Investment:PPF,RD,FD లేక SIP..ఏది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్?
Investment: గతేడాది (2025)స్టాక్ మార్కెట్ , మ్యూచువల్ ఫండ్స్ ఆశించిన స్థాయిలో రాబడులు ఇవ్వకపోగా, కొన్ని ప్రతికూల ఫలితాలను కూడా ఇచ్చాయి.
Investment
చాలామంది పెట్టుబడిదారులకు తమ కష్టార్జితాన్ని ఎక్కడ దాచుకుంటే భద్రతతో పాటు మంచి లాభాలు వస్తాయి అన్న ప్రశ్న మైండ్‌లో వస్తూ ఉంటుంది. గతేడాది (2025)స్టాక్ మార్కెట్ , మ్యూచువల్ ఫండ్స్ ఆశించిన స్థాయిలో రాబడులు ఇవ్వకపోగా, కొన్ని ప్రతికూల ఫలితాలను కూడా ఇచ్చాయి. మరోవైపు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. దీంతో సురక్షితమైన, స్థిరమైన రాబడిని ఇచ్చే మార్గాల వైపు అందరూ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. పీపీఎఫ్, ఆర్డీ, ఎఫ్‌డీ , ఎస్‌ఐపీలలో ఏది బెస్ట్ ఆప్షనో ఇక్కడ చూద్దాం.
పీపీఎఫ్ (PPF)- భద్రతకు కేరాఫ్ అడ్రస్..ప్రభుత్వ హామీ ఉండే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు వరం వంటిది. 15 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న ఈ పథకంలో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో పెట్టే ఇన్వెస్ట్‌మెంట్(Investment), వచ్చే వడ్డీ , మెచ్యూరిటీ అమౌంట్.. ఈ మూడింటిపై పన్ను మినహాయింపు (EEE కేటగిరీ) ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి ఇదే బెస్ట్ ఛాయిస్.

ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) & రికరింగ్ డిపాజిట్ (RD).. బ్యాంకుల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో దాచుకోవాలనుకునే వారికి ఎఫ్‌డీలు (FD) సరైనవి. ప్రస్తుతం బ్యాంకులను బట్టి 6.4% నుంచి 7.3% వరకు వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్లకు మరింత ఎక్నట్రా ఇంట్రెస్ట్ దక్కుతుంది. అదే ప్రతి నెలా కొద్ది మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారికి ఆర్డీ (RD) ఉపయోగకరంగా ఉంటుంది. 4.25% నుంచి 6.70% వరకు వడ్డీ లభించే ఈ పథకం చిన్నపాటి పొదుపు అలవాటును పెంచుతుంది.
ఎస్‌ఐపీ (SIP)- రిస్క్ ఉన్నా లాభాలు ఎక్కువే.. మ్యూచువల్ ఫండ్లలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో 12 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది పూర్తిగా మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది ఫలితాలు కాస్త నిరాశపరిచినా, పదేళ్ల కాలపరిమితిని దృష్టిలో పెట్టుకునే వారికి ఎస్‌ఐపీ ఇప్పటికీ ఇది మంచిదే. అయితే ఇందులో ఇన్వెస్ట్(Investment) చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం అవసరం ఉంటుంది.
మొత్తంగా చెప్పాలంటే మీకు పన్ను ఆదా అండ్ పూర్తి భద్రత కావాలంటే పీపీఎఫ్, తక్కువ కాలానికి స్థిరమైన ఆదాయం కావాలంటే ఎఫ్‌డీ, మార్కెట్ రిస్క్ భరించగలం అంటే ఎస్‌ఐపీ(SIP)ని ఎంచుకోవచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోవడమే ఉత్తమం.
Depression :శ్రీలంక వద్ద తీరం దాటిన వాయుగుండం.. ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు,పెరగనున్న చలి



