Vijay Cabinet:విజయ్ మంత్రివర్గంలోకి మరో 23 మంది ఎమ్మెల్యేలు.. రేసులో మిగిలిన పార్టీలకు తుది విడతలో ఛాన్స్ ఉంటుందా?
Vijay Cabinet : ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కినా.. ప్రభుత్వానికి బయటి నుంచి సపోర్ట్ ఇస్తున్న వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ వంటి ఇతర మిత్ర పక్షాలను విజయ్ ప్రస్తుతానికి ఈ విస్తరణలో భాగస్వామ్యం చేయలేదు
Vijay Cabinet
రాజకీయాల్లో ఇటీవల సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గాన్ని(Vijay Cabinet) మరింత బలోపేతం చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో నుంచి పొలిటికల్ లీడర్‌గా మారి రీసెంట్గా సీఎం పీఠాన్ని అధిరోహించిన విజయ్, గురువారం రోజు తన కేబినెట్‌ను భారీగా విస్తరించారు.
ఈ కేబినెట్ విస్తరణలో భాగంగా విజయ్.. మొత్తం 23 మంది కొత్త ఎమ్మెల్యేలకు తమ మంత్రివర్గంలో(Vijay Cabinet) చోటు కల్పించారు. ఇందులో విజయ్ సొంత పార్టీ అయిన తమిళ వెట్రి కళగం నుంచి 21 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారి మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు దక్కాయి. ఈ అధికారిక కార్యక్రమంలో కొత్త మంత్రులందరి చేత రాజ్‌భవన్‌లో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారాన్ని చేయించారు.
మే నెల 10న జరిగిన భారీ బహిరంగ ప్రమాణ స్వీకారోత్సవంలో .. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీఎంతో పాటు కేవలం తొమ్మిది మంది టీవీకే ఎమ్మెల్యేలు మాత్రమే మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇప్పుడు జరిగిన రెండో విడత విస్తరణతో కలిపి విజయ్ కేబినెట్లోని మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరినట్లు అయింది. నిబంధనల ప్రకారం చూస్తే.. తమిళనాడు మంత్రివర్గంలో 35 మంది వరకు మంత్రులు ఉండే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే కేబినెట్లో ఇంకా మరో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.
అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కినా.. ప్రభుత్వానికి బయటి నుంచి సపోర్ట్ ఇస్తున్న వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ వంటి ఇతర మిత్రపక్షాలకు విజయ్ ప్రస్తుతానికి ఈ విస్తరణలో భాగస్వామ్యం కాలేదు.

అయినా సరే, కూటమిలోని పక్షాలన్నీ అధికారంలో భాగస్వామ్యం కావాలని చెబుతూ..సంకీర్ణ మంత్రివర్గంలో లాంఛనంగా చేరాలని టీవీకే అధినాయకత్వం మొదటి నుంచి కోరుతూనే ఉంది. సీఎం విజయ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మిత్రపక్షాలకు సాదర ఆహ్వానం పలుకుతున్నారు. దీంతో కేబినెట్లో ఇంకా ఖాళీగా ఉన్న మిగిలిన మంత్రి పదవులను భవిష్యత్తులో ఈ భాగస్వామ్య పార్టీలకు కేటాయించే అవకాశం ఉందని.. దీని ద్వారా కూటమిని మరింత పటిష్టం చేయాలనే వ్యూహంతో విజయ్ ఉన్నట్లు పొలిటికల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.





