Just LifestyleLatest News

Ice Cream Cone : ప్లేట్లు అయిపోతే కోన్ కనిపెట్టేశారు..ఐస్‌క్రీమ్ కోన్ వెనుక ఉన్న క్యూరియస్ స్టోరీ తెలుసా?

Ice Cream Cone : ఒకప్పుడు ఐస్‌క్రీమ్ అంటే కేవలం రాజులు, సంపన్నుల విందుల్లో మాత్రమే కనిపించే ఒక రాయల్ డెజర్ట్. ఐస్‌ను నిల్వ చేయడం కష్టం కాబట్టి సామాన్యులకు ఇది అసలు దొరికేది కాదు.

Ice Cream Cone

పిల్లల నుంచి పెద్దల దాకా అందరి ఫేవరెట్ ఐస్‌క్రీమ్ కోన్ అంటే ఎవరూ కాదనలేరు. అయితే ఒకప్పుడు ఐస్‌క్రీమ్‌ను కేవలం గాజు ప్లేట్లు, స్పూన్లతో మాత్రమే తినేవారట. ఇప్పటిలా రోడ్డుపై నడుస్తూ తినడం అస్సలు కుదిరేది కాదట. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఐస్‌క్రీమ్ కోన్(Ice Cream Cone) ఊరిస్తుంది.

రోడ్ల మీద, పార్కుల్లో అంతెందుకు నచ్చిన ప్లేసులో తినేలా రెడీ అయిపోయింది. అయితే ఈ కోన్ ఐస్ క్రీమ్ కోసం కోన్‌ ముందే ప్లాన్ చేసి కనిపెట్టింది కాదు. ఒక ఎగ్జిబిషన్‌లో ఎదురైన ఒక ప్రాబ్లెమ్‌కు అనుకోకుండా దొరికిన అద్భుతమైన సొల్యూషన్ అన్న విషయం చాలామందికి తెలీదు.

ఒకప్పుడు ఐస్‌క్రీమ్ అంటే కేవలం రాజులు, సంపన్నుల విందుల్లో మాత్రమే కనిపించే ఒక రాయల్ డెజర్ట్. ఐస్‌ను నిల్వ చేయడం కష్టం కాబట్టి సామాన్యులకు ఇది అసలు దొరికేది కాదు. ఆ తర్వాత చాలా చోట్ల రిఫ్రిజరేటర్‌లు అందుబాటులోకి రావడంతో అందరికీ చేరువ అయింది. 20వ శతాబ్దం స్టార్టింగ్ వరకు కూడా ఐస్‌క్రీమ్‌ను గాజు ప్లేట్లు లేదా చిన్న కప్పుల్లో పెట్టి ఇచ్చేవారు.

అయితే 1904లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఐస్‌క్రీమ్ హిస్టరీనే మార్చేసింది. అమెరికాలోని సెయింట్ లూయిస్ వరల్డ్ ఫెయిర్ జరగగా.. ఆ ఎగ్జిబిషన్‌కు ఏకంగా 2 కోట్ల మంది జనం వచ్చారు. రద్దీ పెరిగిపోవడంతో అక్కడి ఐస్‌క్రీమ్ వ్యాపారి దగ్గర ప్లేట్లన్నీ అయిపోయాయి. సరిగ్గా అప్పుడు అతడి పక్కనే సిరియాకు చెందిన ఎర్నెస్ట్ హామ్వీ అనే చిరు వ్యాపారి సన్నని వేఫర్ పేస్ట్రీలను అమ్ముతున్నాడు.

ఐస్‌క్రీమ్ వ్యాపారి పడుతున్న తిప్పలు చూసి అతను.. తన వేఫర్‌ను ఒక కోన్ ఆకారంలో చుట్టి, దానిలోనే ఐస్‌క్రీమ్ స్కూప్ వేసి కస్టమర్లకు ఇచ్చాడు. ఈ క్రేజీ ఐడియాకు జనాలు ఫిదా అయిపోయారు. తిన్నాక కడిగే పని లేకుండా, కోన్‌తో సహా తినే ఎక్స్‌పీరియన్స్ వారికి తెగ నచ్చేసింది.

Ice Cream Cone
Ice Cream Cone

దీంతో అప్పట్లోనే ఈ వేఫర్ కోన్‌కు మాస్ రెస్పాన్స్ వచ్చింది. మొదట్లో దీనిని కార్నుకోపియా అని పిలిచేవారు. ఈ కోన్ ఐస్ క్రీమ్ ఐడియా తర్వాత హామ్వీ మిస్సౌరీ కోన్ కంపెనీ పెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్‌గా కూడా మారారు.

అయితే 1903లోనే ఇటలీకి చెందిన ఇటాలో మార్చియోని అనే వ్యక్తి ..పిండితో చేసిన చిన్న కప్పుల మెషిన్ కోసం పేటెంట్ తీసుకున్నాడని మరో వాదన కూడా ఉంది. కానీ అవి హ్యాండిల్స్ ఉన్న కప్పుల్లా ఉండేవని చెబుతారు. ఫ్రాన్స్, జర్మనీలలో కూడా కోన్ వంటి ప్రయోగాలు చాలా జరిగినా, ప్రపంచాన్ని ఊపేసింది మాత్రం.. హామ్వీ వేఫర్ కోనే ఐడియానే. ఒక ఎగ్జిబిషన్‌లో ప్లేట్లు అయిపోవడంతో అతనికి వచ్చిన చిన్న థాట్.. ఈరోజు వరల్డ్ వైడ్‌గా బిలియన్ డాలర్ల ఐస్‌క్రీమ్ కోన్(Ice Cream Cone) ఇండస్ట్రీగా అవతరించేలా చేసింది.

Homestay : ఖాళీ రూమ్‌ ఉంటే చాలు మనీ వర్షమే..హోమ్ స్టే తో లక్షల్లో ఆదాయం ఎలా అంటే..

Related Articles

Back to top button