Just SportsLatest News

Ajit Agarkar : అగార్కర్‌ను కంటిన్యూ చేస్తారా? కట్ చేస్తారా ?.. తేల్చుకోలేకపోతున్న బీసీసీఐ..

Ajit Agarkar : అగార్కర్ చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ప్రస్తుత టర్మ్‌లో టీమిండియా వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుచుకుంది.

Ajit Agarkar

భారత క్రికెట్ జట్టుకు సంబంధించి ఆటగాళ్లు, కెప్టెన్ ఎంత కీలకమో సెలక్టర్లు కూడా అంతే కీలకం. ఎందుకంటే జట్టును ఎంపిక చేసే క్రమంలో ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. దానిని తట్టుకుని జట్టును ఎంపిక చేసినా మెరుగైన ఫలితాలు రాకపోతే వచ్చే విమర్శలను వారు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తున్న అజిత్ అగార్కర్(Ajit Agarkar) పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వచ్చే సెప్టెంబర్‌తో చీఫ్ సెలక్టర్ గా అగార్కర్ పదవీకాలం ముగిసిపోతుంది. 2027 వన్డే ప్రపంచకప్ ముగిసే వరకూ కొనసాగించమని బీసీసీఐకి చాలా విజ్ఞప్తులు కూడా చేశాడు. దీనిపై బోర్డు మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే అగార్కర్‌(Ajit Agarkar)ను పంపించడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుండడంతో బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది. అగార్కర్ చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ప్రస్తుత టర్మ్‌లో టీమిండియా వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుచుకుంది. కానీ అగార్కర్ సారథ్యంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై మాత్రం విమర్శలు వచ్చాయి.

రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం దీనిలో ప్రధానంగా చెప్పుకోవాలి. అలాగే సూర్యకుమార్ యాదవ్‌ను ఇటీవలే టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పించేశారు. హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 పగ్గాలు అప్పగించడం చర్చనీయాంశమైంది.

జైస్వాల్‌కు అవకాశమివ్వకపోవడం, అలాగే సీనియర్లతో గంభీర్ వైఖరికి సంబంధించి కథనాలు కూడా వచ్చాయి. దీనిపై అగార్కర్ స్పందించకపోవడంతో కోహ్లీ,  రోహిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్లకు గంభీరే కారణమని వార్తలు వచ్చినా అగార్కర్ జోక్యం చేసుకోలేదంటూ రోకో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

Ajit Agarkar
Ajit Agarkar

ఇప్పుడు వన్డే ప్రపంచకప్ కోసం జట్టు ప్రణాళికల్లో రోహిత్ లేడంటూ వచ్చిన వార్తల వెనుక కూడా గంభీర్ ఉన్నాడన్నది అభిమానుల వాదన. అలాగే నిలకడ లేకపోయినా హర్షిత్ రాణా వంటి వారికి అన్ని ఫార్మాట్లలో అవకాశాలు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఇదిలా ఉంటే అగార్కర్ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు హాజరుకాకుండా కేవలం యాప్‌లలో స్కోర్లు చూస్తున్నారంటూ దేశవాళీ ఆటగాళ్లను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వచ్చాయి.

ఇలా గంభీర్, అగార్కర్ ఇద్దరూ కలిసి సీనియర్లను తప్పించడం దగ్గర నుంచి టాలెంట్ ఉన్న కొందరు యువ ఆటగాళ్లను పక్కన పెడుతున్నారన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ విమర్శలు,ఆరోపణలతో అటు చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్‌ను కొనసాగించడం బీసీసీఐకి తలనొప్పిలా మారే అవకాశముంది.

Soya Beans : బరువు తగ్గాలనుకుంటున్నారా? ..అయితే మీ డైట్‌లో సోయాబీన్స్ యాడ్ చేసుకోండి..

Related Articles

Back to top button