Just LifestyleLatest News

Pournami Night : ఈ పౌర్ణమి రాత్రి మీ మైండ్‌ను మార్చుకోండి? పౌర్ణమి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకోండి?

Pournami Night : ఆకాశంలో వెన్నెలను, పున్నమి చంద్రుడిని చూసి మురిసిపోవడమే కాదు.. మైండ్‌ను కంప్లీట్‌గా రీఛార్జ్ చేసుకుని కొత్త ఎనర్జీని పొందడమే పౌర్ణమి అసలైన సీక్రెట్ అని గుర్తుంచుకోండి.

Pournami Night

పౌర్ణమి పేరు చెప్పగానే సాధారణంగా ఆకాశంలో కనిపించే నిండు చందమామ, ఆ చల్లని వెన్నెల అందాలు మనకు గుర్తుకొస్తాయి. అయితే ఈరోజు అంటే సెప్టెంబర్ 26 వ తేదీ శనివారం రోజు వచ్చే పౌర్ణమి రాత్రి(Pournami Night) కేవలం కంటికి ఇంపుగా కనిపించే వెన్నెల వెలుగు ఒక్కటే కాదు.. మన మెదడును పూర్తిగా రీఛార్జ్ చేసే ఒక అద్భుతమైన పవర్ హౌస్ అని చాలామందికి తెలీదు.

భారతీయ సంప్రదాయంలో పౌర్ణమికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారు? అసలు ఆ రోజు మనిషి శరీరంలో, మనసులో ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయనే విషయాలపై తాజాగా నెట్టింట పెద్ద చర్చ సాగుతోంది. అయితే పౌర్ణమి అనేది మన శరీరం లోపల ఉన్న సౌండ్ సిస్టమ్ వాల్యూమ్‌ను ఒక్కసారిగా ఫుల్ వ్యాల్యూమ్‌కు పెంచేయడం వంటిదని ఆధ్యాత్తికవేత్తలు చెబుతారు.

అంటే ఆ సమయంలో మన మనసులో ప్రశాంతత ఉంటే ఆ ప్రశాంతత రెట్టింపవుతుంది. అలాగే ఆ సమయంలో ఒకవేళ ఆనందంలో ఉంటే అది మరింత హద్దులు దాటుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే మనలో మన మనసులో ఎలాంటి మూడ్ ఉందో దాన్ని మల్టిప్లై చేసే సత్తా ఈ పౌర్ణమి వెలుగులకు ఉంటుంది.

అందుకే చాలామంది ఈ ప్రత్యేకమైన రాత్రి.. ఆధ్యాత్మిక సాధకులకు, మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుకోవాలనుకునే వారికి ఒక వండర్‌ఫుల్ ఛాన్స్ అని అంటారు. విశ్వంలో నేచురల్‌గానే ఆ రోజు ఎనర్జీ ఫ్లో చాలా ఎక్కువలో ఉంటుంది. దీనివల్ల మన మైండ్ స్వీకరించే తత్వాన్ని అంటే రిసెప్టివిటీని గరిష్టంగా పొందుతుంది. అందుకే కొన్ని చోట్ల పౌర్ణమి రోజు స్పెషల్ ధ్యాన ప్రక్రియలు జరుపుతుంటారు.

ముఖ్యంగా బుద్ధ పౌర్ణమి వంటి రోజులు మనిషి మెంటల్ గ్రోత్‌కు, ఆలోచనా విధానంలో మార్పుకు ఎంతో సాయం చేస్తాయని మన పూర్వీకులు కూడా చెప్పారు. దీని కోసం మనం గంటలకు గంటలు కూర్చుని పూజలు చేయడం , కష్టమైన నియమాలు పాటించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. కాసేపు ఒక చోట కూర్చుని ప్రశాంతంగా మన ఆలోచనలను, శ్వాస తీరును గమనిస్తూ కళ్లు మూసుకుంటే చాలు, ఆ పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి నిండిపోతుంది.

ఈ సెప్టెంబర్ 26వ తేదీ పౌర్ణమిని మీ జీవితంలో ఒక మైండ్ సెట్ చేంజింగ్ మూమెంట్‌గా మార్చుకోవడానికి ఒక చిన్న సింపుల్ ట్రిక్ పాటించండి. ముందుగా మీ చేతిలోని మొబైల్‌ను పక్కన పెట్టి, ఏకాంతంగా కూర్చుని మీలోకి మీరు తొంగి చూడటానికి ప్రయత్నించండి.

Pournami Night
Pournami Night

మీ లైఫ్‌లో ఏ నెగెటివిటీని మీరు వదిలించుకోవాలని గట్టిగా అనుకుంటున్నారు? ఎలాంటి అలవాట్లను, లక్షణాలను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారు? అనే విషయాలను నోట్ చేసుకోండి. దీంతోనే మీ మైండ్ ఒక రేంజ్‌లో క్లియర్ అయిపోతుంది.

కేవలం ఆకాశంలో వెన్నెలను, పున్నమి చంద్రుడిని చూసి మురిసిపోవడమే కాదు.. మైండ్‌ను కంప్లీట్‌గా రీఛార్జ్ చేసుకుని కొత్త ఎనర్జీని పొందడమే పౌర్ణమి అసలైన సీక్రెట్ అని గుర్తుంచుకోండి. ఈ పౌర్ణమి రాత్రి(Pournami Night)ని రొటీన్ నైట్‌లా కాకుండా, మీలో దాగున్న ఓ కొత్త వెర్షన్‌ను తట్టిలేపే ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చుకోవడానికి ప్రయత్నించండి.

Relief On Power Charges : కరెంట్ ఛార్జీలపై ఊరట..వినియోగదారుల ఖాతాల్లోకి ట్రూడౌన్ డబ్బులు..

Related Articles

Back to top button