Just LifestyleJust SpiritualLatest News

Wallet : మీ చేతిలో డబ్బు నిలవడం లేదా? అయితే వ్యాలెట్ విషయంలో ఈ తప్పులు చేయకండి..

Wallet : ఈరోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. ఆ డబ్బును నిలుపుకోవడం అంతకంటే ముఖ్యం. కొంత మంది ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు

Wallet

ఈరోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. ఆ డబ్బును నిలుపుకోవడం అంతకంటే ముఖ్యం. కొంత మంది ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం చూస్తే.. మన ఆర్థిక పరిస్థితి మన పర్సు లేదా వ్యాలెట్‌(Wallet )లో ఉంచే వస్తువుల మీద కూడా ఆధారపడి ఉంటుందట.

వ్యాలెట్(Wallet )అనేది కేవలం డబ్బు దాచుకునే ఒక వస్తువు మాత్రమే కాదు.. అది సానుకూల శక్తిని ఆకర్షించే ఒక కేంద్రమని చాలామంది తెలుసుకోలేరు. అందుకే పర్సులో ఎప్పుడూ కొద్దిగా బియ్యం గింజలను కానీ అక్షింతలను కానీ ఉంచుకోవడం వల్ల ఆర్థిక శ్రేయస్సు కలుగుతుందని పెద్దలు చెబుతారు. బియ్యం గింజలకు పసుపు రాసి ఒక చిన్న కాగితంలో చుట్టి వ్యాలెట్‌లో పెడితే అనవసర ఖర్చులు తగ్గి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందట.

అలాగే పర్సులో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవడం వల్ల ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. అయితే ఆ ఫోటో చిరిగిపోకుండా, నలిగిపోకుండా జాగ్రత్త పడాలి. యాలకులు కూడా సానుకూల శక్తిని ఆకర్షించడంలో కీ రోల్ పోషిస్తాయి. ఒకటి లేదా రెండు పచ్చ యాలకులను పర్సులో ఉంచడం వల్ల ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయని నమ్ముతారు. ఇవి చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని దూరం చేసి లక్‌ని తీసుకువస్తాయి.

Wallet
Wallet

అంతేకాదు పనికిరాని పేపర్లతో నింపకుండా పర్సును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. చాలా మంది పాత బిల్లులు, రశీదులు, పనికిరాని కాగితాలను వ్యాలెట్‌లోనే ఉంచేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల రాహు దోషం ఏర్పడి డబ్బు నిలవకుండా పోతుందట. అలాగే పర్సులో ఎప్పుడూ చిరిగిన నోట్లను ఉంచకూడదట. అవి దారిద్య్రానికి చిహ్నాలుగా లెక్కించబడతాయి.

అలాగే నోట్లను ఇష్టమొచ్చినట్లు మడతపెట్టకుండా ఒక వరుస క్రమంలో అమర్చుకుని పెట్టడం వల్ల ధనలక్ష్మికి గౌరవం ఇచ్చినట్లవుతుంది. ఈ చిన్నపాటి నియమాలు పాటిస్తూ వ్యాలెట్‌ను పవిత్రంగా ఉంచుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖశాంతులు చేకూరుతాయట.

Thalapathy Vijay: కింగ్ మేకర్ పాత్రలో దళపతి విజయ్? తమిళనాడులో కొత్త చరిత్ర సృష్టించబోతున్న టీవీకే..

Related Articles

Back to top button