Just NationalJust PoliticalLatest News

Mamata Banerjee : మమతా బెనర్జీకి షాక్..బెంగాల్ ప్రభుత్వం బర్తరఫ్

Mamata Banerjee : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడిన తర్వాత తదనంతర పరిణామాలు కూడా అంతే మలుపులు తిరుగుతున్నాయి.

Mamata Banerjee

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడిన తర్వాత తదనంతర పరిణామాలు కూడా అంతే మలుపులు తిరుగుతున్నాయి. కేరళ, పుదుచ్చేరి, అస్సోంలో ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకోలేదు. కానీ తమిళనాడు, బెంగాల్ లో మాత్రం ఊహించని విధంగా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

అటు తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ టీవీకే పార్టీ ప్రయత్నాలు చేసుకుంటుండగా.. ఇటు బెంగాల్ లో మమతా బెనర్జీ(Mamata Banerjee) తన పదవికి రాజీనామా చేయకుండా భీష్మించుకుని కూర్చున్నారు. తాను రాజీనామా చేసేది లేదనీ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ విసిరిన నేపథ్యంలో బెంగాల్ గవర్నర్ ఆర్ ఎన్ రవి కీలక నిర్ణయం తీసుకున్నారు.

మమత బెనర్జీ(Mamata Banerjee) ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సాధారణంగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఓడిపోయిన గత ప్రభుత్వం నుంచి సీఏంగా ఉన్న వ్యక్తి గవర్నర్ కు రాజీనామా సమర్పించాలి. నిబంధనల ప్రకారం ఆ ప్రభుత్వం కూడా సహజంగానే రద్దవుతుంది. అయితే బీజేపీ కుట్రపూరితంగా గెలిచిందని ఆరోపిస్తూ మమతా బెనర్జీ రాజీనామా చేయలేదు.

దీంతో గవర్నర్ ఆర్ ఎన్ రవి తన అధికాారాలతో గత ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ప్రజా తీర్పును గౌరవించకుండా పదవిలో కొనసాగాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని గవర్నర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం మరియు రాజ్యాంగబద్ధమైన పాలనను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.

Mamata Banerjee
Mamata Banerjee

నిజానికి బెంగాల్ శాసనసభ గడువు గురువారంతో ముగిసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని వివరిస్తూ రాజ్‌భవన్ ఒక లేఖను కూడా విడుదల చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174, క్లాజ్ (2) యొక్క సబ్-క్లాజ్ (బి) ద్వారా తనకు సంక్రమించిన అధికారంతో బెంగాల్ శాసనసభను రద్దు చేస్తున్నట్టు గవర్నర్ దానిలో పేర్కొన్నారు.

దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. మరోవైపు ఈ ఎన్నికల్లో 200కు పైగా సీట్లతో ఘనవిజయం సాధించిన బీజేపీ, ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రజలు తమకు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. గవర్నర్ నుంచి ఆహ్వానం అందిన వెంటనే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది.

Manoj Tiwary : టీ, బిస్కెట్లు తినడమే నా పని..మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు

Related Articles

Back to top button