Just Nationaljust AnalysisLatest News

Ratan Tata : సుత్తి పట్టిన చేతులతో ప్రపంచాన్ని ఏలిన విజేత.. రతన్ టాటా ఐకానిక్ జర్నీ

Ratan Tata : సాహసోపేతమైన నిర్ణయాలు, కార్మికుల పట్ల చూపే మానవత్వం , సేవా దృక్పథం , దేశం పట్ల భక్తి ..రతన్ టాటాను ప్రత్యేక స్థాయిలో నిలబెట్టాయి.

Ratan Tata

పారిశ్రామిక రంగంలో ఎంతో మంది గొప్పగా రాణించినా కొందరికే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ కొద్ది మంది జాబితాలో రతన్ టాటా పేరు కచ్చితంగా ఉంటుంది. విలువలు పాటిస్తూ సాధారణ ఉద్యోగి స్థాయి నుంచి అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన గొప్ప వ్యక్తి.

రతన్ టాటా(Ratan Tata) తన దూరదృష్టి, క్రమశిక్షణ , విలువలతో కూడిన నాయకత్వంతో టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ లాంటి ధనిక కుటుంబంలో పుట్టినా .. టాటా స్టీల్ ఫ్యాక్టరీలో ఒక సాధారణ కార్మికుడిగా కెరీర్ ప్రారంభించారు. స్వయంగా సుత్తితో ఐరన్‌ను పగలగొట్టడం, బ్లాస్ట్ ఫర్నెస్ వద్ద పనిచేయడం వంటి పనులు చేసారు.

1991లో జె.ఆర్.డి. టాటా తర్వాత రతన్ టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. సంస్థలోని సీనియర్ అధికారులు ఆయనను వ్యతిరేకించినా, తన ప్రతిభతో అందరినీ ఒప్పించి నాయకుడిగా ఎదిగారు. రతన్ టాటా కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా టాటా ముద్రను వేశారు.

2000 సంవత్సరంలో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ టెట్లీ టీ కంపెనీని, 2007లో ఐరోపాకు చెందిన అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ కోరస్‌ను సొంతం చేసుకున్నారు.2008లో ఫోర్డ్ కంపెనీ నుంచి నష్టాల్లో ఉన్న ఐకానిక్ కార్ల బ్రాండ్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్లను కొనుగోలు చేసి, వాటిని లాభాల్లోకి తెచ్చారు.

సామాన్య మధ్యతరగతి కుటుంబం కూడా కారులో ప్రయాణించాలనే కలని నిజం చేయడానికి కేవలం రూ. 1 లక్షకే టాటా నానో కారును మార్కెట్లోకి తెచ్చిన క్రెడిట్ రతన్ టాటాది. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ఆదాయం 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయి.

అన్నిటికంటే ముఖ్యంగా దాతృతంలో రతన్ టాటా(Ratan Tata) మించిన వారు లేరన్నది అంగీకరించాల్సిందే. తన సంపాదన కంటే సమాజ సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. టాటా సన్స్ కంపెనీ వచ్చే లాభాల్లో 66 శాతం వాటాను టాటా ట్రస్టుల ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కేటాయించారు.

Ratan Tata
Ratan Tata

సాహసోపేతమైన నిర్ణయాలు, కార్మికుల పట్ల చూపే మానవత్వం , సేవా దృక్పథం , దేశం పట్ల భక్తి ..రతన్ టాటాను ప్రత్యేక స్థాయిలో నిలబెట్టాయి. ఈ కారణంగానే రతన్ టాటా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.

భారత ప్రభుత్వం 2000లో పద్మభూషణ్, 2008లో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌లతో టాటాను గౌరవించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తన 86వ ఏట తుదిశ్వాస విడిచారు రతన్ టాటా.

Expectations : రిలేషన్‌షిప్‌లో ఎక్స్‌పెక్టేషన్స్.. పార్ట్‌నర్ దగ్గర ఆశించడానికి హద్దులుండాలా.?

Related Articles

Back to top button