Old Songs : కొన్ని పాటలు వినగానే పాత జ్ఞాపకాలు ఎందుకు గుర్తొస్తాయి? మెదడు ప్లే చేసే సైకాలజీ ట్రిక్ ఏంటి?
Old Songs : కొన్ని పాటలు విన్నప్పుడు తెలీకుండానే మొహంపై చిరునవ్వు వస్తుంది. అలాగే మరికొన్ని పాటలు వింటే మాత్రం అనుకోకుండా కళ్లు చెమర్చుతాయి.
Old Songs
మనం ఎప్పుడో ఐదు, పదేళ్ల క్రితమో లేక చిన్నప్పుడో విన్న ఒక పాట.. ఎక్కడైనా టీవీలోనో, మొబైల్లోనో వినిపించగానే, ఒక్క క్షణంలో మనం గతంలోకి జారిపోతాం. ఆ పాట(Old Songs) వింటున్నంత సేపు కూడా.. ఆ పాట వినేటప్పుడు ఎక్కడున్నాం, ఎవరితో ఉన్నాం, అప్పుడు మన ఫీలింగ్ ఏంటనే విషయాలన్నీ కళ్లముందు కదలాడుతుంటాయి.
అలా కొన్ని పాటలు(Old Songs) విన్నప్పుడు తెలీకుండానే మొహంపై చిరునవ్వు వస్తుంది. అలాగే మరికొన్ని పాటలు వింటే మాత్రం అనుకోకుండా కళ్లు చెమర్చుతాయి. దీంతో చాలామందికి కేవలం ఒకే ఒక పాట మనల్ని కాలంతో పాటు వెనక్కి తీసుకెళ్లే టైమ్ మెషీన్లా ఎలా మారుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. అసలు మ్యూజిక్కు, పాత జ్ఞాపకాలకు ఉన్న కనెక్షన్ ఏంటనే అనుమానం వస్తుంది.
అయితే దీనిని సైకాలజీలో వివరించడానికి ఆటోబయోగ్రాఫికల్ మెమరీ (Autobiographical Memory) అనే ఒక వర్డ్‌ను వాడుతుంటారు. అంటే మన జీవితంలో జరిగిన ముఖ్యమైన ఇన్సిడెంట్లను మన మైండ్ ఒక చోట దాచి ఉంచుతుంది. సాధారణంగా మనం ఏదైనా పాత విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి చాలా కష్టపడతాం.
కానీ సాంగ్ విన్నప్పుడు మాత్రం వెంటనే పాత జ్ఞాపకాలు వాటంతట అవే బయటకు వచ్చేస్తాయి. దీనిని సైకాలజిస్టులు ఇన్వాలంటరీ మెమరీ రిట్రీవల్ (Involuntary Memory Retrieval) అని చెబుతున్నారు. అందుకే మనం అడగకుండానే మనిషి మైండ్ ఆ జ్ఞాపకాలను మన కళ్లముందుకు వెంటనే తెచ్చి పడేస్తుందన్నమాట.
దీని వెనుక మెదడులో జరిగే ఒక క్రేజీ సైన్స్ ప్రాసెస్ ఉందని సైకాలజిస్టులు చెబుతున్నారు. మెదడులో హిప్పోకాంపస్ (Hippocampus), అమిగ్డాలా (Amygdala) అనే రెండు పార్టులుంటాయి. హిప్పోకాంపస్ జ్ఞాపకాలను దాచే ఒక మెమరీ కార్డ్ వంటిది అయితే.. అమిగ్డాలా మన భావోద్వేగాలను అంటే సంతోషం, బాధ, ప్రేమ వంటివి కంట్రోల్ చేసే ఒక హార్ట్ వంటిది.
మనం జీవితంలో ఒక సాంగ్ వింటున్నప్పుడు ఏదైనా ఎమోషనల్ ఇన్సిడెంట్ జరిగితే.. మెదడు ఆ పాటను, ఆ ఫీలింగ్‌ను కలిపి ఒకే బాక్స్‌లో లాక్ చేసి పెట్టేస్తుంది. సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ పాట మన చెవిన పడగానే.. మెదడు ఆ బాక్స్ ఓపెన్ చేసి, ఆ నాటి ఫీలింగ్‌ను మనకు రిటన్ గిఫ్ట్‌గా ఇస్తుంది.
అంతేకాదు, మన జీవితంలో 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు మధ్యలో విన్న పాటలు మనకు లైఫ్ లాంగ్ గుర్తు ఉండిపోతాయట. సైకాలజీలో దీనిని రెమినిసెన్స్ బంప్ (Reminiscence Bump) అంటారు. ఎందుకంటే ఆ ఏజ్‌లో మనిషి మెదడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆ టైమ్‌లో మొదటి ప్రేమ, కాలేజీ ఫ్రెండ్స్, కొత్త జాబ్ వంటి క్రేజీ ఎక్స్పీరియన్స్ అప్పుడే జరుగుతుంటాయి. ఆ టైమ్‌లో విన్న ట్యూన్స్ మనిషి మెదడుపై గట్టి ముద్రను వేస్తాయి. అందుకే ఏజ్ పైబడిన తర్వాత కూడా.. ఆ కాలేజీ రోజుల సాంగ్స్ వినగానే మనకు తెలీని ఒక వైబ్, పాత జ్ఞాపకాలు చుట్టుముట్టేస్తాయి.

మ్యూజిక్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. అది మన టైమ్‌లోని మధురమైన క్షణాలను దాచి ఉంచే ఒక డిజిటల్ లాకర్ వంటిది. కంటికి కనిపించని, చేతికి దొరకని గతాన్ని.. కేవలం ఒక చిన్న సాంగ్ ద్వారా మళ్లీ మన కళ్లముందుకు తెచ్చే పవర్ మ్యూజిక్‌కి మాత్రమే ఉంది. అందుకే మనకు నచ్చిన ఓల్డ్ సాంగ్స్ వింటూ.. అప్పటి స్వీట్ మెమరీస్‌ను అప్పుడప్పుడు నెమరువేసుకోవడం మనిషి మెంటల్ హెల్త్‌కు ఎంతో మేలు చేస్తుంది.
Numerology : లీడర్షిప్ క్వాలిటీస్, అంతులేని ధైర్యం..నెంబర్ 9 స్పెషాలిటీలు ఇంకా చాలా ..





