Latest News

Paper Cups :పేపర్ కప్పులో టీ తాగుతున్నారా? అయితే మీరు టీ కాదు..లిక్విడ్ పాయిజన్‌ను తాగుతున్నారట..

Paper Cups: వేడి వేడి టీ లేదా కాఫీ ఆ కప్పులో పోయగానే, ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి మనం తాగే టీ, కాఫీలలో కలిసిపోతుంది.

Paper Cups

ఈ రోజుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్తే చాలు.. ఆఫీసు బ్రేక్ అయినా, ఫ్రెండ్స్‌తో కబుర్లయినా చేతిలో టీ కప్పు ఉండాల్సిందే. కొందరైతే ఆరోగ్యానికి మంచిదని గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి తాగుతారు. కానీ, దురదృష్టవశాత్తూ పేపర్ కప్స్‌(Paper Cups)లో వీటిని తాగుతూ.. దేనిలో తాగుతున్నామనే విషయాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోతున్నారు. కొంతమందికి దీనిపై అవగాహన ఉన్న హా ఏమవుతుందిలే అని తాగేస్తుంటారు.

అయితే పేపర్ కప్పులని మనమంతా పిలుచుకునే ఆ కప్పులు నిజానికి కేవలం పేపర్‌తోనే చేసినవి కావు, వాటి లోపల ప్లాస్టిక్ అంటే పాలిథిలిన్ పొర ఉంటుంది. వేడి వేడి టీ లేదా కాఫీ ఆ కప్పులో పోయగానే, ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి తాగే టీ, కాఫీలలో కలిసిపోతుంది. అంటే, మనం తాగేది టీ, కాఫీ కాదు.. కరిగిన ప్లాస్టిక్ అన్నమాట.

ఒక్క పేపర్ కప్పు(Paper Cups)లో ఎన్ని మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయో తెలిస్తే తప్పకండా షాక్ అవుతారు. ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకారం, ఒక ప్లాస్టిక్ కప్పులో వేడి వేడి నీళ్లు, టీ, కాఫీ, పాలు, రాగిజావ,సూప్ వంటివి పోసినప్పుడు, కేవలం 15 నిమిషాల వ్యవధిలో సుమారు 25,000 మైక్రో ప్లాస్టిక్ కణాలు (Microplastics) ఆ పానీయంలో కలిసిపోతాయి. అంతేకాదు వీటితో పాటు బోనస్‌గా క్రోమియం, కాడ్మియం వంటి భారీ లోహాలు కూడా శరీరంలోకి ప్రవేశిస్తాయి.

మనం కంటితో చూడలేని ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలన్నీ మన రక్తంలో కలిసిపోయి, శరీరంలోని వివిధ అవయవాలకు చేరుకుంటాయి. ఈ లెక్కన మనం రోజుకు రెండు మూడు సార్లు ప్లాస్టిక్ కప్పులో టీ, కాఫీ తాగితే, ఏడాదికి ఎన్ని కోట్ల ప్లాస్టిక్ కణాలను మన శరీరంలోకి పంపిస్తున్నామో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది.

ఇలా ఈ ప్లాస్టిక్ కణాలన్నీ మన బాడీలోకి చేరడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. మెయిన్‌గా పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం, మహిళలల్లో గర్భకోశ సమస్యలు రావడానికి హార్మోన్ల అసమతుల్యత ఒక ప్రధాన కారణం అని డాక్టర్లు చెబుతున్నారు. అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే.. ఈ మైక్రో ప్లాస్టిక్స్ క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయని అధ్యయనాలు నిరూపించాయి.

ఈ ప్లాస్టిక్ కణాలు కిడ్నీలు, కాలేయం , పేగుల పనితీరును దెబ్బతీస్తాయి. వేడి వస్తువు ప్లాస్టిక్ తో రియాక్టయినపుడు విడుదలయ్యే ‘బిస్ఫినాల్-ఎ’ (BPA) అనే కెమికల్ మెదడు ఎదుగుదలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. చివరకు మనం ఆరోగ్యానికి మంచిదని తాగే గ్రీన్ టీ కూడా ప్లాస్టిక్ కప్పులో పడగానే శరీరానికి హాని చేసే విషంగానే మారిపోతుంది.

Paper Cups
Paper Cups

తెలిసీ,తెలియక మనం చేసే ఈ చిన్న పొరపాటు.. మనల్ని దీర్ఘకాలిక రోగాల వైపు నెట్టేస్తోందన్న విషయాన్ని అంతా తెలుసుకోవాలి. దీని నుంచి బయటపడాలంటే మనం పాత పద్ధతులకు మళ్లీ ప్రాణం పోయాలి.

టీ బడ్డీ దగ్గర పేపర్ కప్పులొద్దని .. గాజు, స్టీల్ గ్లాసులు కానీ, మట్టి కప్పుల (Kulhads)ను కానీ వాడాలని వివరించి చెప్పండి. దాని వల్ల వారు టీ కప్పుల ఖర్చును తగ్గించుకోవడంతో పాటు తమ దగ్గరకు వచ్చే కస్టమర్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడినవారవుతారన్న విషయాన్ని గుర్తు చేయండి. ఒక్క కప్పు టీనే కదా ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎందుకంటే ఆ ఒక్క కప్పే రేపు మీకు ప్రాణ సంకటంగా మారొచ్చు. అందుకే ప్లాస్టిక్ కప్పును పక్కన పెట్టి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

One Comment

  1. Interesting read! Understanding player psychology is key, especially with diverse platforms like jl78 slot download offering so many game options. Responsible gaming & solid security are crucial, too. Good insights here!

Back to top button