Just NationalLatest News

Messi Fans: కోల్‌కతాలో మెస్సీ ఫ్యాన్స్ విధ్వంసం.. హైదరాబాద్‌లో హై అలర్ట్

Messi Fans: కోల్‌కతాలో జరిగిన ఈ సంఘటన వల్ల హైదరాబాద్ పోలీసులు వెంటనే హై అలర్ట్ ప్రకటించి, అప్రమత్తం అయ్యారు.

Messi Fans

ప్రపంచ దిగ్గజాలను, సెలబ్రెటీలను కళ్లారా చూడాలనే ఆరాటం, అభిమానం ఉండొచ్చు. కానీ అది హద్దు మీరి, ఆ అభిమానించే వారినే ఇబ్బంది పెట్టే స్థాయికి, విధ్వంసానికి దారితీయకూడదు. కోల్‌కతాలో మెస్సీని చూసేందుకు వచ్చిన అభిమానులు(Messi Fans) ఇదే ప్రూవ్ చేశారు ఇప్పుడు.

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi Fans) గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో మొదటి అడుగుగా మెస్సీ శనివారం ఉదయం కోల్‌కతాలో (Kolkata) పర్యటించారు. మెస్సీ పర్యటనను చారిత్రక ఘట్టంగా మార్చడానికి కోల్‌కతా రాష్ట్ర ప్రభుత్వం , నిర్వాహకులు చాలా ప్రయత్నాలు చేశారు.

ఆ రాష్ట్ర మంత్రి సుజిత్ బోస్ చొరవతో లేక్ టౌన్‌లో మెస్సీకి అంకితం చేస్తూ ఒక విగ్రహాన్ని తయారు చేశారు. శనివారం ఉదయం ఈ విగ్రహాన్ని మెస్సీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌తో (Shahrukh Khan) కలిసి మరో ఫుట్‌బాల్ యువరాజు మారడోనా స్వయంగా ఆవిష్కరించారు. ఈ దృశ్యం మెస్సీ అభిమానులకు పెద్ద పండుగ వాతావరణాన్ని సృష్టించింది.

Messi Fans
Messi Fans

అనంతరం మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియానికి చేరుకున్నారు. మెస్సీ రాక కోసం వేల సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. మెస్సీ తమ ముందు మ్యాచ్ ఆడుతాడని లేదా కనీసం కొంతసేపైనా మైదానంలో గడుపుతాడని వారు భారీగా ఆశించారు. అయితే, ఇక్కడే అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

మెస్సీ స్టేడియం లోపల నిమిషాల వ్యవధిలోనే కార్యక్రమాన్ని ముగించుకుని, త్వరగా వెళ్లిపోవటం మెస్సీ అభిమానులకు(Messi Fans) ఏమాత్రం నచ్చలేదు. తమ ఆశలు అడియాశలు కావడంతో, అభిమానులు ఆగ్రహంతో ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు. ఈ నిరాశ కాస్తా విధ్వంసానికి దారితీసింది.

ఆగ్రహంతో ఉన్న అభిమానులు స్టేడియం లోపలే అల్లర్లకు పాల్పడ్డారు. వారు స్టేడియంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. అలాగే, చేతిలో ఉన్న వాటర్ బాటిళ్లను, ఇతర వస్తువులను మైదానంలోకి విసిరి వేసారు. ఈ ఘటనతో కోల్‌కతాలో ఒకరకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Messi Fans
Messi Fans

కోల్‌కతాలో జరిగిన ఈ సంఘటన వల్ల హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) వెంటనే హై అలర్ట్ ప్రకటించి, అప్రమత్తం అయ్యారు. మెస్సీ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో ‘గోట్ కప్’ ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మెస్సీతో కలిసి ఆడనుండటంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది.

ముఖ్యమంత్రి పాలుపంచుకుంటుండటం, అలాగే కోల్‌కతాలో జరిగిన సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు, హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ మైదానం వద్ద అదనపు పోలీసు బలగాలు మోహరించాయి.

అభిమానులు మైదానంలోకి దూసుకురాకుండా ఉండేందుకు, అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఉప్పల్ మ్యాచ్‌ను విజయవంతం చేయడానికి పోలీసులు పూర్తి నిఘా ఉంచి, గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button