Just TechnologyLatest News

WhatsApp: వాట్సాప్, వాట్సాప్ బిజినెస్ మధ్య తేడాలు తెలుసా?

WhatsApp:  సాధారణ వాట్సాప్ , వాట్సాప్ బిజినెస్: పూర్తి వివరాలు

WhatsApp

ప్రస్తుత కాలంలో వాట్సాప్( WhatsApp)ని ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనికి తగ్గట్టే, వాట్సాప్ కూడా కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది. చాలామంది సాధారణ వాట్సాప్‌ను పర్సనల్‌గాను, వాట్సాప్ బిజినెస్‌ను వ్యాపార అవసరాల కోసం వాడుతుంటారు. ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను ఇప్పుడు మనం చూద్దాం.

వాట్సాప్ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులతో వ్యక్తిగత కమ్యూనికేషన్ కోసం ఉచితంగా ఉపయోగపడే అప్లికేషన్. ఇందులో మనం సాధారణ మెసేజింగ్, వాయిస్, వీడియో కాల్స్, గ్రూప్ చాట్స్ వంటి ఫీచర్లను వాడుకోవచ్చు. అయితే, ఇది వ్యాపార అవసరాలకు అనువుగా ఉండదు.

(Business WhatsApp) వాట్సాప్ బిజినెస్ అనేది చిన్న, పెద్ద వ్యాపారాల కోసం రూపొందించబడిన ఒక ప్రత్యేక అప్లికేషన్. ఇది వ్యాపారులు తమ కస్టమర్లతో సులభంగా కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుంది.

బిజినెస్ ప్రొఫైల్ (Business Profile): వాట్సాప్ బిజినెస్ ఖాతాలో ‘B’ అనే లోగో ఉంటుంది. ఇందులో వ్యాపార యజమానులు తమ వ్యాపారానికి సంబంధించిన వివరాలు, వెబ్‌సైట్, చిరునామా, పని వేళలు వంటి వివరాలను పొందుపరచవచ్చు. దీంతో కస్టమర్లు సులభంగా సంప్రదించవచ్చు.

కేటలాగ్ (Catalog): వ్యాపారులు తమ ఉత్పత్తులు లేదా సేవలను ప్రదర్శించడానికి కేటలాగ్ అనే ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. దీని ద్వారా కస్టమర్లు నేరుగా ఉత్పత్తులను చూసి ఆర్డర్ చేయవచ్చు.

ఆటోమేటెడ్ మెసేజెస్ (Automated Messages): వాట్సాప్ బిజినెస్‌లో ఆటోమేటెడ్ రిప్లైలు సెట్ చేయవచ్చు. ఉదాహరణకు, కస్టమర్ ఒక మెసేజ్ పంపగానే, ఆటోమేటిక్‌గా ఒక స్వాగత సందేశం (welcome message) లేదా తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు (FAQ) పంపేలా సెట్ చేసుకోవచ్చు. అలాగే, పని వేళలు లేనప్పుడు మెసేజ్ పంపితే, అది వ్యాపారం మూసి ఉందని తెలియజేస్తుంది.

whatsapp
whatsapp

బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ (Broadcast List): ఒకేసారి ఎక్కువ మంది కస్టమర్లకు మెసేజ్‌లు పంపడానికి బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

పేమెంట్స్ (Payments): ఈ అప్లికేషన్‌లో కస్టమర్లతో నేరుగా పేమెంట్స్ ఆప్షన్‌ను సెట్ చేయవచ్చు.

వెరిఫైడ్ అకౌంట్ (Verified Account): పెద్ద కంపెనీలకు వెరిఫైడ్ అకౌంట్ ఫ్రొపైల్ లభిస్తుంది. దీనివల్ల కస్టమర్లకు నమ్మకం పెరుగుతుంది.

సింపుల్ గా చెప్పాలంటే, సాధారణ వాట్సాప్ వ్యక్తిగత అవసరాలకు సరిపోతుంది. కానీ, వ్యాపారం చేసే వారికి, తమ ఉత్పత్తులు, సేవలను ఎక్కువ మందికి చేరవేయాలనుకునే వారికి వాట్సాప్ బిజినెస్ చాలా ఉపయోగకరమైన ఫీచర్లతో కూడిన ఒక చక్కని సొల్యూషన్.

Also Read: Kamal: సనాతనంపై మళ్లీ విమర్శలు.. కమల్ వ్యాఖ్యలతో మరోసారి రచ్చ

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button