Just LifestyleLatest News

Wallet: మీ పర్స్‌లో డబ్బు నిలవాలంటే.. ఈ వాస్తు సూత్రాలు పాటించండి

Wallet: షాపింగ్ చేసిన పాత బిల్లులు, అనవసరమైన కాగితాలు పర్స్ లో ఉంచకూడదు. దీని వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పైగా ఇది ఖర్చులను పెంచుతుందట.

Wallet

చాలామంది ఎంత సంపాదించినా సరే చేతిలో రూపాయి కూడా నిలవడం లేదని బాధపడుతుంటారు. దీనికి మీ పర్స్ (Wallet) వాస్తు కూడా ఒక కారణం కావొచ్చు. పర్స్ అనేది లక్ష్మీ దేవి నివసించే స్థానంగా మనం భావించాలి. అందుకే పర్స్ లో ఏం ఉండాలో ఏం ఉండకూడదో తెలుసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పాత బిల్లులు.. షాపింగ్ చేసిన పాత బిల్లులు, అనవసరమైన కాగితాలు పర్స్ లో ఉంచకూడదు. దీని వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పైగా ఇది ఖర్చులను పెంచుతుందట.
చనిపోయిన వారి ఫోటోలు.. మనకు ఎంత ఇష్టమైన వారైనా సరే, చనిపోయిన వారి ఫోటోలను పర్స్ లో ఉంచకూడదు. ఇది వాస్తు దోషానికి దారి తీస్తుంది.
చిరిగిన నోట్లు.. పర్స్ లో చిరిగిన నోట్లు ఉంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయట.అందుకే వాటిని వెంటనే తీసేయండి

Wallet
Wallet

పర్స్ లో ఎప్పుడూ నోట్లను మడతపెట్టకూడదట. వాటిని వరుస క్రమంలో అమర్చుకోవాలి. ఒక చిన్న పచ్చ కర్పూరం ముక్క కానీ ఒక గోమతీ చక్రం కానీ, వెండి నాణం కానీ, లవంగాలు కానీ పర్స్ లో ఉంచుకుంటే ధనాకర్షణ పెరుగుతుందట.

అలాగే పర్స్ఎప్పుడూ చిరిగిపోయి ఉండకూడదట. మంచి రంగులో ఉన్న పర్స్ ముఖ్యంగా బ్రౌన్ లేదా బ్లాక్ కలర్ వ్యాలెట్ వాడటం మంచిదని వాస్తు శాస్త్రం వివరిస్తుంది.

Budget:బడ్జెట్ 2026 సామాన్యుడికి వరం అవుతుందా? భారం మిగులుస్తుందా?

Related Articles

Back to top button