Kiran Kumar: కేంద్రంలో భారీ ప్రక్షాళన.. నల్లారి కిరణ్‌కు గవర్నర్ గిరి, కిషన్ రెడ్డికి ప్రమోషన్?
Kiran Kumar : ప్రస్తుతం మోదీ కేబినెట్లో 69 మంది మంత్రులు సేవలందిస్తున్నారు. ఈ కేబినెట్లో రాజ్యాంగ పరిమితుల ప్రకారం మరో 12 మందికి కొత్తగా ఛాన్స్ కల్పించే వెసులుబాటు ఉంది.
Kiran Kumar
ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఒకటే చర్చ సాగుతుంది. సెప్టెంబర్ నెల ప్రారంభంలో కేంద్రంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ల విదేశీ టూర్ ముగించుకుని సెప్టెంబర్ 1న భారత్‌కు తిరిగి రానున్నారు.
మోదీ అడుగుపెట్టిన మరుక్షణమే కేంద్ర పాలనా యంత్రాంగంలో కీలకమైన ప్రక్షాళన స్టార్ట్ అవుతుందనే ప్రచారం హస్తిన వర్గాల్లో ఓ రేంజ్లో సాగుతోంది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అలాగే కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకంతో పాటు, దేశవ్యాప్తంగా గవర్నర్ల బదిలీలు, అంతేకాకుండా బీజేపీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన పార్లమెంటరీ బోర్డు కూర్పుపైన కూడా ఊహాగానాలు క్లైమాక్స్‌కి చేరుకున్నాయి.
అయితే ఈ టోటల్ పొలిటికల్ డెవలప్‌మెంట్స్‌లో తెలుగు రాష్ట్రాల నేతలకు సంబంధించిన వార్తలు బాగా హీటు పుట్టిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కీలకమైన రాష్ట్రానికి గవర్నర్ పదవిని ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ బలమైన ప్రచారం సాగుతోంది.
మరోవైపు ప్రస్తుత కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యత్వం కల్పించి మరింత ఇంపార్టెన్స్ ఇస్తారని ఆ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి పేరు గవర్నర్ రేసులో ప్రముఖంగా వినిపించినా.. అఫీషియల్‌గా ముద్ర పడలేదు. అయితే ఈసారి మోదీ మార్క్ డెసిషన్‌తో కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు దక్కుతాయో లేదో వేచి చూడాలి.
అసలు ఈ కేబినెట్ మార్పుల వెనుక అసలైన లెక్కలను చూస్తే కనుక చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మోదీ కేబినెట్లో 69 మంది మంత్రులు సేవలందిస్తున్నారు. ఈ కేబినెట్లో రాజ్యాంగ పరిమితుల ప్రకారం మరో 12 మందికి కొత్తగా ఛాన్స్ కల్పించే వెసులుబాటు ఉంది.
అయితే ఇప్పుడు ఈ ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా, 70 ఏళ్ల వయస్సు దాటిన సుమారు 12 మందికి పైగా కేబినెట్ అలాగే సహాయ మంత్రులకు పదవుల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనుభవజ్ఞులైన వారిని తప్పించి, ఆ స్థానాల్లో యంగ్ అండ్ డైనమిక్ నాయకులకు అవకాశమిచ్చి భవిష్యత్ ఎన్నికల సాధనానికి కేబినెట్‌ను రెడీ చేయాలనేది ప్రధాని మోదీ టీమ్ వేసిన మాస్టర్ ప్లాన్‌గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా మోదీ మార్క్ మార్పులెప్పుడూ కూడా అత్యంత సీక్రెట్‌గా, ఎవరూ ఊహించని రీతిలోనే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీలు, ఇంటర్నల్ రిపోర్టుల ఆధారంగా లీడర్ల పెర్ఫార్మెన్స్ కార్డులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దీంతో ఈ సెప్టెంబర్‌లో జరిగే ఈ పొలిటికల్ రీషఫుల్ ద్వారా ఎవరెవరికి ప్రమోషన్లు రాబోతున్నాయి, ఎవరికి పదవీ గండం రాబోతుందనే టెన్షన్ కమలం వర్గాల్లో నెలకొంది. అయితే ఫైనల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఈ సస్పెన్స్, ఉత్కంఠ ఇలాగే కంటెన్యూ అవుతాయి.
Aadhaar Card : ఇకపై మీ ఆధార్ కార్డ్ కాపీలు అవసరం లేదు.. హోటల్ చెక్-ఇన్లలో కొత్త రూల్





