Exit Polls : హాట్ టాపిక్ గా ఎగ్టిజ్ పోల్స్..వాటి ఖచితత్వం ఎంత ?
Exit Polls : ఎన్నికలు జరిగిన ప్రతీసారీ పోలింగ్ ముగిసిన వెంటనే అందరూ ఎదురుచూసేది ఎగ్జిట్ పోల్స్ గురించే… ఓటర్ల నాడిని అంచనా వేస్తూ పలు సర్వేలు నిర్వహించి పోటాపోటీగా కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తుంటాయి
Exit Polls
ఎన్నికలు జరిగిన ప్రతీసారీ పోలింగ్ ముగిసిన వెంటనే అందరూ ఎదురుచూసేది ఎగ్జిట్ పోల్స్(Exit Polls) గురించే… ఓటర్ల నాడిని అంచనా వేస్తూ పలు సర్వేలు నిర్వహించి పోటాపోటీగా కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్(Exit Polls) వెల్లడిస్తుంటాయి. కొన్నిసార్లు వాటి అంచనాలు నిజమవుతాయి.. మరికొన్ని సార్లు తారుమారైన సందర్భాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోవడంతో కౌంటింగ్ కంటే ముందు పలు సంస్థలు వెల్లడించిన ఎగ్టిజ్ పోల్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఊహించనట్టుగానే కొన్ని సంస్థలు ఒక విధంగా, మరికొన్ని సంచలన ఫలితాలు ప్రకటించాయి. మెజారిటీ సంస్థలు మాత్రం అన్ని రాష్ట్రాల్లో ఒకేవైపు మొగ్గుచూపించినట్టు అర్థమవుతోంది.
తమిళనాడులో డీఎంకే అధికారం నిలబెట్టుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. బెంగాల్ లో మాత్రం హోరాహోరీ తప్పదంటూనే కొన్ని సంస్థలు మమతాదే విజయమని చెబుతుంటే.. మరికొన్ని మాత్రం బీజేపీ గెలుస్తుందని తేల్చాయి. అసోంలో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి.
అయితే తమిళనాడులో యాక్సిస్ మై ఇండియా నటుడు విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం సాధిస్తుందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అందరి చూపు నెలకొన్న తమిళనాడు, బెంగాల్ పై భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ వెలువడడంతో ఉత్కంఠ పెరిగిపోయింది.
దీంతో అసలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకూ నిజమవుతాయన్న చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా నిజమవ్వాలనీ లేదు.. తప్పు కావాలనీ లేదు. చాలా మంది విశ్లేషకుల అంచనా ప్రకారం ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత అనేది పూర్తిగా ఖచ్చితమైనది కాదు. అవి కేవలం అంచనాలు మాత్రమే.
ఎగ్జిట్ పోల్స్(Exit Polls) ఓటు వేసి బయటకు వస్తున్న వారిని అడిగి తెలుసుకునే సర్వే కాబట్టి, అభిప్రాయ సేకరణ కంటే ఇవి కొంత నమ్మదగినవిగా భావిస్తారు. అదే సమయంలో వారు ఎంపిక చేసుకున్న ప్రాంతాలు, నమూనా సైజ్, ఓటర్లు నిజం చెబుతున్నారా లేదా అనే దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

చాలాసార్లు, ముఖ్యంగా హోరాహోరీ పోరు ఉన్నప్పుడు, ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలకు భిన్నంగా వస్తాయి.కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలూ ఉన్నాయి. వివిధ సర్వే సంస్థలు ఇస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ప్రజలను గందరగోళానికి గురి చేసేలా ఉంటున్నాయి. 2004 సార్వత్రిక ఎన్నికలు, 2015, 2020 బిహార్ ఎలక్షన్లు, 2021 బెంగాల్, ఢిల్లీ ఎన్నికలు, గతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పాయి.
ఎగ్జిట్ పోల్స్ చేసే సర్వే సంస్థలు తీసుకునే శాంపిల్స్ తక్కువగా ఉంటున్నాయన్నది చాలా మంది చెబుతున్న మాట. అలాగే ప్రజలు తాము ఎవరికి ఓటేశామన్న విషయాన్ని సరిగ్గా చెప్పడం లేదన్న వాదన కూడా ఉంది. పైగా పలు సంస్థలు ఒకలా, మరికొన్ని సంస్థలు మరోలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇస్తుండడంతో పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
Government Services:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవలు.. డిజిటల్ విప్లవం, వాట్సప్ గవర్నెన్స్ వైపు అడుగులు





