Just LifestyleLatest News

Emotional Check Out : ఒకే ఇంట్లో ఉన్నా అపరిచితుల్లా మారిపోతున్నారా?..ఎమోషనల్ చెక్ అవుట్ అంటే అదేనా?

Emotional Check Out : గొడవపడే ఓపిక కూడా నశించినప్పుడు, మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే మంచిదని వాళ్లు అనుకోవడమే ఎమోషనల్ చెక్ అవుట్‌కు మొదటి పునాది అవుతుంది.

Emotional Check Out

ఒక బంధంలో ఉన్నప్పుడు అరుచుకోవడం, గొడవ పడటం లేదంటే కోపంతో సామాన్లు విసిరేయడం మాత్రమే ప్రమాదకరమైన సంకేతాలని చాలామంది అనుకుంటారు. కానీ అంతకంటే అత్యంత భయంకరమైన, నిశ్శబ్దమైన ప్రమాదం మరొకటి ఉందని సైకాలజిస్టులు అంటున్నారు. దాన్నే ఎమోషనల్ చెక్ అవుట్ (Emotional Check-out) అంటారు.

సింపుల్‌గా చెప్పాలంటే.. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే దగ్గర తిరుగుతారు కానీ, వారి మధ్య ఎలాంటి భావోద్వేగాలు ఉండవు. శరీరాలు ఒక చోట ఉన్నా, మనస్సులు మాత్రం ఎప్పుడో ఆ రిలేషన్ నుంచి సైలెంట్‌గా ఎగ్జిట్ అయిపోతాయి. ఈ ఎమోషనల్ చెక్ అవుట్(Emotional Check Out) అనేది ఒకే రోజులో జరిగిపోయేదేమీ కాదు.

ఇది నెలలు, ఏళ్ల తరబడి జరిగే ఒక స్లో ప్రాసెస్ అని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పార్ట్‌నర్‌తో మాట్లాడినా వేస్ట్ అని, తన బాధను అర్థం చేసుకునే మూడ్‌లో ఆ వ్యక్తి లేరని ఫిక్స్ అయిపోతారో.. అప్పుడు వారి బ్రెయిన్ ఒక డిఫెన్స్ మెకానిజమ్‌ను ఆన్ చేస్తుంది. ఇకపై ఆశించడం ఆపేయ్.. గాయపడటం తగ్గుతుందని సైకాలజికల్ సేఫ్టీ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.

సింపుల్‌గా చెప్పాలంటే గొడవపడే ఓపిక కూడా నశించినప్పుడు, మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే మంచిదని వాళ్లు అనుకోవడమే ఎమోషనల్ చెక్ అవుట్‌కు మొదటి పునాది అవుతుంది.ఇలాంటి మానసిక స్థితికి చేరుకున్న వారిలో కొన్ని లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.

రిలేషన్‌లో సమస్యలు ఉన్నా సరే.. ఏదైతే నాకేంటి, నీకిష్టమొచ్చినట్లు చేయమని వదిలేస్తారు. భాగస్వామి ఏం చేసినా కోపం రాదు, అలా అని సంతోషం కూడా అనిపించదు. ఒక విచిత్రమైన ఉదాసీనత (Apathy) వారిద్దరి మధ్య ఆవహిస్తుంది.

రోజువారీ విశేషాలు చెప్పుకోవడం మెల్లమెల్లగా ఆగిపోతుంది. శారీరక సాన్నిహిత్యం కన్నా డిజిటల్ స్క్రీన్లు, సోషల్ మీడియా లేదంటే వేరే పనుల్లో మునిగిపోవడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మనసులోని బాధ చెప్పినా మారరనే ఫీలింగ్ వల్ల కూర్చుని గొడవలను సాల్వ్ చేసుకోవడానికి కూడా ఇంట్రస్ట్ చూపించరు.

కమ్యూనికేషన్ గ్యాప్ అండ్ ఎమోషనల్ నెగ్లెక్ట్ ఈ పరిస్థితికి మెయిన్ రీజన్. పదే పదే ఒకే విషయాన్ని చెప్పి అలసిపోవడం, పార్ట్‌నర్ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడం, ఇంటి విషయాలను ఇతరులతో షేర్ చేసుకోవడం, చిన్నచూపు చూడటం, ఎప్పుడూ విమర్శించడం వల్ల మనుషులు డిస్‌కనెక్ట్ అయిపోతారు.

Emotional Check Out
Emotional Check Out

అవతలి వ్యక్తి తన మాట వినడం లేదనే ఫీలింగ్ మనసులో బలంగా నాటుకుపోయినప్పుడు.. వారు రిలేషన్‌షిప్‌ నుంచి ఆటోమేటిక్‌గానే ఎమోషనల్‌గా లాగ్‌అవుట్ అయిపోతారు. ఇది విడాకులు లేదా విడిపోవడానికి ముందు వచ్చే విజిబుల్ సైన్‌గా అనుకోవచ్చు.

ఈ సైలెంట్ పాయిజన్ నుంచి తమ రిలేషన్‌ను కాపాడుకోవాలంటే ఫస్ట్ అవేర్‌నెస్ చాలా ముఖ్యం. మీ పార్ట్‌నర్ గొడవ పడటం ఆపేసి, సైలెంట్‌గా ఉంటున్నారంటే దాని అర్థం తమ మధ్య సమస్య తీరిపోయిందని కాదు.. వారు ఎమోషనల్ చెక్ అవుట్(Emotional Check Out) అవుతున్నారని అర్ధం చేసుకోవాలి. మరీ లేట్ చేయకుండా దీనికి చెక్ పెట్టడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఊపిరి కోల్పోతున్న రిలేషన్‌షిప్‌కు మళ్లీ కొత్త ప్రాణం పోయొచ్చు.

Emotional Unpredictability : ఒకసారి క్లోజ్.. మరోసారి డిస్టెన్స్.. అర్థం కాని ప్రవర్తన వెనుక ఏముంది?

Related Articles

Back to top button