Mentor : కేవలం కష్టపడితే సరిపోదా? జీవితంలో ఒక మంచి మెంటార్ ఉండాల్సిందేనా?
Mentor : ప్రపంచంలో సక్సెస్ అయిన ఎవరి హిస్టరీని చూసినా.. వాళ్ల వెనుక మంచి సలహాలు ఇచ్చి నడిపించిన ఒక గురువు లేదా మెంటార్ కచ్చితంగా ఉంటారు.
Mentor
కెరీర్లో అయినా, లైఫ్‌లో అయినా తాము అనుకున్న స్థాయికి చేరుకోవాలంటే కేవలం 24 గంటలు కష్టపడటం ఒకటే సరిపోదు . సరైన టైమ్‌లో, రైట్ స్టెప్ వేయడానికి ఒక మంచి గైడెన్స్ కూడా చాలా అవసరం. ప్రపంచంలో సక్సెస్ అయిన ఎవరి హిస్టరీని చూసినా.. వాళ్ల వెనుక మంచి సలహాలు ఇచ్చి నడిపించిన ఒక గురువు లేదా మెంటార్(Mentor) కచ్చితంగా ఉంటారు.
ఎవరికైనా సరే.. వారి ఆలోచనలను గమనిస్తూ, తప్పులను సరిదిద్దుతూ, వారిని ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లకు సిద్ధం చేసే ఒక మంచి గైడ్ ఉండాలి. మనం ఒక స్టేజ్‌కు ఎదగాలన్నా, కష్టాల్లో ఉన్నప్పుడైనా, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా అనుభవం ఉన్నవాళ్ల వైపు చూస్తుంటాం.
అయితే ఈ మెంటార్(Mentor) అనే వ్యక్తి ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు . ఆఫీస్‌లో ఉండే బాస్ కావొచ్చు. మన ఫ్రెండే కావొచ్చు. మనకంటే సీనియర్ లేదా తోటి ఉద్యోగి కావచ్చు, ఆఖరికి మన జీవిత భాగస్వామి కూడా అవొచ్చు.
పెద్ద పెద్ద కంపెనీలు తమ బ్రాండ్ ఇమేజ్ను పెంచుకోవడానికి నిపుణులను ఎలా వాడుకుంటాయో, అలాగే మన పక్కన కూడా ఒక మంచి మార్గదర్శి ఉంటే జీవితంలో వేగంగా పైకి రావొచ్చని కేంబ్రిడ్జ్, హార్వర్డ్ వంటి పెద్ద పెద్ద యూనివర్సిటీల రీసెర్చ్‌లు కూడా చెబుతున్నాయి.
దీనికి మొదటిగా, మనకు అన్ని విషయాల్లో కూడా మంచి అనుభవమున్న ఒక వ్యక్తి కావాలి. ప్రస్తుతం మనమెలాంటి కష్టాలు పడుతున్నామో, ఎలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నామో.. వాళ్లు ఆ పరిస్థితులను ఎప్పుడో దాటుకుని వచ్చి సక్సెస్ అయినవారై ఉండాలి. అలాంటివాళ్లు ఒక లివింగ్ ఎన్సైక్లోపీడియాలాగా హెల్ప్ అవుతారు.
మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి ఒక మంచి ప్లాన్ ఇవ్వడమే కాకుండా, ఒకవేళ మనం తప్పుడు దారిలో వెళ్తుంటే సమస్యను గుర్తించి సరైన మార్గం చూపిస్తారు. అవసరమైతే వాళ్లకున్న పరిచయాలతో మనకు కూడా కొత్త అవకాశాలు వచ్చేలా సపోర్ట్ చేస్తారు.
రెండో రకం మెంటార్ ఎవరంటే, మనలో దాగివున్న క్రియేటివిటీని, వినూత్నమైన ఆలోచనలను బయటకు తీసేవాళ్లు. చాలా మందికి లోపల మంచి టాలెంట్ ఉన్నా, ఎవరో ఒకరు వచ్చి ఎంకరేజ్ చేసే వరకు అది బయటపడదు. అలాంటి టైమ్‌లో మన ఆలోచనలను, స్కిల్స్‌ను నిశితంగా గమనించి, మనలోని క్రియేటివిటీని సొసైటీకి ఎలా ఉపయోగపడేలా చేయాలో చెప్పే గైడ్ ఒకరు పక్కన ఉండాలి.
మూడో వ్యక్తి, మనల్ని ఫైనాన్స్ విషయాల్లో నడిపించే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. కొంతమంది ఆఫీస్ పనుల్లోను, పర్సనల్ విషయాల్లోనూ చాలా తెలివిగా ఉంటారు . కానీ, డబ్బులు సేవ్ చేయడంలో, వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటారు.
అవగాహన లేక తప్పుడు చోట ఇన్వెస్ట్ చేసి నష్టపోతుంటారు. ఇలాంటి సమయంలో డబ్బు సంపాదనపై, మార్కెట్‌పై మంచి అవేర్నెస్ ఉన్న వ్యక్తి మనకు మెంటార్‌గా ఉంటే చాలా లాభం కలుగుతుంది. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఫ్యూచర్ కోసం మనీని ఎలా దాచుకోవాలో వీళ్లు చక్కగా నేర్పిస్తారు.
నాలుగో రకం మెంటార్‌ను రివర్స్ మెంటార్ అంటారు. అంటే వీళ్లు వయసులో చాలా చిన్నవారై ఉంటారు, కానీ కొత్త విషయాల్లో మాత్రం మనకంటే ఎక్కువ నాలెడ్జ్‌ను కలిగి ఉంటారు. ఈ డిజిటల్ ప్రపంచంలో రోజురోజుకు వస్తున్న సోషల్ మీడియా ట్రెండ్స్, కొత్త టెక్నాలజీ, ఆధునిక లైఫ్‌స్టైల్ గురించి తెలుసుకోవడానికి ఇలాంటి వాళ్లు మెంటార్‌గా ఉండటం చాలా అవసరం.
ఎందుకంటే మనం పాత పద్ధతుల్లో పనులు చేస్తూ టైమ్ వేస్ట్ చేసుకుంటుంటే, కొత్త సాఫ్ట్వేర్లు , గ్యాడ్జెట్లు ఉపయోగించి స్మార్ట్‌గా, ఈజీగా ఎలా చేయాలో వీళ్లు మనకు నేర్పిస్తారు.
ఇక ఐదో వ్యక్తి, మనల్ని ఎప్పుడూ ప్రశ్నించే ఒక ఛాలెంజర్ వంటి మెంటార్(Mentor). వీళ్లు చూడటానికి చాలా స్ట్రిక్ట్‌గా కనిపిస్తారు. కానీ, మనల్ని హై పొజిషన్‌కు తీసుకెళ్లే అసలైన శక్తులు వీళ్లే . వీళ్లు మనం ఏం చేసినా బ్లైండ్‌గా పొగడరు. మనలోని లోపాలను ఉన్నదున్నట్లు మొహం మీదే చెబుతారు.

మనల్ని వీళ్లు ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో కూర్చోనివ్వకుండా, కొత్త ఛాలెంజెస్ను ఫేస్ చేసేలా ముందుకు నెడతారు. మన డెసిషన్ వెనుకున్న లాజిక్‌ను అడుగుతారు. ఒకవేళ తప్పు అనిపిస్తే నిలదీస్తారు. ఇలాంటి కఠినమైన మెంటార్ ఉండటం వల్ల మనం జీవితంలో అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్లేలా రాటుదేలుతాం.





