Just NationalJust PoliticalLatest News

Tamilnadu Elections : తమిళనాడు ఎన్నికలపై సంచలన సర్వే…గెలిచేది ఎవరో తెలుసా ?

Tamilnadu Elections : రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరి దృష్టి తమిళనాడుపైనే ఉంది.

Tamilnadu Elections

రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరి దృష్టి తమిళనాడు(Tamilnadu Elections)పైనే ఉంది. ఈసారి ఇక్కడ ముక్కోణపు పోటీ ఉండడమే దీనికి కారణం. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకేతో పాటు ఈసారి నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ అక్కడి ఎన్నికలను రసవత్తరంగా మార్చింది. టీవీకే పార్టీ స్థాపించిన దళపతి తొలిసారి రాజకీయాల్లో తన సత్తా పరీక్షించుకోనున్నారు.

డీఎంకే-కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే-బీజెపీ కూటమి పోటీ చేస్తుండగా…విజయ్ మాత్రం ఒంటరిగా బరిలో నిలిచాడు. బీజేపీతో కలిసి పోటీ చేస్తాడని భావించినా విజయ్ మాత్రం పొత్తులు పెట్టుకోవడం లేదని ప్రకటించాడు. మొత్తం అన్ని నియోజక వర్గాల్లో టీవీకే పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. దీంతో ట్రయాంగిల్ వార్ తప్పడం లేదు.

ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఏప్రిల్ 23న ఒకే విడతలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల(Tamilnadu Elections) పోలింగ్ జరగనుంది. ఒకవైపు పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా ఉంటే మరోవైపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటూ పలు సంస్థలు సర్వేలతో హోరెత్తిస్తున్నాయి.

తాజాగా లోక్ పోల్ నిర్వహించిన సర్వే అంచనా ప్రకారం సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని కూటమి ఈ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తుందని తేలింది. ఈ సర్వే మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించారు. డీఎంకే కూటమి 234 అసెంబ్లీ స్థానాలకు గాను 181 నుంచి 189 సీట్లు గెలుచుకునే అవకాశముందని వెల్లడించింది.

అలాగే  40.1 శాతం ఓటు షేరు సాధిస్తుందని సర్వే వెల్లడించింది.విపక్ష ఏఐఏడీఎంకే కూటమి 38 నుంచి 42 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది. ఆ కూటమికి 29 శాతం ఓటు షేరు వస్తుందని సర్వే అంచనా వేసింది.ఇదిలా ఉంటే కొత్త పార్టీ పెట్టి ఒంటరిగా బరిలోకి దిగుతున్న విజయ్ పార్టీ అనూహ్య రీతిలో ఓట్లు సాధిస్తుందని సర్వే వెల్లడించింది.

విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) తొలి ఎన్నికల్లోనే మంచి ఓటు శాతం సాధిస్తుందని తెలిపింది. దళపతి టీవీకే పార్టీ 8-10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.ఈ పార్టీకి 23.9 శాతం ఓటు షేరు రావచ్చని సర్వే వెల్లడించింది. ఎన్‌టీకే, ఇతర పార్టీలు పెద్దగా ప్రభావం చూపవని తెలిపింది.

Tamilnadu Elections
Tamilnadu Elections

ఇక  సీఎం అభ్యర్థిగా ఎక్కువ మంది ప్రజలు ఎంకే స్టాలిన్‌ను కోరుకుంటున్నారనీ సర్వే తేల్చింది. ఆయన తర్వాత స్థానాల్లో విజయ్, పళనిస్వామి ఉన్నారనీ తెలిపింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలే డీఎంకే కూటమికి విజయాన్ని అందించబోతున్నట్టు సర్వే వెల్లడించింది  కళైగ్నర్ మహిళా ఉరిమై తొగై , ఉచిత బస్ ప్రయాణం, బ్రేక్‌ఫాస్ట్ పథకాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో మంచి ఆదరణ పొందాయని సర్వే వెల్లడించింది.

మరోవైపు విజయ్ టీవీకే పార్టీకి యువత, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారు అండగా నిలుస్తారనీ తేల్చింది.అలాగే ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నవారి నుంచి మంచి మద్దతు లభిస్తుందని తెలిపింది. కానీ విజయ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్న కారణంగా తక్కువ సీట్లకే పరిమితం కానుందని సర్వే వెల్లడించింది.

Dubai : గల్ఫ్‌ దేశాలపై యుద్ధం దెబ్బ…దుబాయ్‌ను దెబ్బ కొట్టిన ట్రంప్‌

Related Articles

Back to top button