Best Friends : బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే షేర్ చేయకూడని సీక్రెట్స్ ..నోరు జారకూడని ఆ 4 విషయాలు ఇవే..
Best Friends : ఎంత ప్రాణస్నేహితులైనా సరే కొన్ని లిమిట్స్ సెట్ చేసుకోవాలని, కొన్ని విషయాలను సీక్రెట్‌గా ఉంచడమే మంచిదని రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
Best Friends
చాలామంది తమకు ఏ చిన్న కష్టం వచ్చినా, సంతోషం కలిగినా బెస్ట్ ఫ్రెండ్స్(Best Friends)తోనే ముందుగా షేర్ చేసుకుంటారు. కొంతమంది అయితే తమ పర్సనల్ లైఫ్‌లో జరిగిన ప్రతీ చిన్న విషయాన్ని కూడా ఫ్రెండ్స్‌తో ఓపెన్‌గా షేర్ చేసుకుంటూ ఉంటారు.
అయితే ఎంత ప్రాణస్నేహితులైనా సరే కొన్ని లిమిట్స్ సెట్ చేసుకోవాలని, కొన్ని విషయాలను సీక్రెట్‌గా ఉంచడమే మంచిదని రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఓవర్ ఓపెన్‌గా ఉండటం వల్ల మీ ప్రైవసీ దెబ్బతినడమే కాదు.. అటు మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్కు, ఇటు మీ పర్సనల్ రిలేషన్స్‌కు నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
ముందుగా మీ పార్టనర్ నెగిటివ్స్ రచ్చకెక్కించకండి. భార్యాభర్తల మధ్య, రిలేషన్లో ఉన్నవారి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం కామన్. అయితే ప్రతి చిన్న విషయాన్ని, పర్సనల్ గొడవలను లేదా పార్ట్నర్ లోపాలను ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడటం సరికాదు. దీనివల్ల రేపు మీ గొడవలు సద్దుమణిగినా, మీ ఫ్రెండ్స్(Best Friends) దృష్టిలో మాత్రం మీ పార్టనర్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. దంపతుల మధ్య విషయాలు ఎప్పుడూ కూడా మూడో వ్యక్తి వరకు వెళ్లకపోవడమే మంచిది.
అలాగే ఎమోషనల్ డస్ట్ బిన్ లాగా వాడొద్దు. మీ డైలీ లైఫ్‌లో ఎన్ని టెన్షన్లు, బాధలు ఉన్నా ఆ భారమంతా ఫ్రెండ్స్పైన రుద్దడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అవతలి వారికి కూడా సొంత సమస్యలుంటాయి. ఎప్పుడూ కూడా మీ నెగిటివిటీని వారిపై రుద్దడం వల్ల మీపై తేలిక భావం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. మీ సమస్యలను మీరే ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించి కుదరకపోతే అప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర ఓపెన్ అవ్వండి.

ఇక మూడోది ఏంటంటే బెడ్రూమ్ ముచ్చట్లు వారి ముందు బయటపెట్టొద్దు. నాలుగు గోడల మధ్య జరిగే పర్సనల్ విషయాలను అలాగే భాగస్వామి బలహీనతలను ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి ప్రైవేట్ విషయాలు బయటకు తెలిస్తే మీ పార్ట్నర్కు మీపై ఉన్న నమ్మకం శాశ్వతంగా పోతుంది. ఏమైనా సమస్యలుంటే డాక్టర్లు లేదా కౌన్సెలర్లను సంప్రదించాలి కానీ ఫ్రెండ్స్ ముందు చర్చించకూడదు.
ఫైనల్‌గా నాలుగోది.. ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పొద్దు. ఒక ఫ్రెండ్‌తో గొడవ కాగానే, ఆ కోపాన్ని వేరే ఫ్రెండ్ దగ్గర తీర్చుకోవడానికి వారిపై నెగిటివ్‌గా చెప్పడం లేదా చాడీలు చెప్పడం మిమ్మల్ని చీప్‌గా చేసేలా చేస్తుంది. తన వెనుక కూడా వీళ్లంతా ఇలాగే మాట్లాడతారేమోననే అనుమానం వినేవారికి వస్తుంది. ఏమైనా గొడవలు ఉంటే డైరెక్టుగా వారితోనే మాట్లాడి పరిష్కరించుకోండి కానీ..అక్కడా ఇక్కడా చెప్పడం వల్ల బంధం మరింత బలహీనపడుతుంది.





