Akshaya Tritiya:అక్షయ తృతీయ వేళ ఆకాశన్నంటుతున్న పసిడి, వెండి ధరలు
Akshaya Tritiya అక్షయ తృతీయ ఎఫెక్ట్ వల్ల ధరలు ఎంత పెరిగినా, సెంటిమెంట్‌కు ప్రాధాన్యతనిచ్చే ఇండియన్స్ మాత్రం నగల షాపుల వద్ద బారులు తీరుతూనే ఉన్నారు.
Akshaya Tritiya
ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, మరోవైపు అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినా.. పెట్టుబడిదారులకు మాత్రం బంగారంపై పెట్టుబడి అనేది సురక్షితమైన ఆశ్రయంగా కనిపిస్తోంది. అందుకే రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ ధరలు చుక్కలను తాకుతున్నాయి. ముఖ్యంగా నేడు ఏప్రిల్ 19, ఆదివారం అక్షయ తృతీయ కావడంతో, ధర ఎంత ఉన్నా సరే లక్ష్మీదేవి ప్రతిరూపమైన బంగారాన్ని, వెండిని ఇంటికి తెచ్చుకోవడానికి ప్రజలు పోటీ పడుతున్నారు.
ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,55,780గా ఉండగా, జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,800 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ. 1,55,930 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ. 1,42,950 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక దక్షిణాదిలోని మెయిన్ సీటీలయిన చెన్నై, బెంగళూరులలో ధరలు మరింత భగ్గుమంటున్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,660కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,43,600 పలుకుతోంది.
బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా ఈ అక్షయ తృతీయ రోజు రికార్డు ధరలను తాకుతోంది. సాధారణంగా బంగారం కొనలేని వారు వెండి వస్తువులను కొని అక్షయ తృతీయ (Akshaya Tritiya) జరుపుకుంటారు, కానీ ఇప్పుడు వెండి ధరలు చూస్తుంటే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలలో కిలో వెండి ధర గరిష్టంగా రూ. 2.8 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఢిల్లీ, బెంగళూరులలో కొంత వరకూ తక్కువగా ఉన్నా సరే, అక్కడ కూడా కిలో వెండి రూ. 2.75 లక్షలు పలుకుతోంది.

అక్షయ తృతీయ(Akshaya Tritiya) ఎఫెక్ట్ వల్ల ధరలు ఎంత పెరిగినా, సెంటిమెంట్‌కు ప్రాధాన్యతనిచ్చే ఇండియన్స్ మాత్రం నగల షాపుల వద్ద బారులు తీరుతూనే ఉన్నారు. ఇది కేవలం ఒక లోహపు కొనుగోలు మాత్రమే కాదు, భవిష్యత్తు కోసం చేసే ఒక సురక్షితమైన పెట్టుబడి అని ప్రజలు భావిస్తున్నారు.
కాగా ఈ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని జ్యువెలరీ షాపులు మేకింగ్ ఛార్జీలు, తరుగు, డిస్కౌంట్లతో ఆకట్టుకుంటున్నాయి. అందుకే మీరు బంగారం కొనేముందు షాపుల మధ్య ధరలను బేరీజు వేసుకోవడం మంచిది. గోల్డ్ కొనేటప్పుడు తప్పనిసరిగా బీఐఎస్ (BIS) హాల్ మార్క్ ముద్రను గమనించాలి. సిల్వర్ కొనేటప్పుడు కూడా దాని నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు, బిల్లు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
Nuclear Energy : పురాణ కాలంలోనే అణుశక్తి ఉందా? మన అస్త్రాల వెనుకున్న అద్భుత సైన్స్ ఏంటి?





