Just LifestyleLatest News

Defensive Reactions To Criticism : పాయింట్ అవుట్ చేస్తే ఎందుకంతగా ట్రిగ్గర్ అవుతారు? డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లే వారి బ్రెయిన్ సీక్రెట్స్..

Defensive Reactions To Criticism : మనుషులు సాధారణంగా సొసైటీలో తమను తాము చాలా పర్ఫెక్ట్‌గా, ఎలాంటి మచ్చ లేని వారిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి విపరీతంగా ఇష్టపడతారు.

Defensive Reactions To Criticism

తప్పు మన వైపు ఉన్నప్పుడు, ఆ విషయాన్ని ఎదుటివాళ్లు మన ఫేస్ మీద పాయింట్ అవుట్ చేస్తే మాత్రం ఎవరికైనా ఆ పరిస్థితి ఇబ్బందికరమే. కానీ కొంతమంది మాత్రం తమ తప్పును ఒప్పుకోకపోగా.. ఎదుటివారి మీదే రివర్స్‌ అవుతుంటారు. అసలు తప్పు చేయకుండానే తనపై బురద జల్లారంటూ ఓవర్ రియాక్ట్ అవుతుంటారు.

ఆఫీసుల్లో, ఫ్రెండ్స్ సర్కిల్‌లో, ఫ్యామిలీలో ఇలాంటి సీన్లు ఎప్పుడో ఒకప్పుడు అందరం చూసే ఉంటాం. అయితే తప్పు క్లియర్‌గా కనిపిస్తున్నా సరే, ఎందుకు అంతలా ట్రిగ్గర్ అవుతారు.. ఆ సమయంలో వారి మెదడులో అసలేం జరుగుతుందనే విషయాలను మానసిక నిపుణులు వివరిస్తున్నారు.

మనుషులు సాధారణంగా సొసైటీలో తమను తాము చాలా పర్ఫెక్ట్‌గా, ఎలాంటి మచ్చ లేని వారిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి విపరీతంగా ఇష్టపడతారు. ఎక్కడో ఒకచోట వారు చేసిన చిన్న తప్పును ఇతరులు బయటపెట్టినప్పుడు, నలుగురిలో వారి ఇమేజ్, పరువు పూర్తిగా డ్యామేజ్ అవుతుందనే భయం వారి బ్రెయిన్‌ను ఒక్కసారిగా కమ్ముకుంటుంది. ఆ ఈగో దెబ్బతినడాన్ని, ఆ ప్రెస్టేజ్‌ పోతుందనే ఫీలింగ్‌ను హ్యూమన్ బ్రెయిన్ అస్సలు తట్టుకోలేదు. దీనికోసమే వెంటనే సెల్ఫ్ డిఫెన్స్ (Self-defense) కోసం వెంటనే ఎదురుదాడి చేయడం కానీ లేనిపోని కౌంటర్లు వేయడం కానీ చేసి తమను తాము కాపాడుకోవాలని చూస్తాయి.

సైకాలజీలో దీనినే కాగ్నిటివ్ డిసొనెన్స్(Cognitive Dissonance) అని పిలుస్తారు. మనిషి ఎప్పుడూ కూడా తమను తాము ..తానెప్పుడూ ఎప్పుడూ తప్పు చేయనని, చాలా మంచివారిమని బలంగా నమ్ముతూ ఉంటారు. కానీ ఒక తప్పు చేశామని ఎవరైనా ఫేస్ మీద చెప్పేసరికి, వారి అంతరాత్మకు, బయటి నిజానికి మధ్య ఒక పెద్ద సైకలాజికల్ కాన్‌ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఆ కన్ఫ్యూజన్‌ను, మైండ్ ఇంబ్యాలెన్స్‌ను తట్టుకోలేక, ఆ తప్పును ఒప్పుకునే బదులు ఎదుటివాళ్ల మీదే మాటలతోనో, చేతలతోనే ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తారు.

సైకాలజీ ప్రకారం మనుషుల్లో నేచురల్‌గానే కొన్ని డిఫెన్స్ మెకానిజమ్స్(Defensive Reactions To Criticism) పని చేస్తుంటాయి. తాము తప్పు చేశామనే విషయం లోలోపల బాగానే అర్థమైనా, ఆ గిల్టీ ఫీలింగ్‌ను లేదా దానికి వచ్చే కాన్‌సీక్వెన్సెస్ ఫేస్ చేసే ధైర్యం వారికి ఉండదు. ఆ భయం, బాధ్యత నుంచి తప్పించుకోవడానికి గట్టిగా మాట్లాడటం, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్‌కు దిగడం లేదా తాము అమాయకులమంటూ నమ్మించడం వంటివి చేస్తుంటారు.

Defensive Reactions To Criticism
Defensive Reactions To Criticism
Defensive Reactions To Criticism
Defensive Reactions To Criticism

తాము తప్పు చేశామని ఒప్పుకుంటే సొసైటీలో అందరి ముందూ లేదా ఎదుటివారి ముందు డౌన్ అయిపోతామనే లోతైన ఇన్‌ఫిరియారిటీ కాంప్లెక్సే(Defensive Reactions To Criticism) ఇలాంటి ఓవర్ రియాక్షన్లకు మెయిన్ రీజన్. మొత్తం మీద అవతలి వ్యక్తి తన తప్పును లోలోపల ఫీలవుతున్నా కూడా.. ఆ నిజాన్ని బయటికి ఒప్పుకునేంత బ్రాడ్ మైండ్ లేక, ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి అలా ట్రిగ్గర్ అవుతుంటారన్నమాట.

Defensive :మీరు తప్పు చేసి తిరిగి మీరే గట్టిగా మాట్లాడుతున్నారా? అయితే డిఫెన్సివ్ సైకాలజీ గురించి తెలుసుకోండి..

Related Articles

Back to top button