Just NationalJust Andhra PradeshJust PoliticalLatest News

CM Chandrababu : రూ.500 నోట్లు రద్దు చేయాల్సిందే.. అవినీతి అంతానికి చంద్రబాబు ప్రతిపాదన

CM Chandrababu : దేశంలో అవినీతిని పూర్తిగా రూపుమాపడానికి రూ.500 నోట్లను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. దీంతో డిజిటల్ కరెన్సీ ప్రాధాన్యత, ఈ డిమాండ్ వెనుక ఉన్న ఆలోచన మరోసారి చర్చకు దారి తీసింది.

CM Chandrababu

భారతీయ ఆర్థిక వ్యవస్థలో అవినీతికి చెక్ పెట్టాలంటే రూ.500 నోట్లను పూర్తిగా పక్కన పెట్టాల్సిందే అంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమరావతిలో లోకల్ బాడీ ఎన్నికల గ్రాండ్ విజయంపై మీడియాతో మాట్లాడిన సీఎం.. కేవలం పాలిటిక్స్ గురించే కాకుండా, దేశ భవిష్యత్తును మార్చేయగల ఒక బలమైన ఆర్థిక ప్రణాళికను కూడా తెర మీదకు తెచ్చారు.

దేశంలో అక్రమ సంపాదన,బ్లాక్ మనీ, లంచగొండితనం రోజురోజుకూ పెరిగిపోవడానికి పెద్ద నోట్ల చలామణీయే మెయిన్ రీజన్ అని ఏపీ సీఎం చెప్పారు.భారత దేశంలో ఇప్పటికీ పెద్ద మొత్తంలో నగదు ట్రాన్జాక్షన్స్ జరగడానికి రూ.500 నోట్లే ముఖ్య కారణమని, అవినీతిపరులు అక్రమంగా డబ్బులు దాచుకోవడానికి, చేతులు మార్చడానికి ఈ నోట్లే ఎక్కువగా వాడుతున్నారని చంద్రబాబు వివరించారు.

అందుకే సిస్టంలో మార్పు రావాలంటే ఈ రూ.500 నోట్లను పూర్తిగా కేన్సిల్ చేయాలని, కేవలం రూ.100, రూ.200 నోట్లను మాత్రమే మార్కెట్లో ఉంచాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కేవలం చిన్న నోట్లతో పాటు డిజిటల్ కరెన్సీని ఎక్కువగా ప్రమోట్ చేయడమే అవినీతిని అణచివేయడానికి ఏకైక సొల్యూషన్ అని ఆయన స్పష్టం చేశారు.

టెక్నాలజీని సరిగ్గా వాడుకున్నప్పుడే దేశంలో నిజమైన సంపద సృష్టి జరుగుతుందని, పేదరిక నిర్మూలన అసాధ్యమేమీ కాదని చంద్రబాబు(CM Chandrababu) అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ ట్రాన్జాక్షన్ల వైపు అడుగులు వేసేలా తమ పాలసీలు ఉండాలని కోరుతూ, దీనికోసం తాను ప్రధాని నరేంద్ర మోదీని కంటిన్యూగా డిమాండ్ చేస్తూనే ఉంటానని ఆయన తేల్చిచెప్పారు. డిజిటల్ కరెన్సీ వల్ల ప్రతీ ఒక్క రూపాయికి కూడా లెక్క ఉంటుందని, అక్రమాలకు ఎక్కడా చోటు ఉండదని బాబు నొక్కిచెప్పారు.

ఇక ఇదే సమావేశంలో ఏపీలో ఇటీవల ముగిసిన లోకల్ బాడీ రిజల్ట్స్‌పై మాట్లాడుతూ, తుపానుల సమయంలోనూ ప్రజల సంక్షేమానికే ఇంపార్టెన్స్ ఇచ్చిన తమ గవర్నమెంట్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని బాబు గుర్తు చేసుకున్నారు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా సుపరిపాలనకు ప్రజలు జై కొట్టారని, ఈవీఎంల మీద ఏడుపు ఏడ్చిన వైసీపీకి.. బ్యాలెట్ ఎన్నికల్లో కూడా ప్రజలు సమ్మతి తెలపలేదని ఎద్దేవా చేశారు. మొత్తానికి టెక్నాలజీతో కూడిన పారదర్శక డిజిటల్ సిస్టం దేశాన్ని ముందుకు నడిపిస్తుందనే చంద్రబాబు(CM Chandrababu) విజన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Hyderabad Air Pollution : భయపెడుతున్న హైదరాబాద్‌ ఎయిర్ పొల్యూషన్.. AQI 410 నమోదు..

Related Articles

Back to top button