Just LifestyleLatest News

Fear of Rejection : వాళ్లూ కావాలి..మీరూ కావాలనే మనస్తత్వం..డబుల్ ఫేస్ మనుషులతో ఎందుకు కేర్ ఫుల్‌గా ఉండాలి?

Fear of Rejection : ఎవరికైనా నో చెప్తే లేదా ఒకరి పక్కనే నిలబడితే.. రెండో సైడ్ నుంచి ఇంపార్టెన్స్ తగ్గుతుందేమో, తనకున్న మంచివారు అనే ట్యాగ్ పోతుందేమోనని భయపడతారు.

Fear of Rejection

ఇద్దరి మధ్య గొడవ వచ్చినపుడు ఇద్దరికీ కావాల్సిన వ్యక్తి ..అయితే ఇద్దరికీ నచ్చచెప్పాలి. లేదంటే ఒకరి వైపు స్టాండ్ తీసుకోవాలి. కానీ కొంతమంది మాత్రం అక్కడా మంచితనం పోకూడదు..ఇక్కడా మంచితనం పోకూడదు అనేటట్టుగా ఉంటారు. వాళ్లూ కావాలి, మీరూ కావాలి ఇద్దరూ నాకు కావాల్సినవారే అంటూ సెంటిమెంటల్ లాజిక్‌ను తీసుకువస్తారు. అయితే ఇది మంచితనం కాదు, ఒక రకమైన మోస్ట్ మానిప్యులేటివ్ మైండ్ సెట్ అంటున్నారు మానసిక నిపుణులు.

నాకు అక్కడ గొడవొద్దు.. అలా అని నీతోనూ రిలేషన్ పాడవకూడదనుకునేవారు మన ఫ్రెండ్స్ సర్కిల్‌లోనో, చుట్టాల్లోనో కచ్చితంగా ఉంటారు. మన దగ్గరకు వచ్చి నీదే తప్పు లేదు , వాళ్లే అనవసరంగా రచ్చ చేస్తున్నారని మోరల్ సపోర్ట్ చేస్తారు. అలాగే వాళ్ల దగ్గరకు వెళ్లి..అవును.. వాళ్లంతే కాస్త తిక్క, నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటూ వత్తాసు పలుకుతారు. బయటకు వీళ్లు అందరితో కలిసిపోయే, అందరినీ ప్రేమించే స్వీట్ పర్సన్‌లా కనిపిస్తుంటారు.

ఇలా ప్రవర్తించడం వెనుక ఉన్న మెయిన్ సైకాలజీని పీపుల్ ప్లీజింగ్ సిండ్రోమ్ (People Pleasing Syndrome) లేదా ఫియర్ ఆఫ్ రిజెక్షన్ (Fear of Rejection) అంటే ఒంటరి అయిపోతామనే భయం అంటారు. వీళ్లకు నిజాయితీ కంటే తమ ఇమేజ్‌ను కాపాడుకోవడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.

ఎవరికైనా నో చెప్తే లేదా ఒకరి పక్కనే నిలబడితే.. రెండో సైడ్ నుంచి ఇంపార్టెన్స్ తగ్గుతుందేమో, తనకున్న మంచివారు అనే ట్యాగ్ పోతుందేమోనని భయపడతారు. దీనివల్లే వాళ్లు ఏ ఒక్కరి వైపూ ఉండలేరు. ఎవరైనా సరే కచ్చితంగా ఒక వైపు సపోర్ట్ చేయమంటే సైడ్ అయిపోతారు లేదా పాయింట్‌ను డైవర్ట్ చేస్తారు.

వీరి వల్ల బంధాల్లో నమ్మకం పోవడం అనే అతిపెద్ద ప్రాబ్లెం ఎదురవుతుంది. ఒక నిజమైన ఫ్రెండ్ లేదా రిలేటివ్ అంటే మన తప్పులున్నప్పుడు ఫేస్ మీదే చెబుతారు. కరెక్ట్ ఉన్నప్పుడు అందరితో గొడవ పడాల్సి వచ్చినా కూడా మన పక్కనే నిలబడతారు. కానీ ఈ టైప్ బ్యాచ్ మాత్రం ఎటువైపు గాలి వీస్తే అటువైపు బెండ్ అయిపోతారు. రేపు మీకు ఒక పెద్ద ప్రాబ్లెం వచ్చి, అవతలి వ్యక్తితో ఓపెన్‌గా మాట్లాడాల్సి వస్తే కనుక వీళ్లు నాకెందుకు లేనిపోని గోల అని సైలెంట్‌గా ఎస్కేప్ అయిపోతారు. చివరకు మిమ్మల్నే నువ్వే కాస్త తగ్గి ఉంటే బాగుండేదని కవర్ డ్రైవ్‌లు వేస్తారు.

Fear of Rejection
Fear of Rejection

సైకాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో.. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ ఒకరకమైన ఇన్నర్ ప్రెజర్ అండ్ స్ట్రెస్‌తో బతుకుతుంటారు. ప్రతీ ఒక్కరిని సాటిస్ఫై చేయడానికి రోజూ రకరకాల మాస్క్‌లు తొడుక్కోవాల్సి రావడం వల్ల, మెల్లగా వాళ్లకు సొంత క్యారెక్టర్ లేదా ఒరిజినాలిటీ అనేది లేకుండా పోతుంది. రోజులు గడిచేకొద్దీ రెండు వైపులా ఉన్నవాళ్లకు వీళ్ల డబుల్ గేమ్ అర్థమైపోతుంది.

మీ లైఫ్‌లో కూడా ఇలాంటి వాళ్లుంటే.. వాళ్లను శత్రువులుగా చూడాల్సిన పనేమీ లేదు కానీ, కాస్త డిస్టెన్స్ మెయింటెన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ పర్సనల్ విషయాలు, ప్లాన్స్ వాళ్లతో షేర్ చేసుకుంటే.. అవి క్షణాల్లో రెండో సైడ్ లీక్ అయిపోతాయి. వీళ్లతో మాట్లాడేటప్పుడు క్యాజువల్‌గా మాత్రమే ఉండండి. మీ ఎమోషనల్ లైఫ్‌లోకి , సీరియస్ మేటర్స్‌లోకి వీళ్లను అస్సలు ఎంటర్ చేయకండి.

Bilibili : ఫస్ట్ వీడియోకే చేతికి డబ్బులు..యూట్యూబ్‌కి పోటీగా గ్లోబల్ రేసులోకి కొత్త యాప్ బిలిబిలి..

Related Articles

Back to top button