Just LifestyleLatest News

Smoking Zones : యూత్‌ను బలి తీసుకుంటున్న స్మోకింగ్ జోన్లు.. కాఫీ కేఫ్‌ల వద్ద పెరిగిపోతున్న స్మోకింగ్ క్రేజ్..

Smoking Zones : స్మోకింగ్ జోన్ల వల్ల స్మోకింగ్ చేసేవారే కాక, పక్కనున్న పాసివ్ స్మోకర్లు కూడా అనారోగ్యం పాలవుతున్నారు.

Smoking Zones

సిటీ నుంచి పల్లెల వరకూ, హైవేల వెంట వెలిసిన వెరైటీ కలర్‌ఫుల్ టీ స్టాళ్లు, కాఫీ కేఫ్‌లు కొద్దిరోజులుగా యూత్‌కి మెయిన్ హ్యాంగౌట్ స్పాట్‌లుగా మారిపోయాయి. ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా టీ తాగి రిలాక్స్ అవుదామని వెళ్తూ..యూత్ ఆ టీ, కాఫీలతో పాటు సిగరెట్ వెలిగించి తమ హెల్త్‌ను స్పాయిల్ చేసుకుంటున్నారు.

ఇప్పుడు పాన్ బడ్డీ, కిరాణా షాపుల నుంచి స్టార్ట్ చేసి చిన్న చిన్న కేఫ్‌ల వరకు సిగరెట్ల అమ్మకాలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. కొన్ని టీ షాపుల నిర్వాహకులు ఒకడుగు ముందుకు వేసి స్మోకింగ్ జోన్లు(Smoking Zones) ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల స్మోకింగ్ చేసేవారే కాక, పక్కనున్న పాసివ్ స్మోకర్లు కూడా అనారోగ్యం పాలవుతున్నారు.

గవర్నమెంట్ సిగరెట్లు, పొగాకు ప్రొడెక్ట్స్ అమ్మకాలు, వాడకంపై స్పష్టమైన చట్టాలు తెచ్చినా, అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. 18 ఏళ్ల లోపు ఉన్న మైనర్లకు పొగాకు ప్రొడెక్ట్స్ అమ్మకూడదనే స్ట్రిక్ట్ రూల్‌ను షాపుల యజమానులు అస్సలు పట్టించుకోవడం లేదు.

దీంతో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు కూడా స్మోకింగ్‌కు ఎడిక్ట్ అవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల పక్కనే తెరలు కట్టి స్మోకింగ్ ఏరియాలు ఏర్పాటు చేస్తుంటే, అధికారులు కూడా కనీస చెకింగ్స్ కూడా చేయడం లేదు.

ఈ మధ్య కాలంలో బయటపడుతున్న లంగ్స్, పెద్దపేగు, గొంతు క్యాన్సర్ బాధితుల్లో ఏకంగా 95 శాతానికి పైగా రోగులు కేవలం సిగరెట్ తాగడం వల్లే వాటి బారిన పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. స్మోకింగ్ అలవాటు లేనివాళ్లు కూడా టీ, కాఫీల కోసం వెళ్లి ఈ స్మోకింగ్ జోన్ల(Smoking Zones) వద్ద పొగను పీల్చడం వల్ల వారిలాగే ఆరోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్నారు.

నిజానికి రూల్స్ ప్రకారం చూస్తే హాస్పిటల్స్, గవర్నమెంట్ ఆఫీసులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు వంటి అన్ని ఓపెన్ ప్లేసులలో స్మోకింగ్ చేయడం పూర్తిగా నిషేధం.

Smoking Zones
Smoking Zones

కనీసం 30 రూమ్‌ల కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న పెద్ద హోటళ్లలో మాత్రమే స్పెషల్‌గా స్మోకింగ్ జోన్ల ఏర్పాటుకు పర్మిషన్ ఉంటుంది. అలాగే స్కూల్స్, కాలేజీ ప్రాంగణాల నుంచి 100 మీటర్ల లిమిట్‌లో సిగరెట్లు లేదా ఎలాంటి పొగాకు పదార్థాలను అమ్మకూడదు.

కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలు కాకపోవడంతోనే మనం పీల్చే గాలి రోజురోజుకు విషపూరితంగా మారిపోతుంది. టీ చుక్కతో మొదలయ్యే ఈ హ్యాబిట్..జీవితాలనే బూడిద చేస్తోంది.

Quit Smoking : స్మోకింగ్ మానేసినా ముప్పు తప్పదా? మరి ఎప్పుడు మానేస్తే లంగ్స్‌ సేఫ్‌గా ఉంటాయి?

Related Articles

Back to top button