Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వద్దు, సీబీఐ విచారించాలి.. బండి కొత్త డిమాండ్ ఎందుకు?
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజం బయటపడనీయడం లేదు. SIT విచారణపై మాకు నమ్మకం లేదు… అందుకే కేసును CBIకి అప్పగించాలి” “నా ఫోన్ మాత్రమే కాదు, నా కుటుంబ సభ్యుల, నాకు దగ్గరి వారందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఇది రాజకీయ ప్రతీకారం తప్ప మిగతేదీ కాదు.”

Phone Tapping Case
తెలంగాణలో రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఈరోజు కొత్త మలుపు తీసుకుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ SIT విచారణకు హాజరై కీలక ఆధారాలు సమర్పించడంతో పాటు,సంచలన వ్యాఖ్యలు చేశారు.
విచారణకు వెళ్లే ముందు, హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బండి సంజయ్, కార్యకర్తలు, నేతలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి.. గెస్ట్ హౌస్ లోని SIT కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తన స్టేట్మెంట్ రికార్డు చేయించాక, మీడియాతో మాట్లాడారు.
బండి సంజయ్ ఏమన్నారంటే.. కాంగ్రెస్, BRS మధ్య గాఢ బంధం ఉంది. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజం బయటపడనీయడం లేదు. SIT విచారణపై మాకు నమ్మకం లేదు… అందుకే కేసును CBIకి అప్పగించాలి”
“నా ఫోన్ మాత్రమే కాదు, నా కుటుంబ సభ్యుల, నాకు దగ్గరి వారందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఇది రాజకీయ ప్రతీకారం తప్ప మిగతేదీ కాదు.”
“KCR హయాంలో నా ఫోన్ రోజూ ట్యాప్ చేశారు. అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయి, ఈరోజే SITకి ఇచ్చాను. ఈ కేసు చిన్నది కాదు — రాష్ట్ర ప్రజల గౌరవానికి సంబంధించినది.”
“రేవంత్ రెడ్డి మొదట KCRని జైలులో పెడతానన్నారు… ఇప్పుడు అలాంటిదేమీ లేదంటున్నారు. SIT పని తీరు చూస్తుంటే కొండ తవ్వి ఎలుక కూడా రాలేదు.”
“మా ఫోన్లు ట్యాప్ (Phone Tapping Case) చేసినవాళ్లను బయటకు తీయకపోతే పోరాటం ఆగదు అని బండి సంజయ్ మీడియా ముందు చెప్పారు.

ఆయనతో పాటు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్, మంత్రి పీఆర్ఓ పసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా SIT విచారణకు హాజరయ్యారు.
అసలీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలా బయటపడిందనే వివరాలు చూస్తే.. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగాన్ని రివ్యూ చేసింది. అప్పట్లో SIB (Special Intelligence Branch) లో “Special Operations Team” అనే యూనిట్ ఏర్పాటై, గత ప్రభుత్వ హయాంలో 1000 మందికి పైగా రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, బిజినెస్ మెన్, అధికారులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఆ జాబితాలో బండి సంజయ్(Bandi Sanjay), ఆయన కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు, కొన్ని కాంగ్రెస్ నాయకుల పేర్లు కూడా ఉన్నట్టు లీకైంది. ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్లో అప్పటి DSP ప్రణీత్ రావు, ఇతర అధికారుల ప్రమేయం బయటపడింది. ఆధారాలు చెరిపివేయడానికి కంప్యూటర్ల నుంచి డేటా డిలీట్ చేసినట్టు తేలింది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయి SIT దర్యాప్తు ప్రారంభమైంది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావుపై NBW కూడా జారీ అయ్యింది.
ప్రస్తుతం. బీజేపీ, ఈ కేసును కేవలం తెలంగాణ రాష్ట్ర సమస్యగా కాకుండా జాతీయ స్థాయి రాజకీయ టాపిక్‌గా తీసుకెళ్తోంది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో కూడా పెద్ద మొత్తంలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. SIT విచారణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, CBI దర్యాప్తు మాత్రమే నమ్మకం కలిగిస్తుందని బండి సంజయ్ అంటున్నారు.
మొత్తంగా ఈ కేసు (Phone Tapping Case) ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద అజెండాగా మారింది. బండి సంజయ్ నిఘా సంస్థలతో కలిసి సేకరించిన ఆధారాలు, కేసు CBIకి వెళ్లాలన్న డిమాండ్, రేవంత్–KCR మాటల యుద్ధం… ఇవన్నీ కలిపి ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో అన్న ఉత్కంఠను పెంచుతున్నాయి.
Also Read: Tragedy: గుండెను మెలిపెట్టే సంఘటన..రాఖీ పండుగకు ముందు విషాదం