Appreciation : మనసులోని మెచ్చుకోలును దాచుకోకండి..ఎదుటివారిలో కాన్ఫిడెన్స్ నింపండి..
Appreciation : కష్టపడి మంచి క్వాలిటీ ప్రొడెక్ట్స్ ఇస్తున్నప్పుడు, వాళ్ల గురించి గూగుల్‌లోనో , సోషల్ మీడియాలోనో ఒక పాజిటివ్ రివ్యూ పెట్టండి.
Appreciation
మనం రోజూ ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. ఎంతోమంది చేస్తున్న ఎన్నో పనులను గమనిస్తుంటాం. అందులో మన మనసుకు నచ్చిన విషయాన్ని ఎదుటివారితో ఓపెన్‌గా చెప్పడానికి మాత్రం ఆలోచిస్తాం. నిజానికి మనం చెప్పే ఒక్క చిన్న మంచి మాట, ఒక చిన్న అప్రిసియేషన్(Appreciation) ఎదుటివారిలో ఎంత కాన్ఫిడెన్స్ నింపుతుందో వారికే తెలీదు. అది వాళ్లకి లైఫ్ మీద ఒక కొత్త ఆశను, నమ్మకాన్ని ఇస్తుంది. ఎదుటి వారిని మనస్ఫూర్తిగా అభినందించడం వల్ల మనకు పోయేదేమీ ఉండదు. కాకపోతే ఎదుటివారి ఫేస్‌లో ఒక హార్ట్‌ఫుల్ నవ్వును చూసే అవకాశం దక్కుతుంది.
ఉదాహరణకు, మీరు ఒక రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు అక్కడ వెయిటర్ చాలా బాగా రిసీవ్ చేసుకుని సర్వీస్ ఇచ్చారనుకోండి. వారితో మీరు.. బాగా సర్వీస్ చేశావ్ అని ఒక్క మాట చెబితే రోజంతా కష్టపడే ఆ వ్యక్తికి అది చాలా పెద్ద బూస్టప్ ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్ , లేదా కొలీగ్ అందంగా రెడీ అయి వస్తే.. ఈ రోజు డ్రెస్సింగ్ చాలా బాగుంది అని ఇచ్చే చిన్న కాంప్లిమెంట్ వాళ్ల డే మొత్తాన్ని హ్యాపీగా మార్చేస్తుంది.
మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్లు ఇలా ఎవరైనా సరే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తూ కన్సిస్టెంట్గా గ్రో అవుతుంటే.. మీ డెడికేషన్ అద్భుతం, మీరు రీచ్ అవుతున్న హైట్స్ చూస్తుంటే చాలా గర్వంగా ఉందని చెప్పండి. అలాగే మిమ్మల్ని కూడా ఎవరైనా సరే తమ మాటలతోనో, చేతలతోనో ఇన్స్పైర్ చేస్తే.. ఒక థాంక్యూ మెసేజ్ పెట్టేయండి. మీ రెస్పాన్స్, మాటలు వాళ్లకు మరింత మంచి చేయాలనే ఎనర్జీనిస్తాయి.
ఇక రిలేషన్షిప్ విషయానికి వస్తే, మీ పార్ట్నర్ మిమ్మల్ని ఏదైనా విషయంలో మెచ్చుకున్నా(Appreciation), మీ కోసం ఏమైనా స్పెషల్‌గా చేసినా.. అది మీకు ఎలా అనిపించిందో వాళ్లకు చెప్పండి. అంతేకాదు మీ పిల్లలో లేదంటే మీకు తెలిసిన స్టూడెంట్స్ చదువులోనో, ఆటల్లోనో మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే.. నీ టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంటూ వాళ్లకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చే ఇన్స్పైరింగ్ మాటలతో మెచ్చుకోండి. ఆ మాటలే వాళ్ల ఫ్యూచర్‌కు ఒక పెద్ద గైడెన్స్‌లా మారతాయి.

ఇది కేవలం ఒకరితో ఒకరు ఫేస్ టు ఫేస్ చెప్పడానికి మాత్రమే కాదు అలా మనమిచ్చే చిన్న సపోర్ట్ ఎంతోమంది లైఫ్‌ను కూడా సెట్ చేస్తుంది. ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ చేసేవాళ్లు కష్టపడి మంచి క్వాలిటీ ప్రొడెక్ట్స్ ఇస్తున్నప్పుడు, వాళ్ల గురించి గూగుల్‌లోనో , సోషల్ మీడియాలోనో ఒక పాజిటివ్ రివ్యూ పెట్టండి. ఆ చిన్న రివ్యూ వాళ్ల బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, ఇంకా బాగా చేయాలనే నమ్మకాన్ని వారికి ఇస్తుంది.
అందుకే మన చుట్టూ ఉన్నవాళ్లను గమనించండి. వాళ్లు మంచి చేసినా లేదంటే వారి ప్రతిభను, కష్టాన్ని గుర్తించి ఓపెన్‌గా, మనస్ఫూర్తిగా మెచ్చుకోండి. స్ప్రెడ్ పాజిటివిటీ, టెల్ దెమ్ హార్ట్ఫుల్లీ…





