Just NationalLatest News

EPF : పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లకు షాక్.. కేంద్రం కొత్త రూల్స్ ఇవే..

EPF : పీఎఫ్ అకౌంట్ కొత్త రూల్స్ వల్ల.. ఇకపై మన అకౌంట్‌లోంచి ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా డబ్బులు తీసుకోకుండా విత్‌డ్రా ప్రాసెస్‌ కఠినం అయింది.

EPF

ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పీఎఫ్(EPF) అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే రూల్స్‌ను పూర్తిగా మార్చేసింది. పాత నిబంధనలన్నీ కూడా కేన్సిల్ … పీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్ పథకాలకు సంబంధించి సరికొత్త చట్టాలను అఫీషియల్‌గా అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త రూల్స్ వల్ల.. ఇకపై మన అకౌంట్‌లోంచి ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా డబ్బులు తీసుకోకుండా విత్‌డ్రా ప్రాసెస్‌ కఠినం అయింది.

కొత్త రూల్స్ ప్రకారం.. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో కేవలం 2 సార్లు మాత్రమే పీఎఫ్ అకౌంట్ నుంచి పార్షియల్‌గా డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఆరోగ్య సమస్యలు వస్తే.. ఎన్నిసార్లయినా అమౌంట్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది.

కానీ ఇకపై మాత్రం సంవత్సరానికి రెండు సార్లు కంటే ఎక్కువ ఛాన్స్ ఉండదు. ఒకవేళ వేరే ఏదైనా అవసరానికి ఒకసారి డబ్బులు తీస్తే, అదే ఏడాది మెడికల్ ఎమర్జెన్సీ కింద ఇంకొక్కసారి మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల హైయర్ స్టడీస్ కోసం జాబ్ చేసేటపుడు మొత్తం పది సార్లు, ఇల్లు కొనడానికో, లేక దాని రిపేర్ల కోసం గతంలో రెండు సార్లే ఛాన్స్ ఉండగా, ఇప్పుడు దానిని ఐదు సార్లకు పెంచారు.

PF wage
PF wage

కొత్త పీఎఫ్ రూల్స్ ప్రకారం.. తమ అవసరాల కోసం అకౌంట్‌లోంచి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటున్నపుడు మొత్తం అమౌంట్‌లో కనీసం 25 శాతం బ్యాలెన్స్ అకౌంట్‌లోనే ఉంచాలనే నిబంధనను పెట్టారు. అయితే ఈ 25 శాతం కనీస నిల్వను ఎలా లెక్కపెట్టాంటే.. మీ శాలరీ లోంచి కట్ అయిన మీ వంతు, కంపెనీ వాళ్లు వేసిన వంతు, అలాగే ఆ మొత్తంపై వచ్చిన వడ్డీ.. ఈ మూడింటినీ కలిపి చూస్తారు. ఇలా మీ పీఎఫ్ ఫండ్‌లో నాలుగో వంతు డబ్బులను ముట్టుకోకుండా, మిగిలిన అమౌంట్ మాత్రమే మీరు వాడుకోవాలి.

అంతేకాదు పీఎఫ్(EPF) స్కీమ్‌లో చేరిన తర్వాత కనీసం ఒక సంవత్సరం అయినా కంటిన్యూగా సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. ఏడాది సర్వీస్ పీరియడ్ కంప్లీట్ అయితేనే మీ అకౌంట్‌లోంచి ఎలాంటి పాక్షిక విత్‌డ్రాలకు అయినా అప్లై చేసుకోవడానికి అర్హత వస్తుంది. అంతకంటే ముందు ఒక్క రూపాయి కూడా డ్రా చేయడం కుదరదు.

Amaravati : రాజధాని చుట్టూ ఏపీ పాలిటిక్స్..2029లో ప్రజలు ఏం తీర్పు ఇస్తారో ?

Related Articles

Back to top button