Just SpiritualJust LifestyleLatest News

Photo Frames : ఇంట్లో ఫోటోల ఫ్రేమ్‌లు మీ జీవితాన్ని మారుస్తాయా?..బంధాలను బలపరిచే వాస్తు చిట్కాలు

Photo Frames : ఫోటోలు కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కావు. మన కంటికి నిత్యం కనిపించే ఫ్యామిలీ పిక్చర్స్ ఇంటి పరిసరాల్లో ఒక శక్తివంతమైన వైబ్రేషన్‌ను, పాజిటివ్ వేవ్స్‌ను క్రియేట్ చేస్తాయి.

Photo Frames

ఇల్లు అనేది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు, అనుబంధాలు, జ్ఞాపకాలు, భావోద్వేగాలు నిండి ఉండే ఒక పవిత్రమైన ప్రాంగణం. అందుకే దీనికి ప్రతీకగా చాలామంది తమ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి దిగిన ఫోటోలను పెట్టుకుంటారు.

అయితే ఈ ఫోటోలు కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కావు. మన కంటికి నిత్యం కనిపించే ఈ ఫ్యామిలీ పిక్చర్స్ ఇంటి పరిసరాల్లో ఒక శక్తివంతమైన వైబ్రేషన్‌ను, పాజిటివ్ వేవ్స్‌ను క్రియేట్ చేస్తాయి.

భారతీయ ప్రాచీన వాస్తు శాస్త్రం ప్రకారం చూస్తే..మనం ఇంట్లో ఏ వస్తువును ఎక్కడ ఉంచుతామో, అది మన ఆలోచనలు, జీవన శైలిపై అలాంటి ఎఫెక్ట్‌నే చూపిస్తుంది. అదే విధంగా ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలను సరైన దిశలో, సరైన పద్ధతిలో అమర్చినప్పుడు ఆ ఇంట్లో ఐక్యత, ఆనందం, పరస్పర అవగాహన , శాంతి పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

ఫ్యామిలీ ఫోటోలను అమర్చడానికి వాస్తు శాస్త్రంలో అత్యంత పవిత్రమైన , అనుకూలమైన స్థానంగా నైరుతి (South-West) దిశను చెబుతారు. ఎందుకంటే నైరుతి దిశ అనేది భూమి తత్త్వానికి , స్థిరత్వానికి సంకేతంగా అంతా భావిస్తారు. ఈ దిశలోని గోడలపై ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఉన్న ఫోటోలను ఉంచడం వల్ల ఇంట్లోని మానసిక అనుబంధాలు మరింత గట్టిపడతాయి.

ఈ దిశలో పెట్టడం వల్ల ముఖ్యంగా దంపతులు , తల్లిదండ్రులు, పిల్లల మధ్య తరచూ వచ్చే చిన్నచిన్న అభిప్రాయ భేదాలుంటే అవి తొలగిపోయి, కుటుంబంలో ఐక్యత బలపడుతుంది. ఒకవేళ నైరుతి దిశ అందుబాటులో లేకపోతే కనుక, పశ్చిమ (West) దిశలో కూడా ఈ కుటుంబసభ్యుల ఫోటోలను అమర్చుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది.

అంతేకాదు దిశతో పాటు మనం ఎలాంటి ఫోటోలను తగిలిస్తున్నామన్నది కూడా అంతే ముఖ్యం. ఇంట్లో ఎప్పుడూ కుటుంబమంతా కలిసి సంతోషంగా నవ్వుతున్న, ఆనందకరమైన సందర్భాల్లో తీసిన ఫోటోలనే ఫ్రేమ్(Photo Frames) చేయించి ఉంచాలి. పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ మనస్సును ఆహ్లాదపరిచేవిగా ఉండే ఫోటోలు ఆ ఇంట పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి.

అలాగే పగిలిపోయిన ఫ్రేమ్‌లు(Photo Frames), చిరిగిపోయిన, డల్‌గా ఉంటూ మసకబారిన ఫోటోలను ఇంట్లో ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని వెంటనే మార్చడం మంచిది.

Photo Frames
Photo Frames

దీంతో పాటు ఫోటోలను అమర్చేటప్పుడు కొన్ని చిన్నచిన్న పనులు చేయడం వల్ల ఇంటి అందంతో పాటు వాస్తు బలం కూడా పెరుగుతుంది. ఫోటో ఫ్రేమ్‌లు ఎప్పుడూ కంటి చూపునకు సరిపడే సరైన ఎత్తులోనే ఉండాలి. అంటే మరీ బాగా ఎత్తులో లేదా బాగా కిందకు వేలాడదీయకూడదు.

అలాగే వాటిపై దుమ్ము, ధూళి చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా మెయిన్ ఎంట్రన్స్‌కు ఎదురుగా, మెట్ల కింద లేదా బాత్‌రూమ్‌ గోడలకు ఆనుకుని ఉండే ప్రాంతాల్లో కుటుంబసభ్యులతో ఉన్న ఫోటోలను పెట్టకూడదు. అయితే ఇవి పూర్తిగా సాంప్రదాయ వాస్తు విశ్వాసాలను బేస్ చసుకుని చెప్పబడిన మార్గదర్శకాలు మాత్రమే.

Date Of Birth : ఈ నెంబర్ వారికి సొసైటీలో గౌరవం పెరుగుతుంది..వీరికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం

Related Articles

Back to top button