున, జ్యోతి ఎంతో ఆనందంగా తన తమ్ముడికి రాఖీ కట్టి, తన ప్రేమను చాటుకునేది. పండుగకు ముందు రోజుల నుంచే రాఖీ కోసం ఎదురుచూసేది. అప్పిరెడ్డి కూడా అంతే ఆశగా అక్క కోసం ఎదురుచూసేవాడు.

ఈసారి కూడా రాఖీ పండుగ కోసం ఆ అన్న చెల్లెల్లు ఎదురుచూస్తున్నారు. కానీ విధి మరోలా తలచింది. రాఖీ కట్టాల్సిన రోజే తన తమ్ముడు(brother died before rakhi) ఈ లోకాన్ని వీడిపోయాడు. ఈ వార్త విన్న జ్యోతి గుండె ఆవేదనకు గురైంది. తన తమ్ముడు లేని రాఖీ పండుగ ఊహించుకోలేకపోయింది. చివరిసారిగా తమ్ముడిని చూడటానికి వచ్చిన జ్యోతి, చలనం లేకుండా ఉన్న తమ్ముడిని చూసి తల్లడిల్లిపోయింది.
పక్కన పడి ఉన్న రాఖీని తీసుకుని, చలనం లేకుండా పడి ఉన్న అప్పిరెడ్డి చేతికి కట్టింది. “ఇదే నా చివరి రాఖీ చిన్నా” అంటూ గుండెలవిసేలా రోదిస్తూ, కడసారి వీడ్కోలు పలికింది. అక్కడికి వచ్చిన వారందరూ ఆ దృశ్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ఎంత ముఖ్యమైనదో ఈ సంఘటన మరోసారి కళ్ల ముందు నిలిపేలా చేసింది.
One Comment