Just NationalLatest News

Census:డిజిటల్ బాటలో జనగణన..ఈ జాతీయ జనాభా గణన ఎలా నిర్వహిస్తారు?

Census:1951 నుంచి క్రమం తప్పకుండా జరుగుతున్న ఈ జనగణన, ఇప్పుడు పదహారవ సారి చేపట్టబోయే అతిపెద్ద జాతీయ స్థాయి కార్యక్రమంగా నిలవబోతోంది.

Census

దేశంలో ఏ శాఖలో పురోగతి సాధించాలన్నా కూడా చివరకు ప్రభుత్వం ప్రజాహిత పాలసీలను రూపొందించాలన్నా సరే జనగణన అత్యంత కీలకం. ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ జన గణన(Census), దేశంలోని సామాజిక, ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించే అత్యంత ప్రామాణికమైన సమాచార నిధిగా ప్రభుత్వాలు భావిస్తాయి.

నిజానికి స్వాతంత్య్రానికి పూర్వం 1872లోనే మొదలైన ఈ ప్రక్రియ.. సమకాలీన పద్ధతిలో 1881 నుంచి మాత్రం నిరంతరాయంగా ఈ సమకాలిక జనాభా లెక్కలు (సింక్రోనస్ సెన్సెస్) కొనసాగుతున్నాయి. 1951 నుంచి క్రమం తప్పకుండా జరుగుతున్న ఈ జనగణన, ఇప్పుడు పదహారవ సారి చేపట్టబోయే అతిపెద్ద జాతీయ స్థాయి కార్యక్రమంగా నిలవబోతోంది.

ఈ కీలక ప్రక్రియపై జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి .. హైదరాబాద్‌లోని కోఠిలోని సెన్సస్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 2026 మే 11 నుంచి ప్రారంభమవుతున్న తొలిదశ జనాభా లెక్కల ప్రక్రియపై ఆమె మాట్లాడారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియావాళ్లు వారధిగా పనిచేయాలని, జనాభా లెక్కల విషయంలోనూ అదే విధంగా కృషి చేయాలని రిక్వెస్ట్ చేశారు.

కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో అన్ని రాష్ట్రాల సహకారంతో ఫెడరల్ స్ఫూర్తితో ఈ జనగణన(Census) ప్రక్రియ కొనసాగుతుందని, దీనిలో సేకరించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో జరుగుతున్న తొలి జనగణన కావడంతో ప్రజలందరూ సహకరించాలని డైరెక్టర్ కోరారు.

Census
Census

కాగా 2026 మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు మొదటి దశలో హౌస్ హోల్డింగ్ లెక్కింపు జరుగుతుంది. పెద్ద పెద్ద భవనాలకే కాదు చిన్న పూరి గుడిసెలకు కూడా నెంబర్ కేటాయిస్తారు. దీని కోసం 2026 ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు ప్రజలకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి 9 నుంచి 28వ తేదీ వరకు ప్రధాన జనాభా లెక్కింపు జరగనుంది. ఫిబ్రవరి 28 రాత్రి నిరాశ్రయులను లెక్కించి.. ఆ తర్వాత మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు రివిజన్ రౌండ్ నిర్వహిస్తారు.

మొదటి దశలో సేకరించే 33 ప్రశ్నలు ఉంటాయని.. వాటిలో భవన స్థితిగతులు, మౌలిక వసతులు, ఇంట్లో ఉండే ఆస్తులు, ఆహార అలవాట్లు, మొబైల్ నెంబర్ వంటి వివరాలుంటాయని అన్నారు. ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ మోడ్‌లో నిర్వహించడానికి ఆఫ్‌లైన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఈ విషయంలో ఎన్యూమరేటర్లు ఎవరైనా సరే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రీ టెస్ట్ విజయవంతంగా పూర్తయిందని, సుమారు 88,470 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారని డైరెక్టర్ వివరించారు.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button