Just LifestyleLatest News

Armpit Smell : చంకల నుంచి దుర్వాసన వస్తోందా? ఇంట్లోనే ఈ చిన్న ట్రిక్స్ ట్రై చేయండి..

Armpit Smell : చెమటకు అసలు ఎలాంటి స్మెల్ ఉండదు. కానీ చర్మంపై ఉండే బ్యాక్టీరియా స్వెట్‌లోని పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పుడు ఈ చెడు వాసన పుట్టుకొస్తుంది.

Armpit Smell

సీజన్‌తో సంబంధం లేకుండా చంకల్లో చెమట పట్టడమనేది చాలా సహజమైన విషయం. కొందరిలో స్వెట్ స్మెల్ రాదు కానీ మరికొందరిలో మాత్రం చెమటతో పాటు వచ్చే దుర్వాసన భరించలేం. దీనివల్ల అందరి ముందూ ఇబ్బంది పడతారు..అలాగే కాన్ఫిడెన్స్ కూడా పోతుంది.

బయటకు వెళ్లినప్పుడు ,అందరి మధ్య మాట్లాడేటప్పుడు ఈ స్మెల్ వల్ల ఫ్రీగా ఉండలేరు. నిజానికి చెమటకు అసలు ఎలాంటి స్మెల్ ఉండదు. కానీ చర్మంపై ఉండే బ్యాక్టీరియా స్వెట్‌లోని పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పుడు ఈ చెడు వాసన పుట్టుకొస్తుంది. హార్మోన్ల మార్పులతో పాటు, టైట్ దుస్తులు, సరైన పరిశుభ్రత లేకపోవడం దీనికి ప్రధాన కారణాలుగా ఆరోగ్య నిపుణులు చెబుతారు.

ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన పర్ఫ్యూమ్స్ వాడతారు. కానీ వాటి కంటే కూడా ఇంట్లో పాటించే శుభ్రతా నియమాలు బాగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.

స్నానం చేసేటప్పుడు మైల్డ్ సోప్‌తో చంకలను సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. అలా అని ఎక్కువసేపు రుద్దేయకూడదు. అలా చేయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. స్నానం పూర్తయ్యాక టవల్‌తో అక్కడ చిన్న తడి కూడా లేకుండా పూర్తిగా తుడుచుకోవడం చాలా ముఖ్యం.

Armpit Smell
Armpit Smell

ఎప్పుడూ గాలి ఆడే కాటన్ దుస్తులు ధరించడంతో పాటు.. చెమట పట్టిన బట్టలను అలాగే బాడీ మీద ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి. డియోడరెంట్లు వంటివి చర్మం పొడిగా ఉన్నప్పుడే వాడాలి. కొందరు స్మెల్ రాకుండా నిమ్మరసం, బేకింగ్ సోడా వంటివి రాస్తారు. అయితే వాటిని డైరెక్టుగా చంకల్లో రాయడం వల్ల చర్మం మండే అవకాశం ఉంటుంది.

అంతేకాదు ఆహార అలవాట్లు కూడా చంకల్లో చెమటను పెంచుతాయి. రెడ్ మీట్ అంటే పంది, పొట్టేలు మాంసం, అతిగా ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి ఎక్కువగా తినడం వల్ల కూడా బాడీలో దుర్వాసన ఎక్కువ అవుతుంది. అందుకే రోజూ తగినన్ని నీళ్లు తాగితే శరీరంలో టాక్సిన్లు బయటకు పోయి స్మెల్ కంట్రోల్ అవుతుంది.

Breakup Pain : బ్రేకప్ పెయిన్ తగ్గడం లేదా? ఫేక్ ఐడీలతో మాజీలను ట్రాక్ చేస్తున్నారా?

Related Articles

Back to top button