Just LifestyleLatest News

Speaking Without Thinking : ఆలోచించకుండా మాట్లాడే అలవాటు ఉందా? జాగ్రత్త ..నోరు కంట్రోల్ లేకపోతే రిలేషన్స్ కొట్టుకుపోతాయ్..

Speaking Without Thinking : పొరపాటున విసిరిన మాట వల్ల ఆ వ్యక్తి సొసైటీలో అనుభవించే మెంటల్ పెయిన్, స్ట్రెస్ తిరిగి ఎంత డబ్బు పోసినా పూడ్చలేనివిగా మారిపోతాయి.

Speaking Without Thinking

మనం డైలీ లైఫ్‌లో మాట్లాడే ప్రతీ మాట కూడా కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు. కొన్నిసార్లు అది ఎదుటివారిపై చాలా పెద్ద ముద్ర వేసే ఒక పవర్‌ఫుల్ వెపన్‌గా కూడా మారుతుంది. చాలామంది పట్టరాని కోపంలోనో, డిప్రెషన్, తీవ్రమైన భావోద్వేగానికి లోనైనప్పుడో మైండ్ కంట్రోల్ కోల్పోవడంతో.. నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుంటారు.

సైకాలజీ చెబుతున్న దాని ప్రకారం దీనిని ‘అమిగ్డాలా హైజాక్’ (Amygdala Hijack) అంటారు. అంటే బ్రెయిన్‌లో లాజికల్ ఆలోచనలు చేసే పార్ట్ పనిచేయడం ఆగిపోయి.. కేవలం ఇన్‌స్టెంట్ ఎమోషన్స్ మాత్రమే ప్రాసెస్ అవుతాయన్న మాట. ఈ క్షణికావేశంలో జారిన ఒక్క మాట ఎదుటివారి కాన్ఫిడెన్స్‌ను, సెల్ఫ్ రెస్పెక్ట్‌ను శాశ్వతంగా దెబ్బతీసే సైలెంట్ కిల్లర్‌లా మారిపోతుంది.

అంతా అయిన తర్వాత నేను ఏదో కోపంలో అన్నాను, మనసులో పెట్టుకోకు అంటూ క్షమాపణ చెబుతారు. కొంతమంది అహంకారం ఎక్కువయి అది కూడా చేయరు అది వేరే విషయం. కాకపోతే మాటలు అనేసి క్షమాపణ చెప్పడం వారికి చాలా ఈజీనే కావొచ్చు. కానీ హ్యూమన్ బ్రెయిన్ సైకాలజీ ప్రకారం.. ఫిజికల్ పెయిన్ కంటే కూడా మెంటల్ పెయిన్ ఇచ్చే మాటలను బ్రెయిన్ చాలా ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటుంది.

ఒకరి గురించి పూర్తి నిజాలు తెలీకుండా లేదంటే వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడే మాటలు, అవమానకరమైన మాటలు ఎదుటివారిలో ఇన్‌ఫిరియారిటీ కాంప్లెక్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక సమస్యలకు దారితీస్తాయి. మీరు పొరపాటున విసిరిన మాట వల్ల ఆ వ్యక్తి సొసైటీలో అనుభవించే మెంటల్ పెయిన్, స్ట్రెస్ తిరిగి ఎంత డబ్బు పోసినా పూడ్చలేనివిగా మారిపోతాయి.

అసలు ముందే నోరు జారకుండా ఉండాలంటే మైండ్ సైకాలజీ పరంగా కొన్ని పద్ధతులను నేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. సైకాలజిస్టులు సూచించే మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ 5 సెకండ్ పాజ్ రూల్ బాగా పనిచేస్తుంది. ఎటువంటి పరిస్థితులకు అయినా వెంటనే రియాక్ట్ అవ్వకుండా, మాట్లాడే ముందు కనీసం ఐదు సెకన్ల పాటు ఆగి ఆలోచించాలి.

మనం ఇప్పుడు అంటున్న మాట నిజమేనా, ఇది ఇప్పుడు మాట్లాడటం అవసరమా, దీనివల్ల ఎదుటివారి మనసు గాయపడుతుందా అని ప్రశ్నించుకోవాలి. ఇలా కాస్త పాజ్ ఇవ్వడం వల్ల బ్రెయిన్ ఎమోషనల్ మోడ్ నుంచి లాజికల్ మోడ్‌లోకి మారుతుంది. దీంతో ఆటోమేటిక్‌గా అనవసరమైన మాటలు బయటకు రాకుండా నోటిని కంట్రోల్ చేస్తుంది.

Speaking Without Thinking
Speaking Without Thinking

అలాగే పర్సనల్ లేదంటే సోషల్ లైఫ్‌లో ఏదైనా విమర్శించే ముందు మీ కమ్యూనికేషన్ ఇంటెన్షన్ ఏంటో చెక్ చేసుకోవాలి. ఎదుటివారిని మార్చడానికే ఆ మాటలు అంటున్నామా లేదా కేవలం మన కోపాన్ని తీర్చుకోవడానికి నిందిస్తున్నామా అనే క్లారిటీ ఉండాలి. ఒకసారి నోటి నుంచి వచ్చిన మాట గాలిలో కలిసిపోదు. అది ఎదుటివారి మైండ్‌లో పాయిజన్‌లా పారుతూనే ఉంటుంది.

నిజానికి మన మాటలను అదుపులో ఉంచుకోవడం అంటే మన ఆలోచనలను, మన పర్సనాలిటీని కూడా కంట్రోల్‌లో ఉంచుకోవడమే. అందుకే ఎప్పుడైనా సరే.. ఎలాంటి సందర్భంలో అయినా సరే ఆలోచించి మాట్లాడటం నేర్చుకుంటే ఎలాంటి రిలేషన్ అయినా, సొసైటీలో మనపైన ఉన్న గౌరవం అయినా ఎప్పటికీ చెక్కుచెదరకుండానే ఉంటాయి.

Jetal Zala: Jetal Zala s Ecobalance Brings Data-Driven Climate Innovation to UK Hospitality

Related Articles

Back to top button