Latest NewsJust Telangana

CBI:సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు.. తెలంగాణ రాజకీయాల నుంచి న్యాయవ్యవస్థ వరకూ

CBI:రూ. లక్ష కోట్లు విలువ చేసే 'కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి' కేసు తర్వాత,ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా సీబీఐకి అప్పగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.

Phone tapping case to CBI

తెలంగాణ రాజకీయాలను ఇప్పుడు పెను తుఫానులా కుదిపేస్తున్న అంశం ‘ఫోన్ ట్యాపింగ్‘ కేసు. గత ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలతో తెరపైకి వచ్చిన ఈ కేసు, ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో మరింత ఉద్రిక్తంగా మారింది. రూ. లక్ష కోట్లు విలువ చేసే ‘కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి’ కేసు తర్వాత,ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా సీబీఐకి అప్పగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారి తీస్తోంది.

ఈ ఫోన్ ట్యాపింగ్ స్కాండల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా 2018-2023 మధ్య కాలంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) ఆధ్వర్యంలో రాజకీయ ప్రత్యర్థులు, బీజేపీ నేతలు, జడ్జిలు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు , సినీ ప్రముఖులతో సహా సుమారు 1,600 మంది ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేయబడినట్లు సిట్ (Special Investigation Team) దర్యాప్తులో వెల్లడైంది.

Phone tapping case to CBI
Phone tapping case to CBI

ఈ ట్యాపింగ్ ‘ప్రజా భద్రత’ పేరుతో జరిగిందని చెబుతున్నా, దాని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని సిట్ తేల్చి చెప్పింది. మాజీ SIB చీఫ్ టి. ప్రభాకర్ రావు, మాజీ డీసీపీలు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు వంటి కీలక అధికారులు ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ముఖ్యంగా, బండి సంజయ్, రేవంత్ రెడ్డి వంటి ప్రతిపక్ష నేతల ఫోన్లు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసు వెలుగులోకి రావడానికి కారణం, 2024 మార్చిలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఒక కేసు. అప్పటి బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మీడియా ముందు ప్రచారం చేసి, తన ఫోన్‌తో పాటు , కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. దీనిపై రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేయడంతో సిట్ విచారణ ముమ్మరం చేసింది. విచారణలో కొంతమంది పోలీసులు విదేశీ పరికరాలను వాడారని, ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించారని తేలింది. ఈ వ్యవహారంలో కీలక అధికారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు కేవలం రాజకీయ నాయకులకే కాకుండా, న్యాయవ్యవస్థ, మీడియా , వ్యాపార వర్గాలపై కూడా ప్రభావం చూపింది. హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటుందని విశ్లేషణలు వెలువడ్డాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కేసులో ‘నిజమైన, పారదర్శక విచారణ’ కోసం సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఇది రాజకీయంగా అనేక ఆరోపణలకు, ప్రతి ఆరోపణలకు దారితీస్తోంది. బీజేపీ నాయకులు సిట్ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని, సీబీఐ విచారణ అవసరమని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ కేసులో బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పాయి. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ ,భద్రతపై ఈ వ్యవహారం చూపిన ప్రభావం, ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల జవాబుదారీతనంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది.

                   Special Buses :పండుగకు ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్.. 7,754 ప్రత్యేక బస్సులు రెడీ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button