Just LifestyleLatest News

Sympathy:సానుభూతి కోసం కన్నీళ్లను ఆయుధంగా మార్చే మనస్తత్వం..ఈ మెంటాలిటీ వెరీ డేంజర్ అట..

Sympathy: నేను వాళ్ల కోసం ఎంత చేశాను, కానీ వాళ్లు నన్ను ఇలా బాధపెట్టారని ఏడుస్తూ చెప్తూ ఉండటంతో.. వినేవారిలో ఉన్న సానుభూతి (Sympathy)నరాలు ఉత్తేజితమవుతాయి.

Sympathy

ఎవరైనా ఏడుస్తున్నారంటే వారు బాధితులని, వారిని ఎవరైనా తిడుతున్నా లేదా ప్రశ్నిస్తున్నా వారు దోషులని సొసైటీలో మనందరికీ తెలియకుండానే ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. అందుకే ఈ సూత్రాన్ని కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకుని సింపతీ(Sympathy) కార్డు క్రియేట్ చేసుకుంటుంటారు.

ఎలా అంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవారికి తమ దగ్గర చుట్టాల మీదో, స్నేహితుల మీదో అస్సలు ప్రేమ ఉండదు. కానీ ఇతరులకు వారి గురించి చెబుతున్నప్పుడు మాత్రం కన్నీళ్లు ఒలికిస్తూ బాధపడుతున్నట్లు మాట్లాడతారు. దీంతో ఆ కన్నీళ్లు చూసిన చుట్టుపక్కల వారు పాపం, ఈమె ఇంతలా ఏడుస్తుందంటే.. అవతలి వారు ఎంత ఘోరమైన వారో కదా అనే అంచనాకు తమకు తెలీకుండానే వచ్చేస్తారు. దీంతో ఏడవని వ్యక్తి మంచి వారైనా సరే, ఏడ్చిన వ్యక్తి ముందు విలన్‌లా చిత్రీకరించబడతారు. దీనినే ఎమోషనల్ అపీల్” (Emotional Appeal) అంటారు.

ఇలాంటి వారంతా ఇతరుల గురించి నెగిటివ్ విషయాలను చాలా అంటే చాలా ఎమోషనల్‌గా చెబుతారు. నేను వాళ్ల కోసం ఎంత చేశాను, కానీ వాళ్లు నన్ను ఇలా బాధపెట్టారని ఏడుస్తూ చెప్తూ ఉండటంతో.. వినేవారిలో ఉన్న సానుభూతి (Sympathy)నరాలు ఉత్తేజితమవుతాయి.

దీంతో వీరి మాటలు వినేవారు అవతలి వ్యక్తులు బాగా తెలిసిన వారయినా సరే వారి గురించి నిజాలు తెలుసుకోకుండా ఏడ్చిన వ్యక్తినే సమర్థిస్తారు. ఇది ఎదుటి వ్యక్తి మీద సొసైటీ పరంగా దాడి చేయడానికి చేసే ఒక పక్కా ప్లాన్ అని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మంచి వ్యక్తుల పరువు పోవడమే కాకుండా, వారినే అందరూ దూరం పెట్టేలా పరిస్థితులు తలెత్తుతాయి.

దీనిని సైకాలజీలో పెర్ఫార్మేటివ్ గ్రీఫ్ (Performative Grief) , సింపతీ కార్డ్ ప్లేయింగ్ (Sympathy Card Playing) అంటారు. వీరు తమ కన్నీళ్లను ఒక సోషల్ వెపన్ లాగా వాడతారు. వీరి ఉద్దేశం బాధపడటం కాదు, చుట్టుపక్కల ఉన్న సామాజిక వర్గాన్ని కానీ గ్రూపుని కానీ తమ వైపు తిప్పుకోవడమే.

అంతేకాదు ఇలాంటి వారి ప్రవర్తనలో ఒక విచిత్రమైన విషయం కూడా కనిపిస్తుంది. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నప్పుడు, వీరు చెప్పాల్సిన విషయం చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే వీరి ఏడుపు ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు , పని పూర్తికాగానే ఆ కన్నీళ్లన్నీ మాయమైపోయి, మళ్లీ మామూలుగానే కనిపిస్తారు.

అంటే వీరు కన్నీళ్లను బావిలో నీళ్లలాగా అవసరానికి తగినట్లు తోడుకుంటారన్న మాట. ఈ మనస్తత్వాన్ని మకియవెల్లియనిజం(Machiavellianism) అని కూడా అంటారు. అంటే తమ స్వార్థం కోసం ఇతరుల మనోభావాలను వాడుకోవడం, ఎదుటివారి ఇమేజ్‌ని దెబ్బతీయడం అన్నమాట.

Sympathy
Sympathy

నిజానికి ఏడుపు అనేది ఒక ఎమోషనల్ అవ్వాలి కానీ, దానిని ఇతరుల జీవితాలను, వ్యక్తిత్వాలను చిన్నాభిన్నం చేసే నాటకంగా మార్చడానికి వాడకూడదు. ఇలాంటి ఎమోషనల్ యాక్టర్ల వల్ల నిజంగా బాధలో ఉన్నవారికి కూడా లోకం విలువ ఇవ్వకపోవడం నిజంగా దురదృష్టకరం.

దీనిని గుర్తించడం ఎలా అంటే.. ఒక వ్యక్తి ఎప్పుడూ తననే బాధితుడిగా (Victim) చూపిస్తూ, ఎదుటివారి మీద నిందలు వేస్తూ ఏడుస్తున్నారంటే వారిని అనుమానించాల్సిందే. ఏడ్చే వారినే లోకం సమర్థిస్తుంది అనేది వారికి ఉన్న నమ్మకం కాబట్టి ఇలాంటివారి మాటలు విన్నప్పుడు, నాణేనికి ఉన్న రెండో వైపును కూడా చూడటం అలవాటు చేసుకోవాలి.

KKR vs RR : కోల్ ”ఖాతా” తెరిచేనా ?..రాజస్థాన్ తో డూ ఆర్ డై

Related Articles

Back to top button