Sleep Over : పెరుగుతున్న స్లీప్ ఓవర్ కల్చర్..పిల్లలను ఫ్రెండ్స్ ఇంటికి అలా పంపడం సేఫేనా?
Sleep Over : ఒకవేళ ఫ్రెండ్స్ ఇంటికి పంపకపోతే పిల్లలు ఫీలవుతారని అనుకుంటే నైట్ స్టే చేయడానికి పంపకుండా..హాఫ్ డే స్లీప్ ఓవర్ లేదా లేట్ ఈవెనింగ్ హ్యాంగ్అవుట్ ప్లాన్ చేసి రాత్రికి ఇంటికి తీసుకుని వెళ్లడమే మంచిది.
Sleep Over
ఒకప్పుడు రిలేటివ్స్ ఇళ్లకు వెళ్లి ఉండటం ఎంత కామన్ ప్రతిపాదనగా ఉండేదో, ఇప్పుడు పిల్లలు తమ ఫ్రెండ్స్ ఇంట్లో స్లీప్ ఓవర్ పేరుతో నైట్ స్టే చేయడమూ అంతే ట్రెండ్‌గా మారింది. అయితే, పాప్‌కార్న్ తింటూ, మూవీలు చూస్తూ అర్ధరాత్రి వరకు గడిపే ఈ సరదా వెనుక పిల్లల మానసిక వికాసానికి ఉపయోగపడే విషయాలతో పాటు , పేరెంట్స్ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని ప్రమాదాలు కూడా ఉన్నాయని సైకాలజిస్టులు చెబుతున్నారు.
సైకాలజీ పరంగా చూస్తే, స్లీప్ ఓవర్లు(Sleep Over) పిల్లల్లో ఇండిపెండెన్స్ (Independence) పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. సొంత ఇల్లు, పేరెంట్స్ లేని అట్మాస్ఫియర్లో ఒక రాత్రి గడపడం వల్ల పిల్లలలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కొత్త పరిసరాలకు అలవాటు పడే మైండ్ సెట్ పెరుగుతాయి. ఫ్రెండ్స్, వారి పేరెంట్స్‌తో కలసి ఉండటం వల్ల సోషల్ స్కిల్స్, అడ్జస్ట్మెంట్ నేచర్ బాగుంటాయి. అంతేకాకుండా, ఇలాంటి స్లీపింగ్ హాబిట్స్ లేదా వేరే ఫ్యామిలీ కల్చర్ చూడటం వల్ల వారిలో మైండ్ సెట్ బ్రాడ్ అవుతుంది.
అయితే ఇందులోని నెగెటివ్ షేడ్స్ పేరెంట్స్‌కు పెద్ద టెన్షన్‌గా మారుతున్నాయి. మెయిన్‌గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా తమ పిల్లలు ఉండే చోట ఎలాంటి అబ్యూస్ అంటే లైంగిక లేదా మానసిక వేధింపులు జరిగే అవకాశం ఉంటుందో ఊహించడం కష్టం. అలాగే ఫ్రెండ్స్ వల్ల మిడ్ నైట్ వరకు మేల్కొని ఉండటం వల్ల స్లీప్ సైకిల్ దెబ్బతినడం, స్క్రీన్ టైమ్ లిమిట్ దాటిపోవడం వంటి సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తే పిల్లల్లో తీవ్రమైన యాంగ్జైటీ లేదా హోమ్‌సిక్‌నెస్ వల్ల మెంటల్‌గా టెన్షన్ పడతారు.

ఇలాంటి పరిస్థితులలో డెసిషన్ మేకింగ్ బాధ్యత పూర్తిగా పేరెంట్స్ పైనే ఉండాలి. స్లీప్ ఓవర్(Sleep Over)కు పంపే ముందు ఆ ఇల్లు తమ పిల్లలకు ఎంతవరకు సేఫ్నో, అక్కడ ఉండే పెద్దల ప్రవర్తన ఎలాంటిదో ముందే అసెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఒకవేళ ఫ్రెండ్స్ ఇంటికి పంపకపోతే పిల్లలు ఫీలవుతారని అనుకుంటే నైట్ స్టే చేయడానికి పంపకుండా..హాఫ్ డే స్లీప్ ఓవర్ లేదా లేట్ ఈవెనింగ్ హ్యాంగ్అవుట్ ప్లాన్ చేసి రాత్రికి ఇంటికి తీసుకుని వెళ్లడమే మంచిది. పిల్లల మెచ్యూరిటీని బట్టి, వారి సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇస్తూ డెసిషన్ తీసుకోవడమే స్లీప్ ఓవర్ కల్చర్‌లో అసలైన పేరెంటింగ్ చాలెంజ్ అని చెప్పొచ్చు.





