Just NationalJust PoliticalLatest News

Mamata Banerjee : మమతకు అంత ఈజీ కాదు…సీట్లు పెరిగినా బీజేపీకి అధికారం కష్టమే

Mamata Banerjee : దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కొన్ని రాష్ట్రాల ఫలితాలపై విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఆ జాబితాలో పశ్చిమ బెంగాల్ పేరు ఖచ్చితంగా ఉంటుంది

Mamata Banerjee

దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కొన్ని రాష్ట్రాల ఫలితాలపై విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఆ జాబితాలో పశ్చిమ బెంగాల్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గత మూడు దఫాలుగా టీఎంసీదే అధికారం. ఉక్కు మహిళగా పేరున్న మమతా బెనర్జీ(Mamata Banerjee) ఎప్పటికప్పుడు తన పట్టు నిలుపుకుంటూ వస్తున్నారు.

అయితే ఈ సారి మమతకు గెలుపు అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా అని ఆమె ఓడిపోతుందని కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. పలు సర్వేల్లో మమతా బెనర్జీ(Mamata Banerjee) అతి కష్టంమీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధిస్తారని తేలింది. అదే సమయంలో బీజేపీకి భారీగా సీట్లు పెరుగుతున్నట్టు వెల్లడైంది.

అయితే బీజేపీకి సీట్లు పెరిగినా అధికారాన్ని అందించేంత సంఖ్యాబలం రాదని చెబుతున్నారు. నిజానికి ఈసారి బెంగాల్ ప్రజల నాడిని చాలా సర్వేలు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయి. ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఎస్ఐఆర్(SIR) ద్వారా 91 లక్షల ఓట్లను తొలగించారు. కొన్నిచోట్ల 2021 ఎన్నికల్లో అభ్యర్థులు గెలిచిన మెజార్టీ కంటే ఎస్ఐఆర్ ద్వారా పోయిన నకిలీ ఓట్లే ఎక్కువగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బెంగాల్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా 11 జిల్లాల్లోని 70 అసెంబ్లీ స్థానాలు బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని డిసైడ్ చేయబోతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలో మమతా బెనర్జీ పోటీ చేసి ఓడిపోయిన నందిగ్రామ్, ఉప ఎన్నికల్లో గెలిచిన భవానిపూర్ నియోజకవర్గాలు కూడా ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Mamata Banerjee
Mamata Banerjee

మెడికో విద్యార్థినిపై రేప్ , టీఎంసీ పార్టీ నేతలు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇబ్బంది పెట్టినటువంటి పరిణామాలు మమతా బెనర్జీపై కొంత వ్యతిరేకతను తెచ్చాయి. అందుకే ఈసారి టీఎంసీ గెలుపు నల్లేరుపై నడక మాత్రం కాదన్నది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. కానీ ఈ వ్యతిరేకతను పూర్తిస్థాయిలో బీజేపీ క్యాష్ చేసుకోలేకపోతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

స్వయంగా ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహిస్తున్నా బెంగాల్ ఓటర్లు కాషాయ పార్టీకి అధికారాన్ని అప్పగించే పరిస్థితి లేదన్నది కొన్ని సర్వేల అంచనా. కానీ బీజేపీకి ఈసారి ఖచ్చితంగా సీట్లు భారీగా పెరగడం మాత్రం ఖాయమని సర్వేలన్నీ పక్కాగా చెబుతున్నాయి. అయితే ఆ పెరిగిన సీట్లు మేజిక్ ఫిగర్ కు కొంచెం దూరంలో మాత్రమే ఆగిపోతాయని విశ్లేషించాయి.

294 స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో 146 మేజిక్ ఫిగర్. చాలా సర్వేల అంచనా ప్రకారం టీఎంసీ 165 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే బీజేపీకి 110 స్థానాలు వరకూ వస్తాయని అంచనా వేసాయి. కాంగ్రెస్ కు 8, ఇతరులకు 4-6 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని సర్వేలు అంచనా వేసాయి.

Nara Lokesh : చంద్రబాబు సంచలన నిర్ణయం…టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నారా లోకేశ్

Related Articles

Back to top button