Just LifestyleLatest News

Comparison Trap : పార్ట్‌నర్‌ ఉన్నా వేరేవారిపై ఇష్టం కలుగుతుందా? ఈ కంపేరిజన్ ట్రాప్‌కు చెక్ పెట్టడం ఎలా?

Comparison Trap : మనసు ఒకరితో ముడిపడి ఉన్నా కూడా ఇంకొకరు కూడా నచ్చడమనేది ఒక విచిత్రమైన సైకలాజికల్ ఫినామినన్ అంటున్నారు మానసిక నిపుణులు.

Comparison Trap

పెళ్లైపోయి అంతా ప్రశాంతంగా సాగుతుందనుకున్న టైమ్‌లో అనుకోకుండా మనసులోకి వేరే ఆలోచన రావడమనేది చాలామంది లైఫ్‌లో ఎదురయ్యే ఒక అనుభవం. ఆఫీస్‌లో పరిచయమైన కొలీగ్ లేదా తెలిసిన అమ్మాయి పదేపదే మనసులో మెదులుతుంది. దీంతో తనకు పెళ్లైపోయింది కదా, మరి ఈమె గురించి ఆలోచిస్తున్నప్పుడు కొత్తగా ఇంత ఎగ్జైట్‌మెంట్ ఎందుకు వస్తోందని లోపల అన్పిస్తూ ఉంటుంది.

ఇంటికొచ్చాక కూడా భార్య పక్కనే ఉన్నా మనసంతా ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతుంటే.. ఒకవైపు తాను ద్రోహం చేస్తున్నానా అనే గిల్టీ ఫీలింగ్, తెలియని ఏదో భయం లోపల తొలిచేస్తుంటాయి. అయితే ఇది ఆ కొత్తవారిలో కేవలం ప్లస్‌లను మాత్రమే వెతికి పట్టుకుని, పార్ట్‌నర్‌ను తక్కువ చేసి చూపేలా ఆడే కంపేరిజన్ ట్రాప్(Comparison Trap) అని చాలామందికి తెలీదు.

మనసు ఒకరితో ముడిపడి ఉన్నా కూడా ఇంకొకరు కూడా నచ్చడమనేది ఒక విచిత్రమైన సైకలాజికల్ ఫినామినన్ అంటున్నారు మానసిక నిపుణులు. పెళ్లయ్యాక కొన్నేళ్లకు పార్ట్‌నర్‌తో రిలేషన్ ప్రశాంతంగా, ఒక రొటీన్ ట్రాక్‌లోకి వచ్చేస్తుంది. కొత్త ఎగ్జైట్‌మెంట్‌లు ఏమీ ఉండవు.

కానీ బయట ఒక అమ్మాయి కానీ, అబ్బాయి కానీ కనపడినప్పుడో లేదా మాట్లాడిపుడో వారి బ్రెయిన్‌లో డోపమైన్, ఆక్సిటోసిన్ అనే హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవ్వడం మొదలవుతాయి. ఈ డోపమైన్ రష్ ఎలా ఉంటుందంటే ఆ అమ్మాయిలోని మంచి గుణాలు, అందం, ప్లస్ పాయింట్లు మాత్రమే వారి కంటికి ప్రొజెక్ట్ చేసి చూపిస్తుంది . తను చేసే చిన్న పని కూడా వారికి అద్భుతంగా అనిపిస్తుంది.

కానీ వారి పార్ట్‌నర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆమెలోని అలసట, కోపం, లోపాలు మాత్రమే గుర్తుచేస్తుంది. ఇదే మైండ్ ఆడే చాలా పెద్ద కంపేరిజన్ ట్రాప్ అని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ఇక్కడే అసలైన మైండ్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి. వారు ఆ అమ్మాయిని నిజంగా ఇష్టపడటం లేదు. కేవలం ఆ అమ్మాయి దగ్గర వారికి దొరుకుతున్న అటెన్షన్‌ను, ఆ హై ఫీలింగ్‌ను మాత్రమే ఇష్టపడుతున్నారని అర్ధం.

పైగా వేరేవాళ్ల ప్లస్‌లు మాత్రమే వారికి కనిపిస్తున్నాయి కానీ.. ఆమెలోని మైనస్‌లు, మూడ్ స్వింగ్స్, పర్సనల్ లైఫ్‌లోని లోపాలు ఇవేమీ కూడా వారికి తెలీవు. నిజానికి ఆమె కేవలం ఒక విజిటింగ్ కార్డ్ వంటిది. కానీ వారి పార్ట్‌నర్ వారి జీవితం అనే ఒక పెద్ద పుస్తకం అన్న విషయాన్ని లేట్‌గా తెలుసుకుంటారు.

Comparison Trap
Comparison Trap

ఈ డేంజరస్ కంపేరిజన్ ట్రాప్(Comparison Trap) నుంచి బయటపడి మనసును మళ్లీ ట్రాక్‌లోకి తేవడానికి.. మొదటగా వారి భార్యతో బంధం మొదలైన కొత్తలో ఆమెలో ఏం చూసి ఇష్టపడ్డారో, ఆమెతో గడిపిన ఆ మధుర క్షణాలను ఒక్కసారి మనసారా గుర్తుచేసుకోవాలి. బయటి అమ్మాయి కంటే, తన జీవితాన్నే వారికి అంకితం చేసిన తమ పార్ట్‌నర్ నిజాయితీ వంద రెట్లు గొప్పదనే సత్యాన్ని గట్టిగా చెప్పుకోవాలి.

ఒకవేళ పార్ట్‌నర్ సరైన వ్యక్తి కానప్పుడు, వారు వేరే వాళ్ల వైపు ఆకర్షితులవ్వడం వెనుక వారి లోపల ఉన్న ఏకాకితనం (Loneliness) లేదా అనుబంధం కరువవ్వడమే కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు. సమస్య పార్ట్‌నర్‌తో ఉన్నప్పుడు, దానికి పరిష్కారం మూడో వ్యక్తిని తమ లైఫ్‌లోకి తెచ్చుకోవడం కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి. అది సమస్యను పరిష్కరించకపోగా,ఇంకా టఫ్‌గా మారుస్తుందని గ్రహించాలి.

Sravana Masam Prasadam : శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టండి..లక్ష్మీదేవి కటాక్షం ఖాయం

Related Articles

Back to top button