Latest News

Sigmund Freud : మన లోపలి మనసు కథ ఏంటి? సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్పారు?

Sigmund Freud : ఫ్రాయిడ్ ఒక సైకాలజీ డాక్టర్‌గా.. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఎంతోమందిని చాలా దగ్గరగా పరిశీలిస్తూ ఈ ఒక థియరీని డెవలప్ చేశారు

Sigmund Freud

మనం డైలీ లైఫ్‌లో తీసుకునే నిర్ణయాలు, చూపించే కోపతాపాలు అన్నీ మనకు తెలిసి చేస్తున్నవే అనుకుంటాం. కానీ సైకాలజీలో మోస్ట్ పాపులర్ అయిన సైకోఅనాలిసిస్ సిద్ధాంతం ప్రకారం.. మనందరం చేసే పనుల వెనుక మనకు తెలీని ఒక అదృశ్య ప్రపంచం దాగి ఉంటుందట.

వరల్డ్ ఫేమస్ మైండ్ ఎక్స్‌పర్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్(Sigmund Freud) కనిపెట్టిన ఈ థియరీ ఏమని చెబుతుందంటే.. ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే కేవలం వారు మాట్లాడే మాటలు, వారు చేసే పనులు మాత్రమే చూస్తే సరిపోదట. వారి మనసు లోపల దాగి ఉన్న ఆలోచనలు, భయాలు, కోరికలు , చిన్ననాటి అనుభవాలను కూడా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది.

సాధారణంగా మనందరం బాగా ఆలోచించే నిర్ణయాలను తీసుకుంటున్నామని అనుకుంటాం. కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్(Sigmund Freud) మాత్రం మనలోని చాలా పనులు మనకు క్లారిటీగా తెలియని లోపలి మనసు వల్లే జరుగుతుంటాయని అంటారు. అంటే మన ప్రమేయం లేకుండా లోపల పని చేసే మనలోపల ఉన్న బలమైన ఫీలింగ్సే మనల్ని నడిపిస్తుంటాయన్న మాట.

ఫ్రాయిడ్ ఒక సైకాలజీ డాక్టర్‌గా.. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఎంతోమందిని చాలా దగ్గరగా పరిశీలిస్తూ ఈ ఒక థియరీని డెవలప్ చేశారు. కొంతమంది వ్యక్తులు అసలు ఎందుకు అంతగా భయపడుతుంటారు? చిన్నప్పుడు జరిగిన ఒకే ఒక్క చేదు అనుభవం ఒక మనిషిపై జీవితాంతం ఎందుకు అంతగా ఎఫెక్ట్ చూపిస్తుందనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఆయన మనసులోని లోతైన పొరలపై దృష్టి పెట్టారు.

మనిషి పడే ఇబ్బందులు కేవలం బయటి పరిస్థితుల వల్ల మాత్రమే రావని, గతంలో మనసు లోపల బలంగా అణచివేయబడిన బాధలు కూడా ఆ ఇబ్బందులకు కారణమవుతాయని సిగ్మండ్ ఫ్రాయిడ్(Sigmund Freud) నమ్మారు. అందుకే ఈ థియరీ కేవలం బుక్స్‌కు మాత్రమే కాకుండా.. మానసిక సమస్యలను తగ్గించే ఒక మంచి ట్రీట్‌మెంట్ లాగా కూడా ఉపయోగపడింది.

ఈ థియరీలో అత్యంత ముఖ్యమైన రోల్.. మనకు తెలియకుండా లోపల దాగి ఉండే ఆ లోపలి మనసుదేనని ఫ్రాయిడ్ తేల్చారు. ఇది మనకు పైకి కనిపించకపోయినా.. మనం మర్చిపోయిన చేదు అనుభవాలు, సొసైటీ కోసం లోపలే దాచుకున్న కోరికలు, బయటకు చెప్పలేని బాధలు అన్నీ ఇందులో దాగి ఉంటాయి.

ఉదాహరణకు ఒక వ్యక్తికి తన చిన్నతనంలో ఏదైనా అవమానం ఎదురైతే, అది మనసులో లోపల గట్టిగా ఉండిపోతుంది. దీనివల్ల ఆ వ్యక్తి పెద్దయ్యాక ఎవరైనా చిన్న మాట అన్నా అస్సలు భరించలేరు. పైకి ఇది సాధారణ కోపంగా కనిపించినా, లోపల మాత్రం అతని చిన్ననాటి గాయమే పనిచేస్తుంటుంది. ఈ థియరీ ఇలాంటి ఎన్నో మూలాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది.

మనిషి వ్యక్తిత్వాన్ని మరింత ఈజీగా అర్థం చేసుకోవడానికి ఫ్రాయిడ్ వారి మనసును ఇడ్, ఈగో, సూపర్‌ఈగో అనే మూడు భాగాలుగా డివైడ్ చేశారు. ఇవి మనసులో రెగ్యులర్‌గా జరిగే గొడవలను చూపిస్తాయి. దీనిలో ఇడ్ అనేది ఎలాంటి రూల్స్ పట్టించుకోకుండా ..ఇప్పుడే తన కోరిక తీరాలని కోరుకునే ఒక మొండి చిన్నపిల్లాడి లాంటి భాగం. ఆకలి, కోపం, ఆనందం వంటివి దీనికి సంబంధించినవి.

ఇక సూపర్‌ఈగో అనేది పద్ధతులు, నియమాలు, తప్పొప్పుల గురించి చెప్పే ఒక క్రమశిక్షణ గల భాగం. ఇది మన మనసులో ఉండే ఇలాగే చేయాలి, ఇలా చేయకూడదని చెప్పే పెద్దవారి మాట లాంటిది.

ఈ రెండింటి మధ్య నలిగిపోయే ఈగో అనేది రియాలిటీని అర్థం చేసుకుని మధ్యేమార్గంగా డెసిషన్స్ తీసుకునే ఒక తెలివైన మేనేజర్ వంటి భాగం. ఇది ఇడ్ కోరికలను, సూపర్‌ఈగో రూల్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ 3 భాగాలు సరిగ్గా ఉంటే ఆ మనిషి ప్రవర్తన నార్మల్‌గా ఉంటుంది, కానీ వాటిలో ఏదైనా ఒక్కటి ఎక్కువైతే మాత్రం సమస్యలు మొదలవుతాయి.

Sigmund Freud
Sigmund Freud

దీంతో పాటు ఫ్రాయిడ్ కలలను కూడా స్పెషల్‌గా పరిశీలించి డ్రీమ్ ఇంటర్‌ప్రెటేషన్ అనే విధానాన్ని తెచ్చారు. డ్రీమ్స్ అనేవి మన లోపలి మనస్సుకు ఒక పెద్ద స్టేజ్ వంటివి. మనం నిజ జీవితంలో సొసైటీకి భయపడి బయటకు వ్యక్తపరచలేని కోరికలు, దాచిపెట్టిన భయాలే కలల రూపంలో బయటపడుతుంటాయని ఫ్రాయిడ్ వివరించారు.

కలల్లో కనిపించే వింత వింత విషయాల వెనుకున్న అసలైన ఎమోషనల్ మీనింగ్‌ను తెలుసుకోవడానికి ఈ ఫ్రాయిడ్ థియరీ హెల్ప్ చేస్తుంది. ఈ ట్రీట్‌మెంట్‌లో కూడా ఎలాంటి భయం లేకుండా పేషెంట్‌ను ఫ్రీగా మాట్లాడనివ్వడం ద్వారా, వారి లోపలి మనసులో దాచుకున్న బాధలను బయటకు తీస్తారు.

Vijay Devarakonda : టీజీ20 లీగ్ పై టీసీఏ ఫైర్..విజయదేవరకొండకు నోటీసులు

Related Articles

Back to top button