Just LifestyleLatest News

Heatwaves: భారత్‌కు వడగాల్పుల ముప్పు..మనం తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలేంటి?

Heatwaves : ఒకవేళ మీకు దాహంగా అనిపించింది అంటే మీ బాడీలో అప్పటికే నీటి నిల్వలు ప్రమాదకరంగా పడిపోయాయని అర్ధం.

Heatwaves

ప్రకృతి తన గమనాన్ని మెల్లమెల్లగా మార్చుకుంటోంది. మనమంతా ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఈ భయంకరమైన ఎండలు కేవలం కాలచక్రంలో భాగం కాదు, ఎల్‌నినో అనే వాతావరణ రాక్షసి సృష్టిస్తున్న విలయం అంటున్నారు వాతావారణశాఖ అధికారులు.

అసాధారణంగా వేడెక్కుతున్న పసిఫిక్ మహాసముద్ర జలాల వల్ల ప్రపంచవ్యాప్తంగా గాలి మళ్లుతోంది. దీనివల్ల మే నెలలో కురవాల్సిన తొలకరి జల్లులు మాయమైపోయాయి. వాటి స్థానంలో ప్రాణాలు తీసే వడగాల్పులు(Heatwaves) ఇప్పుడు దేశమంతా రాజ్యమేలబోతున్నాయి.

వర్షాలు పడాల్సిన సమయంలో ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయి. అయితే ఈ ప్రమాదం మరింతగా పెరిగే అవకాశం పొంచి ఉందని.. ఇది కేవలం వేడి కాదని, శరీరంలోని తేమను నిశ్శబ్దంగా హరించే ఒక విపత్తు అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది .

ఈ సమయంలో మనల్ని మనం కాపాడుకోవడానికి దాహం అనే సంకేతం బాడీకి వచ్చే వరకు ఆగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ మీకు దాహంగా అనిపించింది అంటే మీ బాడీలో అప్పటికే నీటి నిల్వలు ప్రమాదకరంగా పడిపోయాయని అర్ధం అట. అందుకే ప్రతి గంటకు ఒకసారి దాహం వేసినా వేయకపోయినా మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ వాటర్ తరచూ తీసుకుంటూ బాడీని(Heatwaves) డీహైడ్రేట్ అవకుండా చూసుకోవాలి.

Heatwaves
Heatwaves

ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులకు బలవంతంగా అయినా సరే టైమ్ టూ టైమ్ నీరు తాగిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యుడు తన ప్రతాపాన్ని డైరెక్టుగా భూమిపైన చూపిస్తాడు. కాబట్టి ఈ సమయంలో బయట తిరగడమంటే మన ప్రాణాలను రిస్క్‌లో పెట్టుకోవడమే. అందుకే అత్యవసరమైతే తప్ప ఈ ఐదు గంటల పాటు గడప దాటకపోవడమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఈ ఎండల సమయంలో బట్టల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. నలుపు రంగు బట్టలు వేడిని పీల్చుకుని బాడీలో మరింత హీటును పెంచుతాయి. అందుకే ఈ కాలంలో కేవలం తెలుపు రంగు కానీ లేత రంగు కాటన్ బట్టలకు కానీ ప్రాధాన్యత ఇవ్వాలి.

Heatwaves
Heatwaves

ఒకవేళ ఎవరికైనా సరే ఈ సమయంలో తీవ్రమైన తలనొప్పి, వాంతులు, చెమట పట్టకుండా చర్మం ఎండిపోయినట్లు కనిపిస్తే అది ‘హీట్ స్ట్రోక్’ అని గుర్తించాలి. అలాంటి వారిని వెంటనే నీడలోకి చేర్చి ప్రాథమిక చికిత్స అందించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ఇలాంటి సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి మన ప్రియమైన వారిని మనకు దూరం చేసే అవకాశం కూడా ఉంటుందని గుర్తించాలి.

కేవలం మనుషులే కాదు, మూగజీవాలు కూడా ఈ ఎండల ధాటికి విపరీతంగా అల్లాడిపోతున్నాయన్న విషయాన్ని గ్రహించాలి. అందుకే మన ఇంటి ముందో, బాల్కనీలోనో ఒక చిన్న గిన్నెలో నీళ్లను ఉంచడం అలవాటుగా మార్చుకోండి. ఈ ఏడాది భయంకరంగా ఉన్న ఎల్‌నినో గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రంగంలోకి దిగి ప్రజలను అలర్ట్ చేస్తున్నాయి.

Reactive Abuse:రియాక్టివ్ అబ్యూస్ అంటే ఏంటి? మీరూ బాధితులేనా?

Related Articles

Back to top button