Vijay : ఆ పార్టీలతో కలిసేది లేదు..విజయ్ కీలక నిర్ణయం
Vijay : తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్ టీవీకే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో బిజీగా ఉంది
Vijay
తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్(Vijay) టీవీకే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో బిజీగా ఉంది. ఎన్నికల్లో గెలిచిన తన పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్(Vijay) సమావేశమయ్యారు. అనంతరం తమ శాసనసభాపక్ష నేతగా టీవీకే ఎమ్మెల్యేలు విజయ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, విజయ్ గవర్నర్ అపాయింట్ మెంట్ కోరడం వరుసగా జరిగాయి.
అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల కోసం టీవీకే ప్రయత్నాలు చేస్తోంది. అయితే తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల విషయంలో మాత్రం విజయ్ స్పష్టతతో ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ డీఏంకే, అన్నాడీఎంకే, బీజేపీలతో కలవకూడదని నిర్ణయించుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలవగా.. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాల్లో విజయం సాధించాయి.
దీంతో కాంగ్రెస్ తో పాటు పీఎంకే, వామపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయ్ భావిస్తున్నారు. ఇప్పటికే విజయ్ తండ్రి కాంగ్రెస్ మద్దతు కోరారు. దీనిపై కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 5, పీఎంకే 4, విసికే 2, సీపీఎం 2, సిపిఐ 2, డిఎండికే ఒక స్థానంలో గెలిచాయి. ఈ పార్టీల్లో ఏ నాలుగు మద్దతిచ్చినా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతుంది.
ప్రస్తుతం కాంగ్రెస్ తో పాటు పీఎంకే, వామపక్షాలతో టీఎంకే వర్గాలు చర్చలు జరుపుతున్నాయి. వీటిలో కాంగ్రెస్ మద్ధతు విజయ్ కు ఇప్పటికే లభించింది. నిన్న విజయ్ టీవీకే పార్టీ గెలుపు ఖాయమవగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. కాంగ్రెస్ మద్దతు టీవీకేకు ఉంటుందన్నారు.

ఇది ఊహించిందే.. ఎందుకంటే విజయ్ బీజేపీకి వ్యతిరేకంగానే పార్టీ పెట్టారు. మిగిలిన చిన్న పార్టీలతో మాట్లాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ సిద్ధమయ్యారు. పీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ, డీఎండీకే పార్టీలు కూడా విజయ్ పార్టీతో కలిసేందుకు సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
దీనిలో భాగంగా గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన విజయ్ ఆయనకు వినతి పత్రం అందజేయనున్నారు. 10 రోజుల్లో బలం నిరూపించుకుంటానని, ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరనున్నారు.బుధవారం ఈ పొత్తులు, ప్రమాణ స్వీకారం తేదీ, బలపరీక్ష వంటి అంశాలపై స్పష్టత వస్తుందని టీవీకే వర్గాలు తెలిపాయి
Mamata Banerjee : నేను రాజీనామా చేయను..ఏం చేస్తారో చేసుకోమన్న మమత





