Proposition Effect : లేజీ మైండ్‌తో బిజినెస్ దిగ్గజాల మైండ్ గేమ్స్.. ప్రొడక్ట్ చూడగానే వావ్ అనడం వెనుకున్న సైకాలజీ ఇదే..
Proposition Effect : ఒక డిజైన్‌ను అర్థం చేసుకోవడానికి బ్రెయిన్‌కి ఎలాంటి కష్టం అనిపించదో, వెంటనే మన మైండ్‌లో డోపమైన్ రిలీజ్ అయి ఆ ప్రొడక్ట్ పట్ల ఒక క్రేజీ ఫిలింగ్ వచ్చి.. దానిపై ఇష్టం ఏర్పడుతుంది.
Proposition Effect
మనం సూపర్‌మార్కెట్‌కి వెళ్లినపుడో, లేదా ఆన్లైన్ షాపింగ్ సైట్ విజిట్ చేస్తున్నప్పుడో కొన్ని వస్తువులు చూడగానే మన కళ్లు ఆటోమేటిక్‌గా అక్కడే ఆగిపోతాయి. వావ్..ఎంత బాగుందో అనిపిస్తుంది. కాస్ట్ కాస్త ఎక్కువైనా సరే, ఆ ప్రొడక్ట్ మన ఇంట్లో ఉంటే భలే ఉంటుందే అంటూ మైండ్ ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది.
అయితే, ఆ ప్రొడక్ట్ చూడగానే అంతలా నచ్చేయడానికి, లేదా ఆపిల్ (Apple) వంటి బ్రాండ్ ఐఫోన్లు, ఐప్యాడ్లు చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వంటి ఫీలింగ్ రావడానికి అసలు కారణం మన బ్రెయిన్ ప్లే చేసే ఒక క్రేజీ సైకలాజికల్ గేమ్ అట. దాన్నే సైకాలజీ భాషలో ది ప్రపోజిషన్ ఎఫెక్ట్(The Proposition Effect) అని పిలుస్తారని మానసిక నిపుణులు అంటున్నారు.
నిజానికి మన బ్రెయిన్ చాలా కాంప్లెక్స్ అయినా కూడా, అది ప్రాసెసింగ్ విషయంలో మాత్రం చాలా లేజీ(Lazy Brain) అని సైకాలజీ చెబుతుంది. మన చుట్టూ ఉన్న క్లిష్టమైన సమాచారాన్ని, విపరీతమైన రంగులను లేదా కాంప్లికేటెడ్ డిజైన్లను అర్థం చేసుకోవడానికి మెదడు చాలా ఎనర్జీని ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే మన బ్రెయిన్ ఎప్పుడూ చాలా సింపుల్, నీట్ అండ్ క్రిస్పీగా ఉండే ఇన్ఫర్మేషన్ను మాత్రమే స్పీడ్‌గా గ్రహించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది.
ఈ సైకాలజీని పక్కాగా క్యాచ్ చేసిన గ్లోబల్ బ్రాండ్లు.. తమ ప్రొడక్ట్ డిజైన్‌ను, దాని వెనుక ఉన్న మెసేజ్‌ను మన బ్రెయిన్ చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకునేలా ప్లాన్ చేస్తాయి. ఎప్పుడైతే ఒక డిజైన్‌ను అర్థం చేసుకోవడానికి బ్రెయిన్‌కి ఎలాంటి కష్టం అనిపించదో, వెంటనే మన మైండ్‌లో డోపమైన్ రిలీజ్ అయి ఆ ప్రొడక్ట్ పట్ల ఒక క్రేజీ ఫిలింగ్ వచ్చి.. దానిపై ఇష్టం ఏర్పడుతుంది.
ఇక్కడ ప్రపోజిషన్ ఎఫెక్ట్(Proposition Effect) ఎలా వర్కవుట్ అవుతుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఒక ప్రొడక్ట్ లేదా డిజైన్ చూసినప్పుడు మన మైండ్ దీన్ని వాడటం చాలా ఈజీ. ఇది నా జీవితాన్ని మరింత సింపుల్ చేస్తుందనే ఒక ప్రపోజిషన్ లేదా ఫీలింగ్‌ను సెకన్ల వ్యవధిలో క్రియేట్ చేసుకుంటుంది.

ఉదాహరణకు ఆపిల్ ప్రొడక్టులనే తీసుకుంటే.. వాటి ప్యాకింగ్ నుంచి పట్టుకునే బాడీ వరకు ఎక్కడా హడావుడి ఉండదు. ఆ స్మూత్ లుక్, సింపుల్ ఐకాన్స్ మన మైండ్‌కు ఎలాంటి శ్రమ లేకుండా చాలా హాయిగా ఉన్నట్లు ఫీల్‌ను ఇస్తాయి. దాంతో మన మైండ్ ఆ వస్తువును ఒక హై-స్టేటస్ అండ్ మోస్ట్ కంఫర్టబుల్ థింగ్‌గా ఫిక్స్ అయిపోతుంది.
మరి ఈ ప్రపోజిషన్ ఎఫెక్ట్(Proposition Effect) మాయలో పడకుండా ప్రొడక్ట్స్‌ని ఎలా సెలక్ట్ చేసుకోవాలంటే.. షాపింగ్ చేసేటప్పుడు కేవలం డిజైన్ లేదా లుక్ చూసి టెంప్ట్ అయిపోకుండా, ఈ వస్తువు వల్ల నిజంగా ఇంట్లో కానీ నాకు కానీ యూజ్ ఉందా? లేక నా లేజీ బ్రెయిన్ ప్రెజెంట్ చేసిన డిజైన్ మాయలో పడుతున్నానా? అని ఒక్క సెకన్ దాని గురించి ఆలోచించడాన్ని అలవాటు చేసుకోవాలి. బ్రాండ్లు ప్లే చేసే ఈ సైకలాజికల్ ట్రిక్ కనుక అర్థమైతే, ప్రొడక్ట్ కేవలం బయటి లుక్ వల్లే కాకుండా దాని నిజమైన క్వాలిటీ, అవసరాన్ని బట్టి మనం తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతామన్న మాట.
Cortisol : అర్థరాత్రులు మెలకువ వస్తుందా? మీ బాడీని శాసిస్తున్న ఆ ఒక్క హార్మోన్ సీక్రెట్ అదే..





