Just NationalJust BusinessLatest News

TRAI New Rules : ఎయిర్‌టెల్, జియో, Vi యూజర్లకు ట్రాయ్ బిగ్ గిఫ్ట్..వేస్ట్ డేటాకి చెక్..

TRAI New Rules : ఇంటర్నెట్ వాడని వాళ్లు కూడా తప్పనిసరిగా నెట్ ప్యాక్ ఉన్న రీఛార్జ్‌లే చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పటి వరకూ ఉంది.

TRAI New Rules

మొబైల్ చేతిలో ఉంటే చాలు.. నెట్ వాడినా వాడకపోయినా రీఛార్జ్‌ల ప్యాక్‌ల కోసం టెలికాం కంపెనీలు జేబులు ఖాళీ చేసేస్తున్నాయి. ఇంటర్నెట్ వాడని వాళ్లు కూడా తప్పనిసరిగా నెట్ ప్యాక్ ఉన్న రీఛార్జ్‌లే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ త్వరలోనే ఆ దోపిడీకి చెక్ పడబోతోంది.

కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ, మెసేజ్‌లు పంపుకొనే జనరల్ యూజర్ల కోసం అలాగే ఇంట్లో వైఫై వాడుకునేవారి కోసం.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఒక కొత్త నిబంధనను అమల్లోకి తీసుకువస్తోంది.

ట్రాయ్ తీసుకొచ్చిన ఈ కొత్త గైడ్‌లైన్స్(TRAI New Rules) ప్రకారం ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi), రిలయన్స్ జియో వంటి దిగ్గజ నెట్‌వర్క్ కంపెనీలన్నీ కూడా అక్టోబర్ 21 వ తేదీ నుంచి తప్పనిసరిగా కేవలం వాయిస్ కాలింగ్ అండ్ SMS ఉండే స్పెషల్ ప్లాన్‌లను కూడా మార్కెట్లోకి తీసుకురావాలి.

కంపెనీలు ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న డేటా ప్లాన్‌ల టైమ్ లిమిట్ ఎంత ఉందో, అదే వ్యాలిడిటీతో ఈ నోడేటా ప్యాక్స్ కూడా అందుబాటులో తేవాలి. అంటే మెయిన్‌గా 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌లకు సమానంగా ఇవి ఉండటంతో, యూజర్లు 84 రోజులు , ఏడాది ప్లాన్‌ల వైపు చూడాల్సిన అవసరం అస్సలుండదు.

ఈ కొత్త కండీషన్ వల్ల ముఖ్యంగాగా ఫీచర్ ఫోన్లు, కీప్యాడ్ ఫోన్లు వాడేవాళ్లకి, ఇంట్లో వైఫై ఉండటంతో మొబైల్ డేటాతో పనిలేని వాళ్లకి, కేవలం కాల్స్ కోసం సెకండ్ సిమ్ మెయింటైన్ చేసే వాళ్లకి, అలాగే సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం ఉంటుంది. వాడకపోయినా నెట్ బిల్లు కోసం ప్రతి నెలా డబ్బులు తగలేయకుండా, తమకు కావలసిన కాలింగ్ సర్వీసులకు మాత్రమే మనీ చెల్లించే సదుపాయం వస్తుంది.

TRAI New Rules
TRAI New Rules

నిజానికి ఈ ప్రతిపాదనను ట్రాయ్(TRAI New Rules) 2024 డిసెంబర్‌లోనే తెచ్చినా కూడా, టెలికాం కంపెనీలు నామ్‌కే వాస్తే ప్లాన్‌లను పెట్టి వినియోగదారులను చాలా ఇబ్బంది పెట్టాయి. దీంతో సీరియస్ అయిన ట్రాయ్, 2026 ఏప్రిల్‌లో ముసాయిదా రిలీజ్ చేసి స్టేక్‌హోల్డర్లు, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, సెప్టెంబర్ 21వ తేదీన ఈ ఆర్డర్‌ను నోటిఫై చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుండటంతో, టెలికాం రంగంలో యూజర్లకు ఇదొక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.

EL NINO Effect : 2027 వరకు డేంజర్ బెల్స్..ఎల్‌నినో ప్రభావంతో క్లైమేట్ చేంజ్ భయం..

Related Articles

Back to top button