Just LifestyleLatest News

Birthday : వయసు పెరగడమంటే వెనకబడటం కాదు.. అనుభవాల మూటతో అంతరంగాన్ని గెలుచుకోవడం

Birthday : ఎనభై ఏళ్లు వచ్చినప్పుడు జరుపుకునే వేడుక ఆ మనిషిని ఒక నడిచే దేవాలయంలా మారుస్తుంది.

Birthday

సాధారణంగా మనమంతా వయసు పెరగడాన్ని ఒక శారీరక మార్పుగా, శక్తి తగ్గిపోవడంగానే భావిస్తాం. అయితే దక్షిణ భారతదేశంలో 60, 70, 80, 90, 100 ఏళ్లకు కొంతమంది వేడుకలు జరుపుకొంటారు. అయితే ఈ వేడుకల వెనుక ఒక లోతైన జీవన వేదాంతం దాగి ఉందని ఆధ్యాత్మికంగా, సైకాలజీపరంగా తేలింది.

కేవలం ఇవన్నీ పుట్టినరోజు(Birthday) వేడుకలు కాదు.. మనిషి తనలోని అరిషడ్వర్గాలను జయించి, ఒక పరిపూర్ణ ఉనికిగా మారే అద్భుత పరిణామ క్రమం. మహాభారతంలోని యయాతి అనే చంద్ర వంశానికి చెందిన మహారాజు.. తన జీవిత చరమాంకంలో గ్రహించిన సత్యాన్ని ఈ వయసు పెరగడం ద్వారా జరిగే పుట్టినరోజు (Birthday)వేడుకలు మనకు గుర్తుచేస్తాయి.

ఎందుకంటే మనిషి కోరికలకు, ఆశకు అంతం లేదని, కేవలం అవగాహనతోనే అసలైన తృప్తి లభిస్తుందని యయాతి ఎలా తెలుసుకున్నాడో ఈ స్టోరీ చెబుతుంది. ఆ అవగాహన వల్ల మనిషిలో పదేళ్లకోసారి ఎలాంటి పరిపక్వం వస్తుందో సైకాలజీ కోణంలో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది.

అరవై ఏళ్ల వయసులో జరుపుకునే షష్టిపూర్తి అనేది ఒక వ్యక్తి జీవితంలో సంపాదన అలాగే బాధ్యతల నుంచి అవగాహన వైపు మళ్లే తొలి మలుపుగా చెబుతారు. సైకాలజీ ప్రకారం ఈ వయసులో మనిషికి తాను ఇంకా ఏమి సాధించాలనే తాపత్రయం తగ్గి, తన జీవితంలో అసలైన విలువ కలిగినది ఏమిటనే ప్రశ్న మొదలవుతుంది.

ఇక డెబ్బై ఏళ్లు వచ్చేసరికి భీమరథ శాంతి వేడుక ద్వారా మనిషి శాంతి వైపు(Birthday) వెళతారు. ఈ దశలో తమ వాదనలు గెలవడం కంటే కూడా కుటుంబ, స్నేహ బంధాలను నిలబెట్టుకోవడం, ఎదుటివారిని క్షమించడం గొప్పగా అనిపిస్తుంటుంది. అయితే ఇది బలహీనత వల్ల వచ్చే మార్పు కానే కాదు, ప్రశాంతత ఎంత శక్తివంతమైనదో అర్థమయ్యాక ఆ మనిషిలో వచ్చే పరిణతి.

ఎనభై ఏళ్లు వచ్చినప్పుడు జరుపుకొనే వేడుక ఆ మనిషిని ఒక నడిచే దేవాలయంలా మారుస్తుంది. ఈ వయసులో ఉన్న వ్యక్తుల దగ్గరకు వెళ్తే చాలు, వారి మౌనం కూడా ఒక భరోసాను ఇస్తుంది. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వారి ఉనికి ఎదుటివారికి ఒక గొప్ప ధైర్యాన్ని, స్వస్థతను కలిగిస్తుంది.

Birthday
Birthday

ఇక తొంభై ఏళ్ల వయసు అంటే మనిషిలోని అహంకారం పూర్తిగా కరిగిపోయే స్థితి వచ్చినట్లేనని అర్ధం. ఏ విషయాన్నీ పర్సనల్‌గా తీసుకోకుండా, అందరినీ సమానంగా చూసే ఈ మానసిక స్థితే నిజమైన ఆధ్యాత్మికతగా మానసిక శాస్త్రం చెబుతోంది.

చివరగా వందేళ్లు వచ్చినప్పుడు జరిగే శతమానం అనేది ఒక వ్యక్తి.. తన కథను దాటి అనంతమైన విశ్వశక్తిలో భాగమయ్యే పరిపూర్ణ స్థితిగా చెబుతారు. అప్పుడు మనసులో కేవలం ప్రేమ , కరుణ మాత్రమే మిగులుతాయి. అందుకే మన సంస్కృతిలో వయసు పెరగడాన్ని ఒక పండుగలా జరుపుకుంటూ ఉంటాము. అందుకే ఎప్పుడైనా సరే వయసు మళ్లడం అంటే ముగింపు కాదని, అది ఆ మనిషి మరింత స్వచ్ఛంగా, మెచ్యూర్డ్‌గా మారే ఒక పవిత్ర ప్రక్రియ అన్న విషయాన్ని తెలుసుకోవాలి.

Kolkata Knight Riders : సన్ రైజర్స్ కు షాక్..కోల్ కతా చేతిలో చిత్తు

Related Articles

Back to top button