Just NationalLatest News

Red Fort Terrorists: 32 చోట్ల విధ్వంసానికి స్కెచ్..  దర్యాప్తులో సంచలన విషయాలు

Red Fort Terrorists: ఈ కుట్ర వెనుక వైట్ కాలర్ టెర్రరిస్టులు ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

Red Fort Terrorists

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన బాంబు పేలుడు(Red Fort Terrorists) కేసు దర్యాప్తును భద్రతా ఏజెన్సీలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో విచారణ సాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ బ్లాస్ట్ కు డాక్టర్ ఉమర్ నబీనే కారణమని దాదాపుగా నిర్థారణకు వచ్చారు. అయితే ఈ బ్లాస్ట్ తో పాటు దేశవ్యాప్తంగా భారీ ఉగ్రదాడులకు స్కెట్ వేసినట్టు(Red Fort Terrorists) గుర్తించారు. అది కూడా ఒకటి రెండు చోట్ల కాదు ఏకంగా 32 చోట్ల పేలుళ్లకు పాల్పడేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ కుట్ర వెనుక వైట్ కాలర్ టెర్రరిస్టులు ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వారి స్కెచ్ భారీ స్థాయిలో ఉందనీ, పేలుడు పదార్థాలు నింపేందుకు 32 వాహనాలను సిద్ధం చేసుకునేందుకు ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. ఈ వాహనాలను ఢిల్లీతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఏకకాలంలో పేలుళ్లు జరిగేలా ప్రణాళిక రచించినట్టు తెలిపారు. దీని కోసం గత కొన్ని నెలలుగా పలు చోట్ల రెక్కీ నిర్వహించినట్టు కూడా గుర్తించారు. జనసామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రధాన నగరాలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఢిల్లీ బాంబ్ ప్లాస్ట్ కోసం ఉపయోగించిన ఐ20, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి కార్లనే ఎంపిక చేసుకున్నట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వాటిలో పేలుడు పదార్థాలను పెట్టేందుకు వీలుగా మెకానిక్ షెడ్లలో రీమోడలింగ్ కూడా చేయించుకున్నట్టు తెలుస్తోంది. వరుస పేలుళ్లకు పాల్పడాలన్నదే ఉగ్రవాదుల లక్ష్యంగా పెట్టుకున్నట్టు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

Red Fort Terrorists
Red Fort Terrorists

మొత్తం 8 మంది అనుమానిత ఉగ్రవాదులు 32 వాహనాల్లో పేలుడు పదార్థాలు నింపే బాధ్యతను తీసుకున్నట్టు అంచనాకు వచ్చారు. దీని కోసం పేలుడు పదార్ధాలు, కార్లను కొనుగోలు చేసేందుకు నిధులు వైట్ కాలర్ డాక్టర్లు సమకూర్చినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

నిధులు సేకరించినట్టు పలువురు డాక్టర్లపై అనుమానాలు బలపడ్డాయి. దీనికి సంబంధించిన సాక్ష్యాలను కూడా దర్యాప్తు బృందాలు సేకరించాయి. సుమారు 26 లక్షల రూపాయలను డాక్టర్ ఉమర్ నబీ . డాక్టర్ ముజమ్మిల్ గన్నై, డాక్టర్ షహీన్ సయ్యిద్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ కలిసి సేకరించినట్టు గుర్తించారు. బాగా చదువుకున్న యువకులు, వైట్‌కాలర్ ఉద్యోగులు ఈ ఉగ్ర కుట్ర ప్లాన్ చేయడంపై భద్రతా సంస్థలను షాక్ కు గురిచేసింది. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. నిందితులకు ఆశ్రయమిచ్చిన వారి గురించి కూడా ఆరా తీస్తున్నాయి.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button