9 Types Of Naivedhyas : పండుగ రోజు నోరూరించే ప్రసాదాలు.. 9రకాల సాంప్రదాయ రుచులతో వరలక్ష్మీ దేవికి నివేదన..
9 Types Of Naivedhyas : నోరూరించే సాంప్రదాయ రుచులతో పాటు అమ్మవారి కటాక్షం పొందడానికి ఈ వరలక్ష్మి వ్రతం రోజు చేసే 9 రకాలైన ప్రసాదాలు ఏంటో ఒకసారి చూద్దాం.
9 Types Of Naivedhyas
శ్రావణ మాసం వచ్చిందంటేనే చాలు తెలుగు ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం రోజు అయితే ఇల్లు లక్ష్మీకళతో నిండిపోతుంది. అయితే అమ్మవారికి పూజ ఎంత ముఖ్యమో, తల్లికి శ్రద్ధగా తయారుచేసే నైవేద్యాలు కూడా అంతే ముఖ్యం.
మన సనాతన సంప్రదాయంలో సాత్వికమైన వంటకాలతో పాటు, పవిత్రమైన వంటకాలను మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ఆచారం ఉంది. అలా నోరూరించే సాంప్రదాయ రుచులతో పాటు అమ్మవారి కటాక్షం పొందడానికి ఈ పండగ రోజు 9 రకాలైన ప్రసాదాలు (9 Types Of Naivedhyas) ఏంటో ఒకసారి చూద్దాం.
ఈ పవిత్రమైన రోజున పులిహోరను అమ్మవారికి తప్పనిసరిగా సమర్పిస్తారు. చింతపండు రసం, పసుపు, ఘుమఘుమలాడే కరివేపాకు, వేరుశెనగ గుళ్లతో చేసే పులిహోర మహా నైవేద్యంగా భావిస్తారు.
దీంతో పాటు కమ్మని పెరుగు, సరిపడా తాలింపు, దానిమ్మ గింజలతో అలంకరించిన దధ్యోజనం తయారు చేస్తారు.
ఇక తీపి వంటకాల విషయానికి వస్తే కొత్త బియ్యం, చిక్కటి పాలు, బెల్లం , కమ్మని నెయ్యి, యాలకుల సువాసనతో చేసిన పరమాన్నం అలాగే సేమ్యా, డ్రైఫ్రూట్స్, పాలతో చేసే సేమ్యా పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
మరీ ముఖ్యంగా మినప్పప్పు, బెల్లం , పచ్చి శనగపప్పుతో పూర్ణాలతో తయారు చేసే పూర్ణపు బూరెలు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యంగా చెబుతారు.
అంతేకాకుండా గోధుమరవ్వ, నెయ్యి, జీడిపప్పుతో తయారుచేసే రవ్వ కేసరితో పాటు బియ్యం, పెసరపప్పు, బెల్లం, జీడిపప్పు కాంబినేషన్లో చేసే బెల్లం పొంగలి ప్రత్యేక ప్రసాదాలుగా నిలుస్తాయి.

ఇక కారపు వంటకాల్లో ఉడికించిన కొమ్ముశనగలకు తాలింపు వేసి, తురిమిన కొబ్బరి కలిపి చేసే శనగల ప్రసాదంతో పాటు మినప్పప్పుతో చేసే కరకరలాడే గారెలు పూజలో తప్పనిసరిగా పూజలో ఉంచుతారు.
ఇవన్నీ ఒకెత్తయితే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర సమపాళ్లలో కలిపి తయారుచేసిన పంచామృతం అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యంగా పండితులు చెబుతారు.
Varalakshmi Vratam Prasadam : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. ఈ 5 నైవేద్యాలు ఈజీగా ఇలా ట్రై చేయండి..





