Prashanth Kishore : బీజేపీ నిర్లక్ష్యమే పీకేకు వరం.. ప్రత్యర్థిని లైట్ తీసుకుంటే ఇదే ఫలితమని చెప్పిన బంకీపూర్ ఎన్నికలు
Prashanth Kishore : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో బంకీపూర్ అసెంబ్లీ స్ధానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఇలా ఈ ఉపఎన్నిక రూపంలో పీకేకి ఊహించని అవకాశం దక్కింది.
Prashanth Kishore
ప్రశాంత్ కిషోర్..విజయవంతమైన రాజకీయ వ్యూహకర్త..తన రాజకీయ ఎత్తులతో ఎన్నో రాష్ట్రాల్లో కీలక నేతలను అధికారంలోకి తెచ్చిన వ్యక్తి. కానీ పీకే రాజకీయ ప్రస్థానం మాత్రం ఆయనకు ఓ చేదు అనుభవం. సొంత రాష్ట్రం బిహార్‌లో పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ ఘోర పరాజయాలను చవి చూశారు. దీంతో కొన్నాళ్లుగా మౌనం వహించారు.
అయితే ఉపఎన్నిక రూపంలో పీకేకి ఊహించని అవకాశం దక్కింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో బంకీపూర్(Bankipur) అసెంబ్లీ స్ధానానికి ఉప ఎన్నిక వచ్చింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని ప్రశాంత్ కిషోర్ ఈసారి రంగంలోకి దిగారు.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పీకే ఓటమిని మాత్రమే గుర్తు పెట్టుకున్న బీజేపీ.. జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్(Prashanth Kishore) బరిలో నిలిచినా కూడా చాలా లైట్ తీసుకుంది. రాజకీయాల్లో ఏ ప్రత్యర్ధినీ తక్కువ అంచనా వేయకూడదన్న విషయాన్ని బీజీపీ అగ్రనాయకత్వం పూర్తిగా మర్చిపోయింది.
ఇలా బీజేపీ ప్రశాంత్ కిషోర్(Prashanth Kishore)ను లైట్ తీసుకోవడంతోనే ఆయన విజయానికి ఎంట్రీ కార్డులు పడ్డాయని తెలుస్తోంది. ఇదే కాదు ప్రశాంత్ కిషోర్ విజయం వెనుక చాలా కారణాలున్నాయి. ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ ఉద్యమ ప్రభావం కూడా బిహార్ పైన కూడా పడింది. రాష్ట్రంలోనూ యువత రోడ్లెక్కారు. బీజేపీ తీరుకు వ్యతిరేకంగా గళం విప్పారు.

ఈ నిరసనలను తమకు అనుకూలంగా మార్చుకున్న పీకే.. బీజేపీని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా బీజేపీ,జేడీయూ ప్రభుత్వంలో మార్పులు కూడా పీకేకు కలిసి వచ్చాయి. క్లీన్ ఇమేజ్ ఉన్న నితీష్ కుమార్‌ను తప్పించి సామ్రాట్ చౌదరిని బీజేపీ సీఎంని చేసింది.
అంతగా విద్యావంతుడు కాకపోవడంతో సామ్రాట్ చౌదరిపై వ్యతిరేకత కూడా బంకీపూర్(Bankipur)లో పీకేకు కలిసి వచ్చింది. దీంతో ప్రశాంత్ కిషోర్‌కు సులభంగానే విజయం దక్కినట్లు అయింది. ఎట్టకేలకు బీహార్ అసెంబ్లీలో ప్రశాంత్ కిషోర్ తిరుగులేని విజయానికి ఈ విధంగా బీజేపీనే పరోక్షంగా సాయపడినట్టయింది.
Integrity : భాగస్వామిని భరించడం భారంగా ఉందా? బంధం గట్టిపడాలంటే ఈ 3 క్వాలిటీస్ ఉండాల్సిందే..





