Mistake : మనసుకు నచ్చిన వారి తప్పులను ఎందుకు దాచేస్తాం?..సైకాలజీ సీక్రెట్ ఏంటి?
Mistake : మెదడులోని క్రిటికల్ థింకింగ్ అంటే తప్పొప్పులను లెక్కేసే పార్ట్ కాస్త మందగించడం వల్లే.. మన ప్రియమైన వారు చేసే బ్లండర్ మిస్టేక్స్ ఏవైనా మనకు మాత్రం చిన్నచిన్న పొరపాట్లుగానే కనిపిస్తుంటాయి.
Mistake
మనం డైలీ లైఫ్‌లో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనిస్తూ ఉంటాం. మనకు అస్సలు నచ్చని వ్యక్తి ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే చాలు.. చూశావా వాడు ఎంత పెద్ద తప్పు(Mistake) చేశాడో, వాడంతే అంటూ ఉంటాం. కానీ అదే తప్పును మనకు బాగా నచ్చిన వాళ్లో, మనల్ని ఇష్టపడిన వాళ్లో, మన బెస్ట్ ఫ్రెండో చేస్తే మాత్రం.. అయ్యో వాడు కావాలని చేయలేదులే, ఏదో పొరపాటున జరిగి ఉంటుందని చాలా సింపుల్‌గా మనమే ముందు సమర్థిస్తుంటాం.
ఎదుటివారి తప్పు(Mistake)లను కూడా మనకు అనుకూలంగా మార్చి చెప్పే ఈ మైండ్‌సెట్‌ను చూసి చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ దీని వెనుక కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు.. మన మెదడు ప్లే చేసే కొన్ని క్రేజీ సైకాలజీ ట్రిక్స్ కూడా ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
సైకాలజీలో దీనిని వివరించడానికి హాలో ఎఫెక్ట్ (Halo Effect) అనే ఒక అద్భుతమైన థియరీ ఉంది. దీని ప్రకారం.. మనం ఒక వ్యక్తిని బాగా ఇష్టపడినప్పుడు అంటే వారి అందం, మంచి మాట తీరు, లేదా హెల్పింగ్ నేచర్ చూసి ఇంప్రెస్ అయినప్పుడు.. మన మెదడు వారి చుట్టూ ఒక పాజిటివ్ వలయాన్ని క్రియేట్ చేసేస్తుంది.
ఆ వలయం ఎంత బలంగా ఉంటుందంటే.. ఆ తర్వాత వారు ఎలాంటి తప్పులు చేసినా, ఆ తప్పులు మన కళ్లకు చాలా చిన్నవిగా లేదా అసలు తప్పులే కానట్టుగా కనిపిస్తాయి. అంటే ఒక మంచి గుణం వల్ల వారిలోని వంద తప్పులు మన మెదడుకు కనిపించకుండా మాయమైపోతాయన్నమాట.
దీనికి తోడు కన్ఫర్మేషన్ బయాస్ (Confirmation Bias) అనే మరో సైకలాజికల్ ఫీలింగ్ కూడా దీనికి యాడ్ అవుతుంది. మనకు నచ్చిన వ్యక్తి చాలా మంచోడని మన మనస్సు ఆల్రెడీ స్ట్రాంగ్‌గా నమ్ముతుంది. ఎప్పుడైనా వారు ఏదైనా తప్పు చేసినపుడు కూడా .. మన మెదడు ఆ నమ్మకాన్ని దెబ్బతీసుకోడానికి అస్సలు ఇష్టపడదు.
అందుకే ఆ తప్పును దాచేస్తూ.. పరిస్థితులు బాలేక అలా చేశాడని మనకు మనమే ఒక రీజన్‌ను వెతుక్కుని, ఆ తప్పును సమర్థించడానికి ట్రై చేస్తుంటాం. అందుకే మనకు అవతలి వ్యక్తి చేసిన పొరపాటు చాలా చిన్నగా అనిపిస్తుంది.
ఇక దీని వెనుకున్న అసలు సిసలైన కెమికల్ లోచా ఏంటంటే.. ఆక్సిటోసిన్ (Oxytocin) అని మానసిక నిపుణులు చెబుతారు. దీనినే సైన్స్ భాషలో లవ్ హార్మోన్ లేదా బాండింగ్ హార్మోన్ అని అంటారు. మనకు నచ్చిన వారితో ఉన్నప్పుడు ఈ హార్మోన్ మన బాడీలో విపరీతంగా రిలీజ్ అవుతుందట.

ఇది ఏం చేస్తుందంటే.. అవతలి వ్యక్తిపై మనకు నమ్మకాన్ని పెంచి, వారిపై వచ్చే అనుమానాలను లేదా నెగెటివ్ ఆలోచనలను పూర్తిగా అణిచివేసేలా చేస్తుంది. ఇలా మెదడులోని క్రిటికల్ థింకింగ్ అంటే తప్పు(Mistake) ఒప్పులను లెక్కేసే పార్ట్ కాస్త మందగించడం వల్లే.. మన ప్రియమైన వారు చేసే బ్లండర్ మిస్టేక్స్ కూడా మనకు చిన్నచిన్న పొరపాట్లుగానే కనిపిస్తుంటాయి.
నిజానికి నచ్చిన వాళ్ల తప్పులు మనకు తక్కువగా కనిపించడమనేది మనుషుల నేచర్. బంధాలు నిలబడటానికి ఈ గుణం కొంతవరకు హెల్ప్ చేసినా.. ప్రతిసారీ అవతలి వారి తప్పులను గుడ్డిగా సమర్థించడం వల్ల లాంగ్ టర్మ్‌లో మనమే మోసపోవడం, నష్టపోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి.
కాబట్టి ఎవరినైనా అభిమానించడం, ఇష్టపడటం మంచిదే కానీ.. అవతలి వ్యక్తి చేసేది తప్పా, ఒప్పా అని అప్పుడప్పుడు ప్రాక్టికల్‌గా, కాస్త లాజికల్‌గా ఆలోచించడం కూడా అవసరమే.
Rashi Phalalu : కొన్ని రాశులకు ఆకస్మిక ధనలాభం.. ఆ రాశి వారికి అనుకోని ప్రయాణాలు





